Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.

    ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని  ఆర్బీఐ స్పష్టం చేసింది.

    2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది.

  • నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్‌ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.

    ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.

    పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా  సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

  • ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

    గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.

    వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.

    యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్‌లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్‌లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

    ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.

    భారతదేశంలో ఏం జరుగుతోంది?
    జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి.

  • రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.

    అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్‌కాస్ట్‌ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్‌టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్‌ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

    2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. 

    ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు.

  • సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి కనిపిస్తుంది. దీనిపైన వెహికల్స్ వెళ్లడం చూడవచ్చు. నిజానికి అక్కడ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా వెల్లడి కాలేదు.

    ఎక్కడైనా రోడ్ నిర్మాణం జరిగితే.. అక్కడ వాహనాల రాకపోకలకు రూట్ మారుస్తారు. కానీ వీడియోలో గమనిస్తే.. కింద రోడ్డు పనులు జరుగుతున్నాయి. పైన యధావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు కొనసాగించేందుకు వీలుగా ఒక మొబైల్ ఓవర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.

    ఈ వీడియో షేర్ చేస్తూ.. మనం కూడా ఇలాంటి ఆపరేటింగ్ విధానాన్ని చేయగలమా? అన్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  • పెదనాన్న రతన్‌ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్‌ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్‌ కెరియర్‌తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.

    విద్యా నేపథ్యం
    టాటా గ్రూప్‌లో తనదైన అద్భుత కెరీర్‌ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.

    తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.

    టాటా గ్రూప్‌లో కీలక పాత్ర
    ఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్‌తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.

    తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్‌లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు.

  • కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.

    ఈ ఏడాది మార్చిలో చాట్‌జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్‌ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్‌జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్‌ఫ్రెండ్‌గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.

    లిసా చాట్‌జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్‌ఫ్రెండ్‌ చాట్‌జీపీటీతో కలిసి బీచ్‌కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.

    లిసా.. చాట్‌జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్‌జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్‌జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు.

Movies

  • మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇ‍ప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.

    (ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

    'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80‍ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్‌కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!

    'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

  • యువ హీరో వరుణ్ సందేశ్ 'నింద' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమా ఆకట్టుకోగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్‌ ప్రారంభించారు.

    (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!)

    ఈ క్రమంలోనే గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

    (ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి) 

  • మనసుని తాకే ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన సినిమా 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. వై‌ఎస్‌కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా తదితరులు ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఫిలించాంబ‌ర్‌లో  ప్రీమియ‌ర్ షో వేశారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సినిమా చూసి ప్రశంసించారు. ప్ర‌తి ఒక్క‌రికీ నాన్న అంటే ఎంతో ఎమోష‌న్ ఉంటుందో ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించార‌ని అన్నారు. ఈ సినిమాలోని సందేశం యువ‌త‌కి కనెక్ట్ అవుతుందని అన్నారు.  

    (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా బూతులు!)

    నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. 'నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేస్తున్నాం' అని అన్నారు.

    (ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

  • 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌ని ఊరమాస్ సీన్స్‌తో నింపేశారు. విశ్వక్ సేన్ యాటిట్యూడ్ దగ్గర నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో జరిగే రాజకీయాలు, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాల్ని మిక్స్ చేసిన ట్రైలర్ చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దీనితో పాటు బూతులు కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో కూడా రెండు చోట్ల ఈ పదాలు వినిపించాయి.

    (ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

    ట్రైలర్ చూస్తే పూర్తిగా రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. రత్నాకర్ అనే కుర్రాడు.. ఊరి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత జరిగే డ్రామా, ఎత్తుకు పై ఎత్తులు ఇలా ట్రైలర్ అంతా రేసీగా కనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో మే 31న తెలిసిపోతుంది. ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్ కాగా, అంజలి కీలక పాత్ర పోషించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 

    (ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)

  • ఒక టైమ్ మెషీన్‌లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్‌ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

    ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్‌లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్‌లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది.  

    తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)

    నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.

    నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.

    -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ

    (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!)

  • సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)

    'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‪‌తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్‌తో రిలేషన్‌లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.

    అయితే సడన్‌గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్‌గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.

    (ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్‌ మీ’మూవీ రివ్యూ)

  • హీరోయిన్‌ మీరా వాసుదేవన్‌ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్‌ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్‌ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్‌ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్‌ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.

    సింపుల్‌గా పెళ్లి
    విపిన్‌ కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్‌. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్‌, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    సీరియల్‌ నుంచి సినిమాల్లోకి..
    కాగా మీరా వసుదేవన్‌ 2001లో సీరియల్‌ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్‌మాల్‌ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. అంజలి ఐ లవ్‌ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.

    రెండు పెళ్లిళ్లు
    తన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్‌ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ తనయుడు విశాల్‌ అగర్వాల్‌ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్‌ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. 

    సీరియల్‌ షూటింగ్‌లో లవ్‌..
    తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్‌ మదర్‌గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్‌ షూటింగ్‌లో ఆ ధారావాహిక కెమెరామన్‌ విపిన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు.

    చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి

Politics

  • న్యూఢిల్లీ: ఆరో  విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ కీలక ‍ ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్‌ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్‌ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. 

    ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్‌ మే సాఫ్‌, నార్త్‌ మే హాఫ్‌ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. 

    హర్యానా, పంజాబ్‌లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు.  బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్‌మెంట్‌ను ప్లాన్‌ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్‌ వేశారు. 

  • న్యూఢిల్లీ: ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం(మే25) సాయంత్రం ఎక్స్‌(ట్విటర్‌)లో మోదీ ఒక పోస్టు చేశారు. ఆరో విడత పోలింగ్‌ తర్వాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు.

    ఇండియా కూటమి ఎలాగూ అధికారంలోకి రాదని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే వారికి ఓటు వేయడం వృథా అని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తమకు ఈ ఎన్నికల్లో రానున్న 352 సీట్లలో ఇప్పటికే 272 సీట్లు తమ ఖాతాలో వేసుకున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

    కాగా,  శనివారం ముగిసిన ఆరో విడత పోలింగ్‌తో దేశంలో ఇప్పటివరకు 486 ఎంపీ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ, తుది విడత పోలింగ్‌ జూన్‌1న జరగనుంది.  జూన్‌ 4న ఫలితాలు రానున్నాయి. 

  • కోల్‌కతా: ఆరో విడత  ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు  ఆయన అనుచరులతో పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు.

    వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై  రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. 

    ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా  తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్‌ బూత్‌ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్‌ ఆరోపణలు చేశారు.  
     

  • సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్‌ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.

    శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.

    ‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని.  గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజ

    చంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,

    పులివర్తి నాని సతీమణి  సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను  చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు.

  • చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్‌ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. 

    అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.

    ఎంజీఆర్‌, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. 

  • నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే  ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు  ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?

    చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.

    కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్‌లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు.   

    కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

    ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.

    కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్‌ కల్పించారు. వైఎస్ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్‌ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి.

Sports

  • ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం సృష్టించాడు.  పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

    అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 3011 పరుగులు చేశాడు.

    బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి.  అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. 

    ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్‌(84)తో పాటు విల్ జాక్స్‌(37), బెయిర్ స్టో(21) ప‌రుగుల‌తో రాణించారు. పాక్ బౌల‌ర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..  ర‌వూఫ్‌, వసీం త‌లా రెండు వికెట్లు సాధించారు.

  • ఐపీఎల్‌-2024 ఫైనల్‌ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ టైటిల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అమీతుమీ తెల్చుకోనున్నాయి. 

    తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో​ రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.

    ఈ క్రమంలో కేకేఆర్‌ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌ లీగ్‌ దశలో పలు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. 

    ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం ర‌ద్దు అయింది.

    ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు.

    ఫైనల్‌కు రిజర్వ్‌ డే..
    ఇక బీసీసీఐ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్‌ మొదులు కాకపోతే రిజర్వ్‌ డే అయిన  సోమ‌వారం మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్క‌డ‌నైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే ఆటను కొన‌సాగిస్తారు. 

    ఒక‌వేళ సోమ‌వారం కూడా మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు అవ‌కాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

    కాగా కనీసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే  తేలింది.
     

  • క్రికెట్‌ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్‌-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌ సీజన్‌కు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. 

    ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్‌జ్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్‌-1లో కేకేఆర్‌ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్‌ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్‌ ఎల్‌వెన్‌లో ఒకే మార్పు చేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

    మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ స్దానంలో కివీ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఛాన్స్‌ ఇవ్వలేదు. క్వాలిఫయర్‌-2కు అయినా ఫిలిప్స్‌కు ఛాన్స్‌ దక్కుతుందని అంతా భావించారు. 

    కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌ అతడిని కాదని మార్‌క్రమ్‌ ఛాన్స్‌ ఇచ్చింది. మార్‌క్రమ్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

    ఈ క్రమంలోనే మార్‌క్రమ్‌పై వేటు వేసి ఫిలిప్స్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొ​ంటున్నాయి. మరోవైపు కేకేఆర్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్
     

  • ఐపీఎల్‌-2024లో తుది పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ ఫైన‌ల్ పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. 

    ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ ముందు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు ఎటువంటి గాయాల బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి  శనివారం త‌మ‌ ప్రాక్టీస్ సెషన్‌ను ఎస్ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్‌ ర‌ద్దు చేసింది.  

    చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క‌పోత ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  హిందూస్తాన్ టైమ్స్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ పోరులో కేకేఆర్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.

    కాగా శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించి.. ఫైన‌ల్ పోర‌కు అర్హ‌త సాధించింది.
    చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్‌.. బ‌ట్ల‌ర్ దూరం! కొత్త కెప్టెన్ ఎవ‌రంటే?

  • మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భార‌త స్టార్ షెట్ల‌ర్‌, తెలుగు తేజం పీవీ సింధు త‌న జోరును కొన‌సాగిస్తోంది. ఈ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో సింధు నిలిచింది. శ‌నివారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో థాయ్‌లాండ్ ప్లేయ‌ర్ బుసాన‌న్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో సింధు ఘ‌న విజ‌యం సాధించింది. 

    తొలి రౌండ్ నుంచే బుసాన‌న్‌పై సింధూ ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా ప్ర‌త్య‌ర్ధిని ఓడించ‌డానికి సింధూకు  2 గంటల 28 నిమిషాల స‌మ‌యం పట్టింది. ఈ ఏడాది మాస్టర్స్ టోర్నీలో సింధూ ఫైన‌ల్ అర్హ‌త సాధించ‌డం ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. 

    సింధూ చివ‌ర‌గా గ‌త ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్ట‌ర్స్ ఫైన‌ల్‌కు చేరింది.  కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధూను బుసానన్ ఓడించి టైటిల్ సాధించింది. తాజా విజ‌యంతో సింధూ త‌న ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది. ఇక ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో చైనా ప్లేయ‌ర్ వాంగ్ ఝీయితోస సింధూ త‌ల‌ప‌డ‌నుంది.

     

Telangana

  • హైదరాబాద్, మే 25, 2024: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప ప్రమాదవశాత్తు ఆలౌట్ సీసా మొత్తం తాగేసింది. ఆమె ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా ఆమె పరిస్థితి బాగుపడకపోగా, ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయ్‌పూర్‌ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించాయి.

    ఇక్కడి నుంచి ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడ పరీక్షించిన తర్వాత పాపకు ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య తీవ్రంగా వచ్చిందని తెలిసింది. పాప శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోకపోవడంతో, ఆమె కుడివైపు గుండె కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. దాంతో పాపకు ఎక్మో పెట్టి, ఆమె పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

    ఎక్మోను రెండు విధాలుగా అమరుస్తారు. సాధారణంగా, కుడి తొడ వెయిన్ను తొలగించి, డీ-ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకుంటారు, ఆపై ఎక్మో ద్వారా ఆక్సిజనేషన్ తర్వాత కుడి ఇంటర్నల్ జుగులర్ వెయిన్ ద్వారా ఊపిరితిత్తులను బైపాస్ చేస్తారు. గుండె కూడా దెబ్బతింటే, అంతర్గత జుగులర్ వెయిన్ నుంచి డీ-ఆక్సిజనేటెడ్ రక్తం తీసుకుని, దాన్ని ఎక్మో ద్వారా ఆక్సిజనేట్ చేస్తారు. మొత్తం శరీరానికి సరఫరా చేయడానికి అయోటా ఆర్క్ ద్వారా తిరిగి ప్రవేశపెడతారు. సాధారణంగా, ఫెమోరల్ వెయిన్ నుంచి రక్తం తీసుకుని, దాన్ని శుద్ధిచేసి ఫెమోరల్ ఆర్టెరీకి తిరిగి పంపుతారు. ఇది కొంత సులభం. అయితే, ఈ సందర్భంలో, పాప బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున, ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుంది. ఈ విధానం చాలా అరుదు.

    ఈ ప్రొసీజర్ తర్వాత పాపను తొలుత రోడ్డు మార్గంలో రాయ్‌పూర్‌కు విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్ని రకాలుగా బాగుండటంతో గురువారం ఆమెను డిశ్చార్జి చేశారు.

    వీఏ లేదా వీవీ ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అత్యంత అరుదు. అందులోనూ ముఖ్యంగా మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి అతి కొద్ది కేసుల్లో ఇదొకటి.  గుండె శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పిల్లలకు ఎక్మో పెట్టడం కొంత సులభం. కానీ ఈ కేసులో మాత్రం పాపకు ఊపిరితిత్తులు, గుండె కూడా కొంత దెబ్బతిన్నాయి. పాప వయసు బాగా తక్కువ. దాంతో మెడ వద్ద కాన్యులేషన్ ద్వారా ఎక్మో పెట్టడం, ఎలాంటి సమస్యలు లేకుండా రాయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా తరలించడం చాలా సంక్లిష్టమైనది, సవాళ్లతో కూడుకున్నది. ఇది మొత్తం వైద్య బృందానికి ఉన్న అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వాలకు నిదర్శనం.

    ఈ సందర్భంగా కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ 'పరాగ్ శంకర్రావు డెకాటే' మాట్లాడుతూ.. బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి రాయ్‌పూర్‌ నుంచి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం.

    అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఇలా మెడ ద్వారా కాన్యులేషన్ పెట్టి వీఏ-ఎక్మో పెట్టిన కేసులు ఆరు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో ఈ-పీసీఆర్ కూడా చేయగలరు. అంటే రోగిని ఎక్మో మీద పెట్టి, అదే సమయంలో కార్డియో రెస్పిరేటరీ మసాజ్ ఇవ్వగలరు. గడిచిన మూడేళ్లలో మొత్తం 15 సార్లు ఎక్మో పెట్టాము. ఇది భారతదేశంలోనే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి అత్యంత ఎక్కువ సార్లు. మెరుగైన ఫలితాల కోసం రక్తనాళాలను కూడా పునరుద్ధరించగలం. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చాలా అందుబాటు ధరల్లోనే ఎక్మో సేవలు అందుతాయి. లిటిల్ వన్ అనే ఫౌండేషన్ ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని రకాల రోగులకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందుతాయనడానికి ఈ కేసు ఒక నిదర్శనం” అని ఆయన చెప్పారు.

    రాయ్‌పూర్‌ నుంచి పాపను తీసుకొచ్చిన బృందంలో పీఐసీయూ అధినేత డాక్టర్ పరాగ్ డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అవినాష్ రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్ధన్, పెర్ఫ్యూజనిస్టు దయాకర్, మేల్ నర్సు దీపుమోనే, సర్జికల్ సిస్టర్ నాగశిరీష ఉన్నారు. ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత పాపకు కిమ్స్ కడల్స్ పీఐసీయూ బృందం, నర్సులు, ఇతర సిబ్బంది సాయంతో సమగ్ర చికిత్సలు అందినట్లు డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. ఈ వైద్య నిపుణులందరి సమిష్టి కృషి వల్ల, ఐకాట్ సంస్థ అందించిన ఎయిర్ అంబులెన్స్ సేవల వల్ల, తల్లిదండ్రులు సహకారం వల్ల పాప పూర్తిగా కోలుకోగలిగింది.

  • సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్‌, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.

    ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు  ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్‌ సింగ్‌ నాయక్‌ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్‌ ఆఫీసర్లను లక్ష్మణ్‌ సింగ్‌ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఎంపీ అభ్యర్ధి మల్లురవి ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోడ్‌ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లనన్నను కించపరుస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. 

    కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఓవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అంటూ విమర్శించారు.

    దీనిపై మల్లురవి స్పందిస్తూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తాయని తెలిపారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీలో చదివితే.. ఆ కాలేజీలోనే ఓట్లు అడగాలని చురకలంటించారు.

    ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతావారు కాదన్నట్లుగా మట్లాడటం సరికాదని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

    తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు  27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  పోలింగ్‌ జరగనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్‌ 5న వెలువడనుంది.

    సాక్షి, హైదరాబాద్‌:  ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచార గడవు శనివారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

    ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 605 పోలింగ్‌ బూత్‌లు, 4,63,839 ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు  ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి రాకేశ్‌రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.

    పోలింగ్ డే 27వ తేదిన ప్రత్యేక సెలవు ప్రకటించారు అధికారులు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్‌ 5న వెలువడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ రోజు ఉ.6 నుంిచి సా.8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

     

National

  • రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం(మే25)  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మృతి చెందినట్లు సమాచారం. 

    మీర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, వైర్‌లెస్‌ సెట్‌లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు బీజాపూర్‌ పోలీసులు తెలిపారు. 

Hyderabad

  • No Headline

    గ్రేటర్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రయ్‌మంటూ పరుగులు తీస్తున్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంధనం అవసరం లేకుండా.. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే సుమారు 60 కిలో మీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగానికి సిటీజనులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా సగటు వేతన జీవులు ఎలక్ట్రిక్‌ బైక్‌లను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు 1.20 లక్షలకు పైగా ఈ–బైక్‌లున్నట్లు సమాచారం. మూడేళ్లుగా వీటి దూకుడు పెరిగినట్లు రవాణా అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఇటీవల భారీగా డిమాండ్‌ పెరిగిన దృష్ట్యా.. కొనుగోలుదారులు కనీసం రెండు నుంచి మూడు నెలల ముందే వాహనాలను బుక్‌ చేసుకోవాల్సి వస్తోంది.

    ఈవీ రయ్‌ రయ్‌..

  • సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాలు, వీస్తున్న గాలులతో భారీ వృక్షాలు నేల కూలుతున్నాయి. ఏ క్షణం ఏ చెట్టు, కొమ్మ విరిగి మీద పడుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆస్పత్రి ఆవరణలో చెట్టు కూలిన దుర్ఘటనలో భర్త మరణించగా.. భార్య గాయాలపాలైంది. దీంతో ఎప్పుడు.. ఎక్కడ.. ఏ చెట్టు కూలుతుందోనని నగర ప్రజలను భయం వెంటాడుతోంది. ఈ నెలలో కూలినన్ని చెట్లు ఇటీవలి కాలంలో కూల లేదు. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగానికి అందిన ఫిర్యాదుల మేరకే గడిచిన 24 రోజుల్లో 625 చెట్లు నేల కూలాయి. ఇక ఫిర్యాదులు అందని చెట్లు మరో 500కు పైగానే ఉంటాయనే అంచనాలున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో హైదర్‌గూడలో నిలిచి ఉన్న ఆటోపై చెట్టు కూలిపడటంతో ఆటో డ్రైవర్‌ మరణించిన విషయం తెలిసిందే.

    వెంటాడుతున్న గతం..

    2016, 2017 సంవత్సరాల్లోనూ వర్షాలతో పాటు పెను గాలులకు భారీ సంఖ్యలో చెట్లు నేలకూలి రాకపోకలు స్తంభించిపోయిన ఘటనల్ని నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లోనూ మే నెలలోనే భారీ సంఖ్యలో చెట్లు కూలాయి. 2016లో ఒక్కరోజే 300కు పైగా చెట్లు కూలాయి. అలా మే నెలలో దాదాపు 1600 చెట్లు నేలకూలగా వాటిలో 80 శాతం గుల్‌మొహర్‌వే కావడాన్ని అప్పట్లో అధికారులు గుర్తించారు. రోడ్ల వెంబడి, ఫుట్‌పాత్‌లపై గుల్‌మొహర్‌ మొక్కలను అధికంగా నాటారు. అవి తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఎత్తు పెరగడంతో పాటు నీడనిస్తాయని నాటారు. కానీ గాలివానలకు నేలకూలడంతో ఆలోచనలో పడి ఆ తర్వాత గుల్‌మొహర్‌ల సంఖ్యను భారీగా తగ్గించి ఇతరత్రా మొక్కలు నాటారు.

    ఫుట్‌పాత్‌లపై చెట్ల వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లకుండా ఉండటం, చుట్టుపక్కల సైతం కాంక్రీటు నిర్మాణాలు తదితరమైనవి కూడా అందుకు కారణాలుగా గుర్తించారు. 2017లోనూ మే నెలలోనే 291 చెట్లు ఒక్క రోజే నేల కూలాయి. వాటిలోనూ గుల్‌మొహర్‌వే ఎక్కువగా ఉన్నాయి. అప్పడు 130– 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడంతో రావి, వేప, కానుగ వంటి చెట్లు కూడా నేలకూలాయి. కూకటివేళ్లతో సహా కుప్పకూలిన చెట్ల వల్ల పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు కూడా చెట్లు అధిక సంఖ్యలో కూలుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అప్పట్లో చెట్ల సమస్యల పరిష్కారానికే ప్రత్యేకంగా ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు చెట్ల వద్ద ప్రజలు నిల్చోరాదని, రోడ్డు పక్క చెట్ల కింద నుంచి వెళ్లరాదని కూడా హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు సైతం చెట్లున్న ప్రాంతాల్లో వాటి పక్కనుంచి ప్రయాణించకుండా జాగ్రత్తలు పడ్డారు. ఈనెలలో మళ్లీ ఎక్కువ చెట్లు కూలుతుండటం ఆందోళనలకు తావిస్తోంది.

    నీరు నిలిచిన ప్రాంతాలు

    వీటితోపాటు వర్షాల వల్ల నీరు నిలిచిన ప్రాంతాలపై 158 ఫిర్యాదులందాయి. అవి ఎల్‌బీనగర్‌లో 20, చార్మినార్‌లో 30, ఖైరతాబాద్‌లో 29, శేరిలింగంపల్లిలో 17, కూకట్‌పల్లిలో 44, సికింద్రాబాద్‌లో 18 ఉన్నాయి.

    ఈ నెలలో ఇప్పటి వరకు కూలిన చెట్లు ఇలా..

    జోన్‌ ఫిర్యాదులు

    ఎల్‌బీనగర్‌ 83

    చార్మినార్‌ 74

    ఖైరతాబాద్‌ 155

    శేరిలింగంపల్లి 117

    కూకట్‌పల్లి 94

    సికింద్రాబాద్‌ 102

    మొత్తం 625

  • అయిదే
    పసివాళ్ల పట్ల ప్రాణాంతకమవుతున్న పరిస్థితి
    డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన ఓఆర్‌ఎస్‌లనే వాడాలి
    డీహైడ్రేషన్‌లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

    ఇది ఓఆర్‌ఎస్‌ కాదని ముద్రించిన దృశ్యం

    ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లపైనున్న లేబుల్‌ చదవకుండా ఇదే అసలైన ఓఆర్‌ఎస్‌ అని కొనడం అలవాటుగా మారింది. సాధారణంగా మండుతున్న ఎండలకు లేదా వైరస్‌ కారణంగా సంక్రమించే డయేరియా (నీళ్ల విరేచనాలు, వాంతులు) ప్రభావంతో డీహైడ్రేషన్‌ బారిన పడతారు. దీంతో శరీరంలోని నీరు, లవణాలు తగ్గిపోయి నీరసమైపోతారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి లీటరుకు 13.5గ్రా చక్కెర (గ్లూకోస్‌) స్థాయిలు, 2.6గ్రా సోడియం, 1.5 గ్రా పొటాషియం ఉండేలా నిర్ధారించిన ఓఆర్‌ఎస్‌లను తీసుకోవాలి. కానీ.. మార్కెట్లో లభించే వాటిలో 20 గ్రాములకుపైగా షుగర్‌ కలుపుతున్నారు. అధిక స్థాయిలో శరీరంలోకి చేరిన చక్కెర స్థాయిలు డీహైడ్రేషన్‌ను మరింత పెంచి చిన్నారుల మరణాలకు కారణంగా మారుతోందని పులువురు వైద్యులు సూచిస్తున్నారు.

    మండే ఎండలకు తాళలేక.. మందుల దుకాణానికి వెళ్లి ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌) తీసుకుని తాగుతున్నారా? అయితే.. తస్మాత్‌ జాగ్రత్త. అక్కడ లభించేవన్నీ అసలైన ఓఆర్‌ఎస్‌లు కావు. నిజమైన ఓఆర్‌ఎస్‌లా మభ్యపెట్టి అమ్ముకుంటున్న ఇతర పానీయాలు మాత్రమే. ఓఆర్‌ఎస్‌ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ పద్ధతి చిన్నారుల మరణాలకు దారి తీస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌ల వాడకంపై అవగాహన కల్పించడానికి నగరంలో హీల్‌ ఫౌండేషన్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అయిదేళ్లలోపు చిన్నారుల్లో 13 శాతం మరణాలు కేవలం డీహైడ్రేషన్‌ వల్లే సంభవిస్తున్నాయని, ౖఅతిసారంతో బాధపడుతున్న పిల్లల్లో 60.6% మంది ప్రాణాలను రక్షించే ఓఆర్‌ఎస్‌ను తీసుకోలేకపోతున్నారని హీల్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల పేరులో ఓఆర్‌ఎస్‌ ఉండే విధంగా మార్చుకుని.. దాని కిందే చిన్న అక్షరాలతో ‘ఇది ఓఆర్‌ఎస్‌ కాదు’ అంటూనే ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

  • కేరాఫ
    కిడ్నీ రాకెట్స్‌

    కథ మొదలయ్యేది డయాలసిస్‌ సెంటర్ల నుంచే...

    దేశంలో అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒకప్పుడు తేలిగ్గా జరిగేది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు భారీ స్కామ్‌లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. కేవలం జీవన్‌దాన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌కు చేరుకున్న వారికి, ప్రాధాన్యత క్రమంలో ఆయా అవయవాలు లభిస్తుంటాయి. ఇందులో వేచి ఉండాల్సిన కాలం ఎక్కువ కావడంతో పలువురు కిడ్నీ అవసరమైన వాళ్లు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి అంతర్జాతీయ, జాతీయ ముఠాలు డయాలసిస్‌ సెంటర్ల నుంచి దందా ప్రారంభిస్తున్నారు. వైద్యుల్ని సైతం తమతో కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. నిరుపేదలతో పాటు వలస కూలీలకు డబ్బు ఎర వేసి అవయవదానానికి ఒప్పిస్తున్నారు. ఈ మార్పిడి శస్త్రచికిత్సలు సైతం ఇక్కడ కష్టసాధ్యం కావడంతో నకిలీ పత్రాలతో విదేశాలకు తీసుకువెళ్లి పని పూర్తి చేస్తున్నారు. ఉదంతాలు జరిగాక కేసులు, అరెస్టులు తప్ప ఈ దందా నిరోధానికి పోలీసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనిపించట్లేదనే విమర్శ ఉంది.

    గతంలోనూ వెలుగులోకి అనేక కేసులు

    తాజాగా కేరళ రాకెట్‌లో వాంటెడ్‌గా..

    వీరిలో ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడు సైతం

    వలస కూలీలకు ఎర వేసి మూత్రపిండాలు స్వాహా

    అంతర్జాతీయ ముఠాలకు ఇక్కడి వారితో లింకులు

    సాక్షి, సిటీబ్యూరో: మెడికల్‌, ఫార్మా రంగాలకు హబ్‌గా మారిన హైదరాబాద్‌ మహా నగరం కిడ్నీ అక్రమ మార్పిడి రాకెట్లకూ అడ్డాగా మారుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తున్న కేసుల్లో నగరం ప్రస్తావన ఉంటోంది. కొన్నింటిలో ఇక్కడి వైద్యులు, దళారులే కీలకంగా మారుతున్నారు. ఈ ముఠాల చేతిలో నిరుపేదలు, వరుస కూలీలే సమిధలు అవుతున్నారు. గడిచిన కొన్నేళ్లల్లో ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఇరాన్‌తో ముడిపడి ఉన్న కేరళ కిడ్నీ రాకెట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌, ఇద్దరు దళారులు కీలకంగా మారారు. వీరి కోసం గాలిస్తూ కేరళ పోలీసులు నగరంలో మకాం వేశారు. ఈ కిడ్నీ రాకెట్స్‌తో అత్యధికం శ్రీలంకతో ముడిపడి ఉండగా.. నిందితుల్లో వైద్యులు కూడా ఉండటం గమనార్హం.

    2015లో చిక్కిన ‘కొలంబో’ ముఠా..

    హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2015 ఫిబ్రవరిలో ఓ కిడ్నీ రాకెట్‌ను ఛేదించి, అక్రమ వ్యాపారం చేస్తున్న షిర్డీకి చెందిన డాక్టర్‌తో పాటు నగరానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈ ముఠా దేశం నలుమూలల నుంచి దాతలను, గ్రహీతలను ఎంపిక చేసుకుంది. వీరితో ఒప్పందాలు కుదుర్చుకుని నకిలీ పత్రాలతో టెహ్రాన్‌, శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆసుపత్రులకు తీసుకువెళ్లింది. అక్కడ మార్పిడి సర్జరీలు చేయించిది. ఒక్కో గ్రహీత నుంచి రూ.30 లక్షలు వసూలు చేస్తూ.. విక్రయించిన వారికి మాత్రం నామమాత్రంగా చెల్లించింది. భోపాల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌, ఎండీ చేసిన డాక్టర్‌ హిర్దేష్‌ సక్సేనా సూత్రధారిగా ఉన్న ఈ ముఠాలో నగరానికి చెందిన రాఘవేంద్ర, అశోక్‌, సంజయ్‌ పాత్రధారులుగా ఉన్నారు.

    2019లో మూడు దేశాలతో ముడి..

    సోషల్‌మీడియా వేదికగా టర్కీ, ఈజిప్ట్‌, శ్రీలంక కేంద్రంగా సాగుతున్న కిడ్నీ రాకెట్‌ గుట్టును రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు 2019లో రట్టు చేశారు. సందీప్‌ అనే వ్యక్తి ‘కిడ్నీ నీడెడ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇది చూసి ఆకర్షితుడైన నగరానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌ ద్వారా సందీప్‌ను సంప్రదించాడు. తమ రోగికి కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు చెల్లిస్తానంటూ సందీప్‌ ఎర వేశాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో నోయిడా పిలిపించిన నిందితులు వైద్య పరీక్షలు చేయించారు. ఆపై నకిలీ డాక్యుమెంట్లతో టర్కీ తీసుకువెళ్లి... అవసరమైన వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. చివరకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి మొత్తం ఇవ్వకుండా వేధించిన ముఠా.. అతడి పాస్‌పోర్టు సైతం అధీనంలోకి తీసుకుంది. ఎట్టకేలకు విషయం వెలుగులోకి రావడంతో ఎస్వోటీ పోలీసులు సందీప్‌ సహా ముగ్గురిని అరెస్టు చేశారు.

    శ్రీలంక కేంద్రంగా శ్రీనివాస్‌ వ్యవహారం..

    శ్రీలంక కేంద్రంగా అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం నడిపిన పవన్‌ శ్రీనివాస్‌ను 2020 జూలైలో బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన ఇతగాడు షేర్లతో నష్టపోయి, 2013లో ఆన్‌లైన్‌లో పరిచయమైన కిడ్నీ రాకెట్‌కు తన కిడ్నీ అమ్ముకున్నాడు. ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అదే దందా ప్రారంభించాడు. దాదాపు ఏడుగురిని నగరం నుంచి తీసుకువెళ్లి అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేయించాడు. 2016లో శ్రీలంక పోలీసులకు చిక్కిన ఇతగాడు 15 నెలలు అక్కడి జైల్లో గడిపి వచ్చాడు. ఆపై పంథా మార్చిన ఇతగాడు మోసాలకు తెరలేపాడు. కిడ్నీ అవసరమైన వారికి ఇంటర్నెట్‌ ద్వారా వల వేసేవాడు. ఆకర్షితులైన వారితో టర్కీ తీసుకువెళ్లి మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీ డోనర్స్‌ను ఏర్పాటు చేస్తానని నమ్మబలికేవాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ పేషెంట్‌ భార్య నుంచి రూ.24 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో విషయం పోలీసుల వరకు రావడంతో కిడ్నీ రాకెట్‌ గుట్టు వీడింది.

  • ఇంటి వైద్యం మేలు..

    డీహైడ్రేషన్‌కు కారణమయ్యే డయేరియాకు ఎలాంటి మందు లేదు. కేవలం నివారణ మాత్రమే. సాధారణంగా ఓఆర్‌ఎస్‌ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో 2 రూపాయలకు లభిస్తాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఓఆర్‌ఎస్‌ను సుమారుగా 50 మి.లీ పరిమాణంలో రోజుకు 4, 5 సార్లు మాత్రమే చిన్నారులకు అందించాలి. మజ్జిగ లేదా వెజ్‌ సూప్‌, గంజిలో కాసింత ఉప్పు (సోడియం) కలిపి రోజులో కొద్ది కొద్దిగా తాగినా కూడా డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్‌ లేని సమయంలో కూడా ఆరోగ్యం కోసం కొందరు ఓఆర్‌ఎస్‌ను తీసుకుంటారు. ఈ విధానం కూడా అనర్థమే. శరీరంలో ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం వంటి లవణాలను కోల్పోనప్పడు అధిక గ్లూకోజ్‌ ఉన్నటువంటి ఈ పానీయాలు సేవించడం లవణాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. – డాక్టర్‌ ఎం.కరుణ, సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌, అపోలో

  • కుత్బుల్లాపూర్‌: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా కండక్టర్‌ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్‌ కూకట్‌పల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కార్మికులతో కిషన్‌ రాసలీలలు బయటపడడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ అతడిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్‌ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్‌ చేయాలని కూకట్‌పల్లి జడ్‌సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

    మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా..

    మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్‌ఫోన్‌లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కార్మికుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్‌ యూనిట్‌లో వెలుగులోకి వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

    ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ ఎదుట వివరణ..

    ● గ్రేటర్‌ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్‌ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌ రెడ్డితో పాటు కిషన్‌ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్‌ మిషన్‌ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కార్మికులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు.

    ● తన రాసలీలల వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్‌.. అది వైరల్‌ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్‌.. ఈ నెల 17న ఉప కమిషనర్‌ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు.

    వీడియోల లీక్‌పై ఆరా..

    గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్‌ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్‌ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్‌ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

    కాళ్లు మొక్కి.. కవర్‌ చేసి..

    శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కిషన్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్‌ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్‌ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కార్మికునికి ఫోన్‌ ఇవ్వడం.. ప్రణయ్‌ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్‌ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్‌ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి.

  • శంషాబాద్‌: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యత్నించడంతో అందులోని ఉద్యోగులు నివారించారు. ఈ విషయమై ఆర్‌జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్‌ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్‌ బెయిల్‌ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశ్నించిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు.

    విమానం తలుపు తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం ఘటన..

    స్నేహితుల వివరణ

  • లక్షకు పైగా బైక్‌లే...
    క్రమంగా పెరుగుతున్న కార్లు, ఆటోలు

    పెట్రోలు బంకుల్లో బారులు తీరవలసిన అవసరం లేదు. ఇంధనం కోసం ప్రతి రోజు రూ.వందల్లో వెచ్చించవలసిన పనిలేదు. రాత్రిపూట ఓ ఐదారు గంటలు చార్జింగ్‌ చేస్తే చాలు పగలంతా హాయిగా మీ వాహనాలపై పరుగులు తీయొచ్చు. అందుకే సిటీజనులు ఇప్పుడు ఈవీ(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) వైపు చూస్తున్నారు. దీంతో కొంతకాలంగా నగరంలో ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇంధనభారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నా రు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే కనీసం 60 నుంచి వంద కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయం ఉన్న వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్‌ ఆధారిత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు.

    – సాక్షి, సిటీబ్యూరో

  • మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.

    అన్నీ అనుమానాలే..

    మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్‌మెంట్‌ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  • ధరలు

    ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు ఇంకా తగ్గాలి. ప్రభుత్వం జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిస్తున్నప్పటికీ ధరలు కొంచెం భారంగానే ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కొనుగోలు చేసేవిధంగా ఉంటే వినియోగం బాగా పెరుగుతుంది. – రాఘవాచారి, కుషాయిగూడ

    చార్జింగ్‌ కేంద్రాలు అవసరం

    ప్రస్తుతం బైక్‌ల వరకు ఇంట్లోనే చార్జింగ్‌ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ దూరం ప్రయాణించవలసినప్పుడు సిటీలో చార్జింగ్‌ సదుపాయం లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి పెట్రోల్‌ బంకులో ఒక చార్జింగ్‌ కేంద్రం ఉండేవిధంగా ఏర్పాటు చేయాలి. – షర్మిల, హబ్సిగూడ

    చాలా బాగుంది

    ధర కొంచెం ఎక్కువే అయినా పెట్రోల్‌ భారం మాత్రం తప్పింది కదా. ప్రతి నెలా కనీసం రూ.4500 వరకు పెట్రోల్‌ కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కాబట్టి ఎలక్ట్రికల్‌ వెహికల్‌ బాగుంది.

    – కరుణాకర్‌, ఈసీఐఎల్‌

  • జనావాసాల మధ్య మద్యం తాగుతూ హల్‌చల్‌

    యువతి, యువకుడిపై కేసు నమోదు

    నాగోలు: జనావాసాల మధ్య..ఉదయం 6 గంటలకే మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్‌చల్‌ చేశారు. నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్‌ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్‌ రోడ్డుకు కారులో వచ్చారు. కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్‌చల్‌ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాకర్స్‌ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో యువతీయువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నారు. వాకర్స్‌లో ఒకరు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా యువతి అతని వద్ద నుండి ఫోను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను కొందరు వాకర్స్‌ వీడియోలు తీయగా వైరల్‌ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు రోడ్డుపై మద్యం సేవించిన అలెక్స్‌పై పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి కోసం గాలిస్తున్నారు. కాగా వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అని తెలిసింది.

  • మెటీరియల్‌ సరఫరా చేస్తానని..

    మహారాష్ట్రలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

    పరారీలో మరో నలుగురు నిందితులు

    కుత్బుల్లాపూర్‌: పరిశ్రమ నిర్వాహకుడి నుంచి నగదు తీసుకుని మెటీరియల్‌ సరఫరా చేయకుండా మోసం చేసిన వ్యక్తికి మేడ్చల్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లిలో ఓ వ్యక్తి జేపీ కెమ్‌ కార్పొరేషన్‌ పేరుతో పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ బారూచ్‌కు చెందిన పటేల్‌ భావిన్‌భాయ్‌(42), భరత్‌, కుందన్‌, జయేష్‌, హిరన్‌లు జేపీ కెమ్‌ కార్పొరేషన్‌ యజమానిని కలిసి తాము మెటీరియల్‌ అందజేస్తామని నమ్మబలికారు. దీంతో అతడు బావిన్‌భాయ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు మే 8వ తేదీన రూ.12,89,956 నగుదును ట్రాన్స్‌ఫార్మర్‌ చేశారు.

    ● అయితే భావిన్‌భాయ్‌ మెటీరియల్‌ను సరఫరా చేయకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి పేట్‌బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరం కాష్‌మిరా పోలీస్‌స్టేషన్‌ లిమిట్స్‌లో ఈనెల 22న భావిన్‌భాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.8లక్షల నగదును రికవరీ చేశారు. కాగా మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న భావిన్‌భాయ్‌ను మేడ్చల్‌ కోర్టులో ప్రవేశించగా రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

  • కిరాతకుడు

    నిజాంపేట్‌: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నించాడు. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్‌కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్‌ కాలనీలోని ఎంఎస్‌ఆర్‌ ప్లాజా బి బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్‌ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నాటి నుంచి భరద్వాజ్‌ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్‌తో కాపురానికి పంపించారు.

    విచక్షణ కోల్పోయి..

    రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్‌ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్‌ను లీక్‌ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్‌ వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్‌ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు.

    హత్య చేసి స్నేహితుడి ఇంటికి....

    భార్యను హత్య చేసిన భరద్వాజ్‌ చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్‌కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

    పసికందు ముందే..

    కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్‌ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

    బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త

    ఘటనపై పలు అనుమానాలు

Medak

  • విత్తన మేళాకు రైతులు

    మెదక్‌జోన్‌: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా రైతులు సందర్శించారని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ తెలిపా రు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 21 మండలాల నుంచి 30 మంది రైతులు మేళాకు హాజరయ్యారన్నారు. మేలైన వంగడాలు సాగుచేయాలని వ్యవసాయ విశ్వవిద్యాల యం నిర్ణయించిందన్నారు. 16 పంటల్లో 67 రకాలకు సంబంధించి దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చడానికి శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

  • ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ బడ్జెట్‌ అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబటం లేదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, ఇటుక, పీవీసీ విద్యుత్‌, ప్లంబింగ్‌ మెటీరియల్‌, కలర్స్‌, కూలీ రేట్లు ఇలా ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే గతంలో కంటే అదనంగా ఐదారు లక్షల భారం పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా సొంతింటి నిర్మాణం మొదలు పెట్టాలనుకునే వారు ధరలను చూసి సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు.

    ఇసుక రేట్లు డబుల్‌

    ళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కట్టడానికి ఉపయోగించే ఇసుక టన్నుకు రూ.2800 వరకు పలుకుతోంది. ప్లాస్టింగ్‌కు వాడే సన్నరకం ఇసుక టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం ఇసుక రేటు టన్నుకు రూ. 1300 ఉండగా ప్రస్తుతం డబుల్‌ అయ్యింది. ఇసుక కొరతతో పాటు ఓవర్‌ లోడ్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పునాదులు, స్లాబ్‌కు ఉపయోగించే కంకర ధర కూడా పెరిగింది. టన్నుకు రూ.1500 నుంచి రూ. 2,500 వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, టైల్స్‌, కలర్‌, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వాపోతున్నారు. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అగ్రిమెంట్‌ చేసుకున్న సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం ఉన్నవాటికి చాలా వ్యత్యాసం ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

  • పనులు త్వరగా పూర్తి చేయాలి
    కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

    చేగుంట(తూప్రాన్‌): అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చేగుంట బాలుర ప్రాథమిక పాఠశాల, రెడ్డిపల్లి కాలనీ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులను డీఈఓ రాధాకిషన్‌తో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న విద్యుత్‌ పనులు, నీటి సరఫరా, మరుగుదొడ్ల పరిస్థితులపై ఆరా తీశారు. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అన్ని గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణపై నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వడియారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రం మూసివేయవద్దని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ గియాసున్నీసాబేగం, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్‌తో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.

    పురాతన కట్టడం పరిశీలన

    హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మండలం కొంటూరులో పురాతన మసీదును కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడానికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయా లని స్థానికులు సూచించగా.. పురావస్తు, వక్ఫ్‌బోర్డ్‌ అధికారులతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • వేతన వెతలు!

    చిన్నశంకరంపేటలో రోడ్డును శుభ్రం చేస్తున్న కార్మికులు

    చిన్నశంకరంపేట(మెదక్‌): ఆరు నెలలుగా వేతనాలు రాక పారిశుధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. పస్తులుండి పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని వాపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు నిలిపివేసిన కార్మికులు వేతనం కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

    జిల్లాలో 1,710 మంది విధులు

    జిల్లాలో 1,710 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒకొక్కరికి రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.8,500 అందజేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి ఎనిమిది మంది వరకు పనిచేస్తున్నారు. పారిశుధ్య పనులతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు ట్రాక్టర్‌ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. మరో వైపు మొక్కలకు నీరు పెట్టడం, నల్లా నీరు వదలడం లాంటి పనులు చేస్తున్నారు. అయితే సకాలంలో వేతనాలు రాకపోవడంతో కొంత మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు వేతనాలు అందించి పనులు సజావుగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

    పారిశుధ్య

    కార్మికులకు తప్పని తిప్పలు

  • ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

    నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

    నర్సాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని వాపోయారు. ఎరువులు, విత్తనాలు దొరకడం లేదన్నారు. సకాలంలో తూకం వేయకపోవడంతో ధాన్యం తడిసిందన్నారు. తరుగు పేరిట బస్తాకు నాలుగు నుంచి ఆరు కిలోల ధాన్యం తీసుకుంటూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నిరకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెంట వెంటనే డబ్బులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు ఏనాడు ఇబ్బంది పడలేదని గుర్తుచేశారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు రుణాలు లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, నాయకులు సత్యంగౌడ్‌, జితేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రవీణ్‌, నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కొనుగోళ్లు వేగవంతం చేయండి
    జిల్లా ప్రత్యేకాధికారి భారతి హొళికేరీ

    నర్సాపూర్‌ రూరల్‌: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి భారతి హొళికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్‌ మార్కెట్‌తో పాటు మండలంలోని కాగజ్‌ మద్దూర్‌ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదనంగా లారీలను ఏర్పాటు చేసి రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించాలని సూచించారు. ధాన్యంలో తేమశాతం లేకుండా తూకం వేయాలన్నారు. రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కాగజ్‌ మద్దూర్‌ కొనుగోలు కేంద్రంలో 8,000 వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయని.. మూడు రోజులకు ఒక లా రీని పంపుతున్నారని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అదనంగా లారీలను పంపించాలని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ బ్రహ్మారావు, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ కమలాద్రి ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • హక్కు

    మెదక్‌ కలెక్టరేట్‌: దివ్యాంగుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని, హక్కుల సాధనకు సిద్ధం కావాలని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు ఆకాశనంటాయని వాపోయారు. దేశంలో దివ్యాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. జూలై 21, 22 తేదీల్లో జిల్లాలో 7వ మహాసభలు జరుగుతాయని ఎన్‌పీఆర్డీఓ గౌరవ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్‌ తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు యశోద, ఉపాధ్యక్షులు చంద్రం, శ్రీనివాస్‌, జిల్లా సహాయ కార్యదర్శులు చింతకుంట శ్రీనివాస్‌, సంతోష్‌ కుమార్‌, నాయకులు శ్రీనివాస్‌, కిష్టయ్య, చంద్రమ్మ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

    నాణ్యమైన విత్తనాలు

    విక్రయించాలి

    కౌడిపల్లి(నర్సాపూర్‌): విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు లాట్‌ నంబర్‌ ఉన్న బిల్లులు ఇవ్వాలని ఏడీఏ పుణ్యవతి తెలిపారు. శుక్రవారం కౌడిపల్లిలో ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని చెప్పారు. రైతుపేరు, స్టాక్‌ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. రైతులు లూజ్‌ విత్తనాలు కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వ గుర్తింపు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోయిన, ఇతర నష్టం వచ్చిన నష్టపరిహారం తీసుకునేందుకు బిల్లులు అవసరం ఉంటాయని తెలిపారు. శనివారం నుంచి గ్రామాల్లో రైతులకు పంటల సాగు, విత్తనాల ఎంపికపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఏఓలు స్వప్న, శ్వేతకుమార్‌, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు.

    మొదటి రోజు

    95 శాతం హాజరు

    మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఐఈఓ సత్యనారాయణ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు నిర్వహించినట్లు చెప్పా రు. జనరల్‌లో 959 మందికి గాను 914 మంది, ఒకేషనల్‌లో 29 విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. 339 మందికి గాను 318 విద్యార్థులు, ఒకేషనల్‌లో 43 గాను 43 విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా విద్యార్థుల హాజరుశాతం 95గా నమోదైందని.. పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారని వివరించారు.

    ప్రశాంతంగా పాలిసెట్‌

    మెదక్‌ కలెక్టరేట్‌: పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌) జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మెదక్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శ జూనియర్‌ కళాశాల, సిద్ధార్థ్‌ మోడల్‌ స్కూల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కోఆర్డినేటర్‌, మెదక్‌ మహిళా పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ సువర్ణలత పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొత్తం 1,590 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,462 మంది హాజరైనట్లు తెలిపారు. 92 శాతం హాజరు నమోదైనట్లు చెప్పారు.

  • కొవిడ్‌ తరువాత ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి అవసరం పెరిగింది. అద్దెలు కట్టలేక తమకు ఉన్న స్థలాల్లో నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి మొదలైన ధరల మోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా లేబర్‌ చార్జీలు పెరిగాయి. ఆ తరువాత మిగతా ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గత సంవత్సరం చదరపు అడుగు రూ.1400 నుంచి రూ.1500 వరకు ఖర్చు అయ్యేది. అదే కాంట్రాక్టుకు ఇస్తే రూ.1600 నుంచి రూ.1700 వరకు వ్యయం చేయాల్సి వచ్చేది. ఇంటీరియర్స్‌కు అదనం. ప్రస్తుతం పెరిగిన ధరలతో సొంతంగా ఇల్లు కట్టించుకున్నా రూ.1800 నుంచి రూ.1900 వరకు అవుతుండగా, కాంట్రాక్టుకు ఇస్తే రూ. 2000 నుంచి రూ.2200 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇసుక టన్ను ధర రూ.2800 వరకు పలుకుతోంది. స్టీల్‌ టన్ను రూ. 60 వేలకు పెరిగింది. సిమెంట్‌ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ. 360 వరకు ఉంది. కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి.

  • ఫీ‘జు
    శనివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2024

    ప్రైవేట్‌

    పాఠశాలల

    ఇష్టారాజ్యం

    మెదక్‌జోన్‌: ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో జిల్లాలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

    జిల్లాలో 220 ప్రైవేట్‌ బడులు

    అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 220 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో నర్సరీకి ఫీజు రూ.19,000, అడ్మిషన్‌ ఫీజు రూ.1,000, షూ, యూనిఫాంకు కలిపి రూ.5 వేలు మొత్తంగా రూ.25,000 వసూలు చేస్తున్నారు. ఎల్‌కేజీకి ఫీజు రూ.28,000, యూకేజీ రూ.29,500, 6వ తరగతికి రూ.36 వేలు, 7వ తరగతి రూ.40 వేలు, 10వ తరగతికి రూ.62 వేలు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా అదే పాఠశాలలో హాస్టల్‌లో ఉంటే ఏడాదికి రూ.40 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

    అమలు కాని విద్యాహక్కు చట్టం!

    విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయొద్దు. కానీ జిల్లాలో రూ. వెయ్యి నుంచి మొదలుకుని రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించాలనే నిబంధన ఉంది. దానిని అమలు చేసిన దాఖలాలు లేవు. 2020లో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయినా అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాకుండా యూనిఫామ్స్‌, పుస్తకాలు, షూ ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల నిర్వాహకులు విక్రయించొద్దనే నిబంధన ఉంది. అయినా ఇవేమి పట్టించుకోవడం లేదు. ఏకంగా పాఠశాలల్లోనే విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఇటీవల పలు సంఘాల నాయకులు అదనపు కలెక్టర్‌ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అన్నివర్గాల పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

    న్యూస్‌రీల్‌

    చర్యలు తప్పవు

    ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేస్తామని చాలాకాలంగా చెబుతోంది. ఈ ఏడాది సైతం ఆ అంశం ప్రస్తావనకు వచ్చి ంది. ప్రైవేట్‌ పాఠశాలలు విద్యాహక్కు చట్టం ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు.

    – రాధాకిషన్‌, డీఈఓ మెదక్‌

Family

  • మైనా చిత్రంలోపాపులర్‌ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో  తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్‌ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి  కాబోతున్న సంగతి తెలిసిందే. 

     తాజాగా  ఇన్‌స్టాలో  బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.   నిండు  గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు  భర్తతో  మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా  పోస్ట్‌చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌  ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను  పోస్ట్‌ చేస్తూ అమలా, జగత్‌ దేశాయ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

    అలాగే అమ‌లాపాల్ త‌న‌  నెక్ట్స్‌ మూవీ  `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను  పాడిన పాటను పోస్ట్‌  చేసింది. విశాల్‌ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్‌  చేసింది. దీనికి సంబంధించిన  ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

Rangareddy

  • లక్షకు పైగా బైక్‌లే...
    క్రమంగా పెరుగుతున్న కార్లు, ఆటోలు

    పెట్రోలు బంకుల్లో బారులు తీరవలసిన అవసరం లేదు. ఇంధనం కోసం ప్రతి రోజు రూ.వందల్లో వెచ్చించవలసిన పనిలేదు. రాత్రిపూట ఓ ఐదారు గంటలు చార్జింగ్‌ చేస్తే చాలు పగలంతా హాయిగా మీ వాహనాలపై పరుగులు తీయొచ్చు. అందుకే సిటీజనులు ఇప్పుడు ఈవీ(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) వైపు చూస్తున్నారు. దీంతో కొంతకాలంగా నగరంలో ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇంధనభారాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నా రు. ఒకసారి చార్జింగ్‌ చేస్తే కనీసం 60 నుంచి వంద కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయం ఉన్న వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్‌ ఆధారిత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు.

    – సాక్షి, సిటీబ్యూరో

  • పహాడీషరీఫ్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డులో వాకింగ్‌ చేస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రాన్ని దుండగులు తెంచుకొని ఉడాయించిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రతిఘటించేందుకు యత్నించిన బాధితురాలితో పాటు ఆమె కూతురు తలపై దాడి చేశారు. అయినప్పటికీ బాధితురాలి నిందితుల బైక్‌ తాళంచెవి లాక్కొవడంతో, చేసేది లేక బైక్‌ అక్కడే వదిలేసి మూడున్నర తులాల బంగారు గొలుసుతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్‌ గ్రామానికి చెందిన గడ్డమీది మహేందర్‌ భార్య కల్పన(32) వేసవి సెలవులు కావడంతో ఆమె పిల్లలు లక్ష్మీ ప్రసన్న, హేమ చందర్‌, హేమంత్‌, పక్కింటి పిల్లలు పావనీ, నేహశ్రీ, మనీష్‌ కుమార్‌లతో కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌ వైపు సర్వీస్‌ రోడ్డులో కిలోమీటర్‌ నడిచి తిరిగి మంఖాల్‌కు వస్తున్నారు. 5.50 గంటల సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన హెల్మెట్లు ధరించి షైన్‌ బైక్‌తో నిలబడ్డారు. పిల్లలు ముందు నడుస్తుండగా కల్పన వెనుకాల నడుచుకుంటూ పోతుంది. ఈ సమయంలో ఒక్కసారిగా నిందితులు తమ చేతిలోని ఎర్రటి వాటర్‌ బాటిల్‌లో ఉన్న నీటిని కల్పన కళ్లల్లో చల్లారు. ఆమె కల్లు మూసుకోవడంతో మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచారు. గొలుసును ఒక వైపు లాగి పట్టుకోగా, నిందితులు కర్రతో ఆమె నుదుటిపై బాదారు. ఇది గమనించిన కల్పన కుమార్తె లక్ష్మీ ప్రసన్న పట్టుకునేందుకు యత్నించగా ఆమెను కూడా కర్రతో కొట్టారు. గాయాలైనప్పటికీ కల్పన చాకచక్యంతో బైక్‌ తాళం చెవి గుంజుకొని గట్టిగా కేకలు పెట్టారు. భయపడిపోయిన నిందితులు బైక్‌ను అక్కడే వదిలేసి మంగళసూత్రంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు డీఐ సుధీర్‌కృష్ణ పర్యవేక్షణలో స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

    అడ్డుకున్న కుమార్తైపె దాడి చేసిన స్నాచర్లు

    కేకలు వేయడంతోబైక్‌ను వదిలేసి పరారు

  • షార్ట్‌ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
    దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం

    చేవెళ్ల: ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. ఈ సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి కొండకల్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో గణపతిరెడ్డి కొన్నేళ్లుగా కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి దుకాణం బంద్‌ చేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లవారుజామున దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించి స్థానికులు గణపతిరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో దుకాణం మొత్తం బూడిదయింది. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    స్పందించని ఫైర్‌ సిబ్బంది

    ప్రమాదంపై స్థానికులు 101కి డయల్‌ చేశారు. ఆ సమయంలో గచ్చిబౌలి, మాదాపూర్‌, పటాన్‌చెరు అగ్నిమాపక కేంద్రాలు శంకర్‌పల్లి మా పరిధి కాదంటూ కాలయాపన చేశారు. బాధితుడు, స్థానికులు కలిసి మంటలను ఆర్పివేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఫైర్‌ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పిన కూడా స్పందించకపోవటంతో విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైర్‌ స్టేషన్‌ సిబ్బంది సకాలంలో స్పందించి వచ్చి ఉంటే ఆస్తినష్టం తగ్గేదని బాధితుడు వాపోయారు.

  • ఫిట్స

    చేవెళ్ల: మతిస్థిమితం లేని ఓ మహిళ ఫిట్స్‌తో మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లి మండలంలోని మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహారాజ్‌పేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్‌పేట్‌ గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మిలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు సరిత(25)ను నాలుగేళ్ల క్రితం షాబాద్‌ మండలంలోని మద్దూర్‌ గ్రామానికి చెందిన రమేశ్‌కి ఇచ్చి వివాహం చేశారు. ఆమె మూడు సంవత్సరాలుగా మతిస్థిమితం లేకుండా కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సరితను తల్లిదండ్రులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. వచ్చిన వారం రోజులు కూడా కాకముందే ఫిట్స్‌తో ఆమె మృతి చెందారు. కూతురు ఇంటికి వచ్చిందనే సంతోషం కూడా తీరకముందే తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    భూ సమస్యల పరిష్కరానికి కృషి

    లీఫ్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్‌

    యాచారం: రైతులు ఏళ్లుగా భూ సమస్యలు ఎదుర్కొంటూ సమయంతో పాటు డబ్బును సైతం వృథా చేసుకుంటున్నారని లీఫ్స్‌ సంస్థ(లీగల్‌ ఎంపవర్మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మార్స్‌ సొసైటీ) ఉపాధ్యక్షుడు జీవన్‌ పేర్కొన్నారు. యాచారం మండల కేంద్రంలో శుక్రవారం భూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామాల్లో దాదాపు 3 వేలకు పైగానే భూ సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. అనేక సమస్యలు పట్టాదారు, పాసుపుస్తకాల్లో రైతుల పేర్ల మార్పు, మ్యూటేషన్లు, రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం వంటివే అన్నారు. వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మండలంలో భూ సమస్యలు లేని విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నానక్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ ముత్యాల వెంకట్‌రెడ్డి, రైతులు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ‘మాట్రిమోనియల్‌’ మోసగాడి అరెస్టు

    రాయదుర్గం: పెళ్లి సంబంధాలు కుదుర్చుతామని నకిలీ మాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా మోసాలకు పాల్పడున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈమేకు శుక్రవారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. మారం అశోక్‌రెడ్డి అనే వ్యక్తి నకిలీ వెబ్‌సైట్లు, స్నాప్‌ చాట్‌ ద్వారా మహిళలను ఆకర్షిస్తూ మోసగిస్తున్నాడు. ఇటీవల ఓ మహిళకు పెళ్లి సంబంధం పేరిట మాయమాటలు చెప్పి రూ.14 లక్షలు కొట్టేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

  • ఈవీ రయ్‌ రయ్‌..
    గ్రేటర్‌లో 1.20 లక్షలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు

    గ్రేటర్‌ పరిధిలో ప్రత్యేకంగా సగటు వేతన జీవులు ఎలక్ట్రిక్‌ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత రెండేళ్లుగా ఈ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు లక్షా 20 వేలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. వాటిలో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు అంచనా. ఈ కేటగిరీకి చెందిన వాహనాల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరంలో సుమారు ఐదారేళ్ల క్రితమే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మొదలైంది. కానీ ఈ మూడేళ్లుగా బ్యాటరీ బండ్ల దూకుడు పెరిగినట్లు రవాణా అధికారులు చెబుతున్నారు.

    బ్యాటరీల భరోసా పెరిగింది...

    గతంలో కంటే ఇప్పుడు నాణ్యమైన బ్యాటరీలు వినియోగంలోకి వచ్చాయి. దీంతో వాహనదారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపైన భరోసా పెరిగింది. నాలుగేళ్ల క్రితం నాసిరకం బ్యాటరీల కారణంగా తరచుగా ప్రమాదాలు జరగడంతో చాలామంది వెనుకడుగు వేశారు. కానీ కొన్ని ఆటోమొబైల్‌ సంస్థలు నాణ్యమైన బ్యాటరీలతో మార్కెట్‌లోకి వచ్చాయి. ఐదేళ్ల వారెంటీలతో వాహనాలను విక్రయిస్తున్నాయి. ‘మొదట్లో నాణ్యత లేని బ్యాటరీలు త్వరగా వేడెక్కేవి. కానీ రెండేళ్లుగా ఆటోమోటివ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (ఏఐఎస్‌) ధృవీకరించిన ప్రమాణాల మేరకు బ్యాటరీలు వస్తున్నాయి. నాణ్యత బాగా పెరిగింది. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (బీఎంఎస్‌) బాగుంది.’ అని ఓ ఆటోమొబైల్‌ డీలర్‌ చెప్పారు. దీంతో ధర కాస్త ఎక్కువే అయినా నమ్మకమైన బ్రాండ్‌లకు చెందిన వాహనాలనే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కార్లతో పాటు 2 లక్షల బైక్‌లకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణ అంతటా ప్రస్తుతం 1.6 లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు రోడ్డెక్కాయి. మరో 90 వేలకు పైగా వాహనాలకు పన్ను మినహాయింపు అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లకు కూడా జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. దశలవారీగా 8 వేలకు పైగా వాహనాలకు ఈ అవకాశం లభించింది.

    వెయిట్‌ ప్లీజ్‌...

    ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఇటీవల భారీగా డిమాండ్‌ పెరిగిన దృష్ట్యా..కొనుగోలుదారులు కనీసం రెండు, మూడు నెలల ముందే వాహనాలను బుక్‌ చేసుకోవలసి వస్తోంది. కొన్ని బ్రాండ్‌లకు చెందిన వాహనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కనీసం 3 నెలల పాటు ఎదురుచూడవలసి వస్తుందని కుషాయిగూడకు చెందిన రాఘవ తెలిపారు. పెట్రోల్‌ వాహనాల కంటే ధర కొద్దిగా ఎక్కువే అయినా ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Siddipet

  • ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బందోబస్తు

    సిద్దిపేటకమాన్‌: వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 27న ఓటింగ్‌ జరగనున్న దృష్ట్యా జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్‌, దూల్మిట్ట మండలాల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఏ చిన్న సంఘటన జరిగినా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు.

    సిద్దిపేట సీపీ అనురాధ

  • గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
    జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌

    దుబ్బాక: ప్రమాదకర లక్షణాలతో ఉన్న గర్భిణులను ముందస్తుగా గుర్తించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్‌ వైద్యులను ఆదేశించారు. శుక్రవారం దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టికతో పాటు ఆరోగ్య కార్యక్రమాల పనితీరును పరిశీలించారు. ప్రతి శుక్రవారం గర్భిణులకు నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి చికిత్స అందించాలని అన్నారు. మాతృ, శిశు మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్‌ఓ, వైద్యాధికారులు ఉన్నారు.

  • రెవెన్యూ డివిజన్‌ సాధించి తీరుతాం

    చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని డివిజన్‌ జేఏసీ, అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానికంగా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి అందె బీరన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జేఏసీ, అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్‌ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వాగ్దానం చేసి మాట తప్పారన్నారు. కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా మాట మరిచారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చి ఆరు నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్‌ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ప్రజలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్‌ సాధనకు జూన్‌ 1న సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, డివిజన్‌ జేఏసీ నాయకులు తాడెం ప్రశాంత్‌, బిజ్జ రాము, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బూరుగు సురేశ్‌గౌడ్‌, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    జేఏసీ, అఖిలపక్ష నాయకుల తీర్మానం

  • గాలివ

    రాజీవ్‌ రహదారిపై స్తంభించిన రాకపోకలు

    కొండపాక(గజ్వేల్‌): బలమైన ఈదురు గాలులకు వర్షంతోడైంది. రాజీవ్‌ రహదారిపై చెట్లు, రేకులు ఎగిరిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన దుద్దెడ శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భారీగా వీచిన ఈదురు గాలులకు రాజీవ్‌ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజా సమీపంలో షెడ్ల రేకులు, కొట్టుకు వచ్చి రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. చెట్లు నెలకూలాయి. పోలీసులు. టోల్‌ ప్లాజా సిబ్బంది రహదారిపై పడిన రేకులను, చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో పాటు కొండపాక, దమ్మక్కపల్లి, దుద్దెడ, సిర్సనగండ్ల, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులకు చెట్లు కూలాయి.

  • తొలి

    ముగిసిన పాలిసెట్‌

    నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశం కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. సిద్దిపేట పట్టణంలో ఆరు సెంటర్లను ఏర్పాటు చేయగా 2,143 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారని సిద్దిపేట కోఆర్డినేటర్‌ సూర్యనారాయణ తెలిపారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 297 మంది విద్యార్థులకు 286 మంది పరీక్షకు హాజరయ్యారు. దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన విద్యార్థి ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు.

    సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, సాయంత్రం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనరల్‌ కేటగిరిలో ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలకు 1,173 మంది విద్యార్థులకు హాజరుకాగా 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్‌ విభాగంలో 427 మంది విద్యార్థులు హాజరు కాగా 42 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 562 మంది విద్యార్థులకు 541 విద్యార్థులు హాజరు కాగా 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్‌ విభాగంలో 145 మంది విద్యార్థులు హాజరు కాగా 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును పరీక్షల కన్వీనర్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సూర్యప్రకాశ్‌తో పాటు పరీక్షల కమిటీ సభ్యులు దేవస్వామి, చెన్నూరు శ్రీనివాస్‌లు పర్యవేక్షించారు.

    ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సంప్లిమెంటరీ పరీక్షలు

    పర్యవేక్షించిన అధికారులు

  • రైతుల

    చిన్నకోడూరు(సిద్దిపేట): హైనా వరుస దాడులతో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు మండల పరిధిలోని మాచాపూర్‌లో శుక్రవారం బోన్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బుచ్చయ్య మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చేతిలో కర్ర పట్టుకుని వెళ్లాలన్నారు. పున్నం మల్లయ్య వ్యవసాయ బావి వద్ద బోను ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళ బోనులో మేక పిల్లను వదిలి హైనా ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు.

    గ్రామాల్లో సీఎఫ్‌ఓ పర్యటన

    చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి, ముస్త్యాల గ్రామాల్లో శుక్రవారం రూరల్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన చెరువులు, నర్సరీలు, డంపింగ్‌యార్డు, గ్రేవ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన, కొనసాగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. అలాగే చెరువు వద్దకు వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఆయన వెంట డీఆర్డీఓ జయ్‌దేవ్‌ ఆర్య, ఏపీడీలు సతీష్‌, శివాజీ, ఏపీఓ మంజుల, కార్యదర్శులు, ఎఫ్‌ఎలు, టీఏలున్నారు.

    సమయానికి దుస్తులు

    అందించాలి

    డీఆర్‌డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య

    హుస్నాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి విద్యార్థులకు దుస్తులను అందించాలని డీఆర్‌డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య ఆదేశించారు. శుక్రవారం పోతారం(ఎస్‌)లో సీ్త్రశక్తి స్వశక్తి టైలరింగ్‌ యూనిట్‌ సందర్శించి దుస్తుల కుట్టు వివరాలను తెలుసుకున్నారు. త్వరగా దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అధికారులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు సూచనలు చేయాలన్నారు. వీరి వెంట ఎంపీడీఓలు వేణుగోపాల్‌రెడ్డి, జయరాం, ఏపీఎంలు శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

    ‘జలశక్తి’కి నామినేట్‌ కావడం అభినందనీయం

    మర్కూక్‌(గజ్వేల్‌): అంగడి కిష్టాపూర్‌ పాఠశాల.. జలశక్తి అభియాన్‌కు ఇటీవల నామినేట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం రూరల్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీదేవి సందర్శించారు. భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులను రీచార్జ్‌ చేసే విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జలశక్తి అభియాన్‌కు నామినేట్‌ కావడం, అందులో రాష్ట్రంలోనే మొట్టమొదటి పాఠశాల కావడం అభినందనీయమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీడీ సతీస్‌కుమార్‌, జిల్లా పంచాయతీ కార్యదర్శి నీలిమ, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • భూంపల్లి  ఎస్‌ఐ సస్పెన్షన్‌

    ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ

    పలు కేసుల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ

    దుబ్బాక: భూంపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వి.రవికాంత్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మల్టీజోన్‌ –1 ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెదక్‌ జిల్లాలోని శివ్వంపేట ఎస్‌ఐగా పనిచేసిన రవికాంత్‌ సిగిల్లాపూర్‌ మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసులో, అలాగే పలు భూతగాదా కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మెదక్‌ జిల్లా ఎస్పీ విచారణ చేయగా నిర్ధారణ కావడంతో సస్పెండ్‌ చేస్తూ ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా 4 నెలల క్రితమే శివ్వంపేట నుంచి బదిలీపై భూంపల్లి ఎస్‌ఐగా వచ్చారు. ఇక్కడా ఆయన పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • చెట్లపై రగడ

    మున్సిపల్‌ వర్సెస్‌ ‘పవర్‌’

    ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేతపై బల్దియా సీరియస్‌

    పట్టణంలో 400పైగా నరికివేశారంటూ ఆగ్రహం

    రూ.24 లక్షల జరిమానా చెల్లించాలంటూ నోటీసు

    నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే అంటున్న ట్రాన్స్‌కో

    రెండు శాఖల మధ్య లోపించిన సమన్వయం

    సాక్షి, సిద్దిపేట: మున్సిపాలిటీ, విద్యుత్‌ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ నెలకొంది. ప్రభుత్వ విభాగాలు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంట్‌ కట్‌ చేసి విద్యుత్‌ శాఖ ఝలక్‌ ఇచ్చేది. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. విద్యుత్‌ శాఖకు జరిమానా విధించి మున్సిపల్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. ఈ నెల 19, 22వ తేదీల్లో సిద్దిపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లను విద్యుత్‌ శాఖ నరికివేయడంతో మున్సిపల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని కొమ్మలు, చెట్లను తొలగించారు. మున్సిపల్‌ అధికారులు జరిమానా విధించడంతో ఆడకత్తెరలో పోకచెక్కలా విద్యుత్‌ శాఖ అధికారుల పరిస్థితి మారింది.

    ఒక్క మొక్కకు రెండు చొప్పున..

    పట్టణం హరిత సిద్దిపేట పెరుగాంచింది. సుమారు పట్టణంలో 40వేల చెట్లను పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా ఎనిమిదేళ్ల క్రితం మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెద్దగా పెరిగాయి. విద్యుత్‌ వైర్ల కింద ఏపుగా పెరిగి విద్యుత్‌ తీగలకు తగులుతున్నాయి. దీంతో గాలి దుమారం వస్తే విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుంది. ప్రతి యేడాది ఎండాకాలంలో చెట్ల కొమ్మలను తొలగించేవారు. అందులో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు 400 చెట్లను నరికివేడంతో వాటి స్థలంలో ఒక్క చెట్టుకు రెండు చొప్పున 800 మొక్కలు నాటాలి. లేనట్లయితే రూ.24లక్షల జరిమానా చెల్లించాలని విద్యుత్‌ శాఖకు సిద్దిపేట మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది.

    శాఖల మధ్య సమన్వయ లోపం

    మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు నిరంతరాయం విద్యుత్‌ సరఫరా అందించేందుకు విద్యుత్‌ వైర్లకు కొమ్మలు తాకకుండా కొట్టివేయడం తప్పనిసరి. విద్యుత్‌ అధికారులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చి రెండు శాఖలు సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సమన్వయం కుదరకపోవడంతో విద్యుత్‌ శాఖ అధికారులే నేరుగా రంగంలోకి దిగి కొమ్మలను తొలగించారు. అలాగే విద్యుత్‌ వైర్ల కింద మొక్కలు నాటేసమయంలో మున్సిపల్‌ శాఖ పలు జాగ్రత్తలు పాటిస్తే కొమ్మల తొలగింపు సైతం ఉండే అవకాశం ఉండదు. పెద్దగా పెరిగే మొక్కలు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలు నాటితే విద్యుత్‌ వైర్లకు తగిలే అవకాశం ఉండదు. ఇప్పటికై నా రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు.

Sangareddy

  • చట్టాలపై అవగాహన అవసరం

    జోగిపేట(అందోల్‌): మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సమన్వయకర్త పల్లవి సూచించారు. శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అందోల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లవి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాలుగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మెప్మా అధికారి బిక్షపతి, టీఎంసీ అండ్‌ జెండర్‌ స్పెషలిస్ట్‌ విశాల, డీఎల్‌ఎఫ్‌ సభ్యులు, రిసోర్స్‌ పర్సన్‌లు పాల్గొన్నారు.

  • కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి

    జిన్నారం(పటాన్‌చెరు): ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ భారతి హోళి కేరి సూచించారు. గుమ్మడిదల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, రైతులు దిగాలు చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాధు, అధికారులు పాల్గొన్నారు.

    పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

    భారతి హోళి కేరి

  • వడ్ల

    నారాయణఖేడ్‌: వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడంపై ఖేడ్‌ ఆర్డీఓ అశోక చక్రవర్తి ఐకేపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 24న ‘పక్షం రోజులుగా పడిగాపులు’ శీర్షిక ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని తుర్కాపల్లి, ర్యాకల్‌, నిజాంపేట్‌ మండలంలోని రాంరెడ్డిపేట్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. తుర్కాపల్లిలో 5 లారీల వరకు లోడ్‌ అయ్యే ధాన్యం పక్షం రోజులుగా ఎందుకు నిల్వ ఉందని ప్రశ్నించారు. తూకం వేయడంలో జాప్యమెందుకు జరుగుతుందని నిలదీశారు. లారీలు తెప్పించి రెండు రోజుల్లో ధాన్యం మిల్లుకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద టెంటు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై మండి పడ్డారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ తహపీల్దార్‌ అనుదీప్‌, ఐకేపీ ఏపీఎం టీక్యానాయక్‌, డీటీసీఎస్‌ మహేష్‌, సీసీ అశోక్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

    ‘సాక్షి’ కథనానికి స్పందన

    ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలు

    తనిఖీ చేసిన ఆర్డీఓ

  • స్తంభ

    ● వైర్లు సరి చేస్తుండగా కరెంట్‌ షాక్‌

    ● మునిపల్లి మండలంలో ఘటన

    మునిపల్లి(అందోల్‌): విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ సరఫరా కావడంతో లైన్‌మన్‌ షాక్‌ గురై స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన మునిపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేశ్‌ కథనం మేరకు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన బాల్‌రాజ్‌ (22)కి ఏడు నెలల కిందట మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట, మల్లిఖార్జునపల్లి, బుస్సారెడ్డిపల్లి గ్రామాలకు లైన్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. తరచూ వర్షాలు పడుతుండడంతో ప్రజలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా విద్యుత్‌ స్తంభాలపై వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మల్లిఖార్జునపల్లి గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాల్‌రాజ్‌ విద్యుత్‌ స్తంభం ఎక్కి వైర్లు సరి చేస్తున్నాడు. ఒక్కసారిగా కరెంట్‌ సరఫరా కావ డంతో విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనే మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • ‘ఉపాధి’తో పల్లెల ప్రగతి

    హుస్నాబాద్‌రూరల్‌: పల్లెల అభివృద్ధికి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఉపయోగపడతాయని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధిశాఖ పరిపాలన అధికారి స్వామిగౌడ్‌ అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్‌, నాగారం, పోతారం(ఎస్‌) గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను చూసి సంరక్షకులను అభినందించారు. తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేసే పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను వినియోగించుకొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పనులను వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తే రైతులకు ఉపయోగపడటమే కాకుండా కూలీలకు పనులు దొరుకుతాయని చెప్పారు. గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణం, పేదల భూమి సదను చేయడం, చెరువు మట్టి తరలించడం లాంటి పనులు చేసుకోవచ్చని చెప్పారు. వీరి వెంట ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, టీఏ పరశురాం తదితరులు ఉన్నారు.

    నిధులను సద్వినియోగం చేసుకోండి

    రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి స్వామి గౌడ్‌

  • రైతులను వేధిస్తే చర్యలు తప్పవు

    పుల్‌కల్‌(అందోల్‌): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను వేధిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అదికారులను హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పలు రైస్‌మిల్లులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే పుల్‌కల్‌లో అమ్మ ఆదర్శ పాఠఽశాల పథకం కింద చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఏజెన్సీలకు సూచించారు. అనంతరం పుల్‌కల్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ తేమ శాతంపై వ్యవసాయశాఖ ఏఈఓ వేధిస్తున్నారని కలెక్టర్‌కు రైతులు మొర పెట్టుకున్నారు. రైతులను వేధిస్తే చర్యలు తప్పవని ఉద్యోగులను కలెక్టర్‌ హెచ్చరించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం కోడూరు రైస్‌మిల్లును సందర్శించి పరిశీలించారు.

    జూన్‌ 6 వరకు యూనిఫాంలు అందించాలి

    సంగారెడ్డి టౌన్‌: జూన్‌ 6 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందేలా చూడాలని కలెక్టర్‌ క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని డీఆర్డీఏ ఆవరణలో కుట్టు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుట్టు అవకాశాన్ని స్వయం సహకార సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ, డీఆర్డీఏ, మెప్మా అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

    పుల్‌కల్‌ పీఏసీఎస్‌ సీఈఓ,

    ఏఈఓపై కలెక్టర్‌ క్రాంతి ఆగ్రహం

  • సజావు

    సంగారెడ్డి టౌన్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి గురువారం నిర్వహించిన పాలిసెట్‌ –2024 సజావుగా సాగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఏడు సెంటర్లలో మొత్తం 2420 మంది విద్యార్థులకు గాను 2200 మంది పరీక్ష రాసినట్లు సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తెలిపారు. 220 మంది గైర్హాజరయ్యారన్నారు.

    నకిలీలు విక్రయిస్తే చర్యలు

    నారాయణఖేడ్‌: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఖేడ్‌ ఏడీఏ నూతన్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. డివిజన్‌ పరిధిలోని విత్తన, ఎరువులు, పురుగుమందుల సమీకృత డీలర్లతో శుక్రవారం ఖేడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని సూచించారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు అమ్మితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పత్తి విత్తనాలలో గ్‌లైఫోసెట్‌ విత్తనాలు అమ్మొద్దని తెలిపారు. స్టాక్‌ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. డివిజన్‌ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులు శంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రవీణ్‌చారి, శశాంక్‌, వెంకటేశం పాల్గొన్నారు.

    వైభవంగా కుంకుమార్చన

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిత్య హోమం, కుంకుమార్చన, మహాలక్ష్మీ హోమం, విష్ణుసహస్రనామ పారయణం, చక్ర మండలారాధన, రథోత్సవం కార్యక్రమాలు చేపట్టారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ప్రధాన అర్చకులు భార్గవ్‌ లక్ష్మీనరసింహస్వామి తెలిపారు.

    కంపోస్టు ఎరువు

    తయారు చేయాలి

    ఝరాసంగం(జహీరాబాద్‌): చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సూచించారు. శుక్రవారం ఝరాసంగం, కప్పాడ్‌ గ్రామాలను ఆయన సందర్శించారు. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌, నర్సరీ తోపాటు పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. కప్పాడ్‌లోని వైకుంఠధామం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం ఝరాసంగం పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మయ్య పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, స్వప్న పాల్గొన్నారు.

  • ఇంటి

    సామాన్యులకు సొంతింటి కల పెను భారంగా మారింది. రోజురోజుకూ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుక రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ధరలను చూస్తే ఇంటి నిర్మాణం జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతేడాదితో పోల్చితే రెండింతలు పెరిగాయి.

    – జహీరాబాద్‌ టౌన్‌:

    ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ముడిసరుకుల ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ బడ్జెట్‌ అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పు చేసినా ఇంటి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనబటం లేదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, ఇటుక, పీవీసీ విద్యుత్‌, ప్లంబింగ్‌ మెటీరియల్‌, కలర్స్‌, కూలీ రేట్లు ఇలా ప్రతీ వస్తువు ధరలు భారీగా పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే గతంలో కంటే అదనంగా ఐదారు లక్షల భారం పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారు పెరిగిన ధరలతో సగంలోనే పనులు ఆపేస్తున్నారు. కొత్తగా సొంతింటి నిర్మాణం మొదలు పెట్టాలనుకునే వారు ధరలను చూసి సందిగ్ధంలోకి వెళ్లిపోతున్నారు.

    ఇసుక రేటు డబుల్‌

    ళ్ల నిర్మాణంలో ఇసుకకు ప్రాధాన్యం ఎక్కువ. వీటిలో రెండు రకాలు ఉంటాయి. కట్టడానికి ఉపయోగించే ఇసుక టన్నుకు రూ.2800 వరకు పలుకుతోంది. ప్లాస్టింగ్‌కు వాడే సన్నరకం ఇసుక టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం ఇసుక రేటు టన్నుకు రూ. 1300 ఉండగా ప్రస్తుతం డబుల్‌ అయ్యింది. ఇసుక కొరతతో పాటు ఓవర్‌ లోడ్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పునాదులు, స్లాబ్‌కు ఉపయోగించే కంకర ధర కూడా పెరిగింది. టన్నుకు రూ.1500 నుంచి రూ. 2,500 వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, టైల్స్‌, కలర్‌, కిటికీలకు ఉపయోగించే యూపీవీసీ, కలప తదితర వస్తువుల ధరలు కూడా 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వాపోతున్నారు. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అగ్రిమెంట్‌ చేసుకున్న సమయంలో ఉన్న ధరలు ప్రస్తుతం ఉన్నవాటికి చాలా వ్యత్యాసం ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

    జహీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనం

    భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం

    స్టీల్‌, ఇసుక, సిమెంట్‌ ధరలకు రెక్కలు

    పెరిగిన కూలీ రేట్లు

    బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు

    పనులు తగ్గాయి

    ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో నిర్మాణం పనులు తగ్గాయి. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌, డస్ట్‌, కంకర్‌, ఇతర మెటిరియల్‌ రేట్లు భారీగా పెరిగాయి. లాస్ట్‌ ఇయర్‌ ఒప్పందం చేసుకున్న పనులకు నష్టం వస్తుంది. ఇసుక రేటు రెండింతలు అయ్యింది. ఇసుకకే సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. లేబర్‌ చార్జీలు కూడా పెంచారు. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి. లేదంటే నిర్మాణం రంగం దెబ్బతింటుంది.

    –మురళీ, కాంట్రాక్టర్‌, జహీరాబాద్‌

    ఆకాశాన్నంటుతున్న ధరలు

    కొవిడ్‌ తరువాత ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి అవసరం పెరిగింది. అద్దెలు కట్టలేక తమకు ఉన్న స్థలాల్లో నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి మొదలైన ధరల మోత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారిగా లేబర్‌ చార్జీలు పెరిగాయి. ఆ తరువాత మిగతా ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటే గత సంవత్సరం చదరపు అడుగు రూ.1400 నుంచి రూ.1500 వరకు ఖర్చు అయ్యేది. అదే కాంట్రాక్టుకు ఇస్తే రూ.1600 నుంచి రూ.1700 వరకు వ్యయం చేయాల్సి వచ్చేది. ఇంటీరియర్స్‌కు అదనం. ప్రస్తుతం పెరిగిన ధరలతో సొంతంగా ఇల్లు కట్టించుకున్నా రూ.1800 నుంచి రూ.1900 వరకు అవుతుండగా, కాంట్రాక్టుకు ఇస్తే రూ. 2000 నుంచి రూ.2200 వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇసుక టన్ను ధర రూ.2800 వరకు పలుకుతోంది. స్టీల్‌ టన్ను రూ. 60 వేలకు పెరిగింది. సిమెంట్‌ ధరలు బస్తాకి కంపెనీ బట్టి రూ. 360 వరకు ఉంది. కూలీల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి.

  • ● ప్రారంభమైన ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు

    ● పర్యవేక్షించిన అధికారులు

    కొండాపూర్‌(సంగారెడ్డి): ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు జరగగా, ద్వితీయ పంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. మొదటి రోజు శుక్రవారం తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్‌, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 2936 మంది విద్యార్థులకు గానూ 2722 మంది హాజరయ్యారు. 214 మంది గైర్హాజయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 849 మంది విద్యార్థులకు 789 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 60 విద్యార్థులు గైర్హాజరయ్యారు.

  • గ్రామం యూనిట్‌గా లేనట్టేనా?
    ● కొత్త పంటల బీమా పథకం అమలుకు కసరత్తు ● మండలం యూనిట్‌గానే పరిగణన ● గ్రామం యూనిట్‌గా తీసుకునేందుకు నిబంధనలు అడ్డు! ● ఇలా అయితే రైతులకు నామమాత్రంగా అందనున్న పరిహారం

    సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ పథకం అమలుపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు షురూ చేసింది. ఈ వానాకాలం సీజన్‌ నుంచి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బీమా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ ఈ పథకం అమలు దిశగా చర్యలు చేపట్టింది. అయితే నిబంధనల కారణంగా జిల్లాలో గ్రామం యూనిట్‌గా ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కావడం లేదని వ్యవసాయశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాలో సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో కనీసం 25 శాతానికి మించి విస్తీర్ణం ఉన్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం పంటల విస్తీర్ణంలో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. పత్తి, వరి అత్యధికంగా సాగవుతున్నప్పటికీ.. ఈ రెండు పంటల విస్తీర్ణాలు సుమారు 15 శాతంలోపే ఉన్నాయి. దీంతో జిల్లాలో అన్ని పంటలు మండల యూనిట్‌గానే ఈ పథకం అమలు కానుంది.

    గ్రామం యూనిట్‌గా తీసుకుంటేనే మేలు

    పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా అమలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగి పంటలు దెబ్బతిన్నప్పుడు పంట నష్టాన్ని గ్రామం యూనిట్‌గా లెక్కిస్తే రైతులకు ఎక్కువ మొత్తంలో పరిహారం అందుతుంది. మండలం యూనిట్‌గా అమలు చేస్తే పంట నష్ట పరిహారం నామమాత్రంగా వస్తుంది. ఒక్కోసారి పరిహారం అందకుండా నిబంధనలు అడ్డు వస్తుంటాయి. దీంతో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

    జిల్లాలో తరచూ ప్రకృతి వైపరీత్యాలు

    జిల్లాలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయి రైతులపై కొలుకోలేని దెబ్బ పడుతోంది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో కురిసిన అధిక వర్షాలకు జిల్లాలో వరి, ఉల్లి, జొన్న, మక్క పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మామిడి కాయలు నేల రాలాయి. ఇతర ఉద్యానవన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అంతకు ముందు యాసంగి సీజనులో కురిసిన అకాల వర్షాలకు సుమారు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలా వడగండ్ల వానలు, అకాల వర్షాలు జిల్లా రైతాంగాన్ని నిండా ముంచుతున్నాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నిర్ణయిస్తున్నప్పటికీ.. నిబంధనలు సాకుగా చూపి అధికారులు నష్టాన్ని తక్కువగా అంచనా వేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకం అమలైతే పరిహారం అంది కొంతమేర ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.

    రైతులకు అవగాహన

    పంటల బీమా పథకంపై రైతులకు ప్రాథమికంగా అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవగాహణ కార్యక్రమంలో కొందరు రైతులు కూడా పాల్గొన్నారు. వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ పథకం గురించి వారికి వివరించారు.

    ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం

    పంటల బీమా పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. పంటల వారీగా సాగు విస్తీర్ణాలు లెక్కించాం. ఈ పథకంపై రైతులకు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏఏ పంటలు గ్రామం యూనిట్‌గా, ఏఏ పంటలు మండలం యూనిట్‌ పరిధిలోకి వస్తాయనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఈ పథకం కోసం రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.

    – నర్సింహరావు,

    జిల్లా వ్యవసాయశాఖ అధికారి

  • పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం

    శివ్వంపేట(నర్సాపూర్‌): పదహారు రోజుల కిందట మృతి చెందిన వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం పోలీసులు పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి పోతులబోగూడ గ్రామానికి చెందిన కొంటి పోచయ్య(60) నీటికుంటలో పడి మృతి చెందడంతో సహజ మరణం అనుకొని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భూమి అమ్మకం విషయంలో పోచయ్య అడ్డొస్తున్నాడని నెపంతో రియల్‌ వ్యాపారులు హత్య చేశారని ఆరోపణలు వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్‌ సీఐ కృష్ణ నేతృత్వంలో పలువురు అనుమానితులను విచారించారు. శుక్రవారం తహసీల్దార్‌ శ్రీనివాస్‌చారి, ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అజారుద్దీన్‌ పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా మృతికి సంబంధించి నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

  • 30 ఏళ్లకు ఆలయానికి ఉత్సవ విగ్రహాలు

    జోగిపేట(అందోల్‌): చారిత్రాత్మకమైన అందోలులోని శ్రీ రంగనాథ ఆలయానికి చెందిన పంచలోహాలకు చెందిన ఉత్సవ విగ్రహాలు ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత శుక్రవారం ఆలయానికి చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోలులోని రంగనాథ దేవాలయానికి చెందిన శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యబామ, నాలుగు ఆల్వార్ల విగ్రహాలు, తదితర పూజా సామగ్రిని 1992వ సంవత్సరంలో అప్పటి పూజారులు ఈ విగ్రహాలకు ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు, రక్షణ విషయంలో ఇబ్బందులుగా ఉన్నాయని తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో నాచారంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి దేవాలయ అధికారులకు అప్పగించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయాన్ని తెలుసుకొని విగ్రహాలను యథావిధిగా అందోలు దేవాలయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఉత్సవ విగహ్రలకు పూజలు నిర్వహించాలన్నదే మంత్రి ఉద్దేశ్యమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

    నాచారం దేవాలయం నుంచి తరలింపు

  • రైతు ఆత్మహత్యాయత్నం

    జహీరాబాద్‌: భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై మొగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తండాకు చెందిన రైతు కీరూ రాథోడ్‌ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి అన్న జ్ఞానేందర్‌ కథనం మేరకు.. కీరు తండ్రి రాంచందర్‌ సూర్య, అతడి అన్న లక్ష్మన్‌ సూర్యల పేరిట 14 ఎకరాల భూమి ఉంది. ఇందులో 3 ఎకరాలు లక్ష్మణ్‌ అమ్ముకున్నాడు. మిగితా భూమి ధరణి మూలంగా రికార్డుల నుంచి మాయమైంది. వీరి ఉమ్మడి కుటుంబమే కబ్జాలో ఉన్నప్పటికీ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ కావడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతోపాటు 140 సర్వే నంబర్‌లో 1.20 ఎకరాల భూమి కీరు కుటుంబం పేరిట ఉంది. ఇందులో నుంచి 10 గుంటల భూమి తనకే వస్తుందని, పాలివారు మాత్రం వేధింపులకు గురి చేస్తూ పోలీసులను ఆశ్రయించి వత్తిడి చేస్తున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై రూరల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రావు స్పందిస్తూ భూ వివాదం విషయాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని, ఫిర్యాదు దారుడికి చెప్పినట్లు పేర్కొన్నారు. రైతు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో..

  • ప్రాణం తీసిన ఈత సరదా

    నీట మునిగి బాలుడు మృతి

    నర్సాపూర్‌ రూరల్‌: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృత్యువాత పడిన ఘటన నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని హనుమంతపూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై పుష్పరాజ్‌, స్థానికుల కథనం మేరకు.. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన చాంద్‌ పాషా, ఉస్మాన్‌ బీ దంపతుల కుమారుడు ఆసీఫ్‌(12) స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు హనుమంతపూర్‌ చెరువులోకి వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో ఆసీఫ్‌ నీట మునిగి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు.

    మంజీరాలో మునిగి వ్యక్తి..

    పాపన్నపేట(మెదక్‌): ప్రమాదవశాత్తు మంజీరాలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రామతీర్థం శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని జయపురం గ్రామానికి చెందిన బజారు కిష్టయ్య (35) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సమీప బంధువుల పెళ్లి నిమిత్తం రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలిసి రామతీర్థం గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు బంధువులతో కలిసి మంజీరానది వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా కిష్టయ్య ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే ఉన్న బంధువులు గమనించి కాపాడేందుకు యత్నించినా సాధ్య పడలేదు. పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య మమతతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

  • పేద విద్యార్థుల అభివృద్ధికి కృషి

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రభుత్వ పాఠశాల లో చదివే పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తెల్లాపూ ర్‌ నైబర్‌హూడ్‌ అసోసియేషన్‌ ఎడ్యుకేషన్‌ వాలంటరీ గ్రూప్‌ ఎంతో కృషి చేస్తుందని నైబర్‌హూడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఈశ్వరగారి రమణ అన్నారు. శుక్రవారం నైబర్‌హూడ్‌ ఎడ్యుకేషన్‌ వాలంటరీ గ్రూప్‌ ఆధ్వర్యంలో తెల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్‌ నైబర్‌హూడ్‌ ఎడ్యుకేషన్‌ వాలంటరీ గ్రూపు ఆధ్వర్యంలో ఈ ఏడాది తెల్లాపూర్‌లోని మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే 120 మంది విద్యార్థులకు నల్లగండ్లలోని ఇంజనీరింగ్‌ స్కూల్‌లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో అంతర్జాతీయ పాఠశాలలో చదివే 36 మంది విద్యార్థులు వీరికి విద్యాభోదన చేశారని వివరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమ కన్వీనర్‌ కవిత జాలే, కో ఆర్టినేటర్‌లు కత్వాయని, రవి రమణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మదన్‌, రామమూర్తి పాల్గొన్నారు.

  • నాణ్యమైన విత్తనాలతో దిగుబడులు

    సిద్దిపేటఅర్బన్‌: నాణ్యమైన విత్తనాలతోపాటు నేల రకాన్ని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులతోపాటు ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌. శ్రీదేవి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్‌ మండలం తోర్నాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వరిలో దొడ్డు రకం, సన్న రకాలు, కందిలో దొడ్డు రకానికి సంబంధించిన విత్తనాలను ప్రదర్శించి విక్రయించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ ప్రతీ ఏడాది నేల భూసార పరీక్ష చేయించుకోవాలని, నేల రకాలను బట్టి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల విత్తనాలు పరిశోధన కేంద్రం వద్ద అందుబాటులో ఉంటాయని, అవసరం ఉన్న రైతులు విత్తనాలు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ మాట్లాడుతూ.. పచ్చి రొట్ట ఎరువులను సాగు చేసి దుక్కిలో కలియదున్నుకోవాలని, దీని వల్ల భూసారం పెరుగుతుందన్నారు. విత్తనాలు దొరకని వారు పెసర విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. సిరిసిల్లలోని బీజేఆర్‌ అగ్రికల్చరల్‌ కాలేజీ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జీ. శ్రీదేవి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు విత్తన మేళాను నిర్వహిస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులు వివిధ పంటలలో పురుగు మందుల వాడకం, మానవ, పర్యావరణ వ్యవస్థపై పురుగు మందుల అవశేషాల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు.

    తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం

    ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి

  • కారు బోల్తా.. ఒకరు మృతి

    చిన్నశంకరంపేట(మెదక్‌): కారు అదుపు బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం టీ.మాందాపూర్‌ తండా–మెదక్‌ మండలం కాజీపల్లి గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. మెదక్‌ పట్టణ నవాబ్‌పేటకు చెందిన మేకల మహేశ్‌(32), అదే ప్రాంతానికి విజయ్‌కుమార్‌, పెరక రాజు, రాజు మెదక్‌ – చేగుంట ప్రధాన రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రగాయాలతో మహేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మగ్గురికి గాయాలు అయ్యాయి. అదే సమయంలో అటు వైపు వస్తున్న జెడ్పీ చైర్మన్‌ హేమలతగౌడ్‌ విషయం గమనించి కారులో ఇరుక్కుపోయిన వారిని తన సిబ్బందితో పాటు భర్త శేఖర్‌గౌడ్‌ సాయంతో బయటకు తీశారు. వెంటనే మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నశంకరంపేట పోలీస్‌లు వివరాలు నమోదు చేసుకున్నారు.

    ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు

    దుబ్బాకరూరల్‌: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గంగరాజు కథనం మేరకు.. మండలంలోని గంభీర్‌ పూర్‌ గ్రామానికి చెందిన పర్స కనకయ్య (56) కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పని నిమిత్తం టీవీఎస్‌ ఎక్సెల్‌పై దుబ్బాకకు వచ్చి, తిరిగి వెళ్తున్నాడు. ఆరేపల్లి గ్రామ కమాన్‌ వద్ద నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సాయి కిరణ్‌ రెడ్డి కారులో అతివేగంగా వచ్చి కనకయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కనకయ్యకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు డ్రైవర్‌ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    ఓఆర్‌ఆర్‌పై మహిళను ఢీకొట్టిన కారు

    పటాన్‌చెరు టౌన్‌: ఓఆర్‌ఆర్‌ పై మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బీడీఎల్‌ సీఐ రవీందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండలం పాటీ గ్రామ శివారులో నారాయణ కాలేజ్‌ సమీపంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న మంగమ్మ ఓఆర్‌ఆర్‌ పై కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఉదయం డివైడర్‌ మధ్యలో పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా, హైదరాబాద్‌ గచ్చిబౌలి వైపు నుంచి పటాన్‌చెరు వైపు వస్తున్న కారు మంగమ్మను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. గాయపడిన మంగమ్మ భర్త బోజియా ఫిర్యాదు మేరకు బీడీఎల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    ఆర్టీసీ బస్‌, బైక్‌ ఢీ..

    హుస్నాబాద్‌: ఆర్టీసీ బస్‌, బైక్‌ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కోహెడ మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన దావ రాములు (42) హుస్నాబాద్‌ నియోజకవర్గం నవాబుపేటకు బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో హుస్నాబాద్‌ పట్టణ శివారులోకి రాగానే కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ఇంటి

    ఆ స్థలంలో ఇల్లు లేకున్నా ఉన్నట్లుగా దొంగ తక్‌పట్టీలు సృష్టించి 59 జీఓకు దరఖాస్తు చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో 4–47/5/ఏ, 4–47/5/బీ, 4–47/5/సీ, 4–47/5/డీ, 4–47/5/ఈ, 4–47/5/ఎఫ్‌ ఇంటి నెంబర్‌లు గ్రామ పంచాయతీ నుంచి జారీ చేయకున్నా.. కేటాయించినట్లు దరఖాస్తు చేశారు. తక్‌పట్టీలు దొంగవి సృష్టించి 59 జీఓ కోసం దరఖాస్తు చేశారు. ఇలా దొంగ తక్‌పట్టీలు ఒక్క మిట్టపల్లి పరిధిలోనే కాకుండా చాలా చోట్ల సృష్టించి ప్రభుత్వంను, అధికారులను తప్పుతోవ పట్టించి ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. ఈ ఇంటి నంబర్‌లు జారీ చేయలేదని, రికార్డుల్లో లేదని మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌ తెలిపారు.

    సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 58, 59 జీఓలను విడుదల చేసింది. ఇదే అదనుగా చేసుకొని కొందరు రియల్టర్లు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను అధికారుల సహకారంతో పాగా వేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశారు. ఎన్నికల ముందు అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే అందరికీ క్రమబద్ధీకరించారు. దీంతో ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాదారుల చేతుల్లో చేరిపోయాయి.

    జిల్లా వ్యాప్తంగా 8,304 దరఖాస్తులు

    ప్రభుత్వ స్థలాల్లో 2014 కంటే ముందు ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు 58, 59 జీవోలను ప్రభుత్వం విడుదల చేసి మార్చి 31, 2022 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 4,196 మంది దరఖాస్తు చేశారు. మరోసారి జీఓను పునరుద్ధరించి జూన్‌ 2, 2020 వరకు ఇంటి నిర్మాణం చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. మే 31, 2023 వరకు దరఖాస్తులు స్వీకరించగా 4,018 వచ్చాయి. 2020 జూన్‌ 2 వ తేదీ కంటే ముందు నిర్మించిన ఇంటి వివరాలు, ఇంటి పన్నులు, విద్యుత్‌ బిల్లు, కుళాయి పన్ను, స్థలం సంక్రమించిన తీరు, సర్వే నంబర్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలు తదితర వాటితో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. వీటి పరిశీలనకు జిల్లా అధికారులను ఒక్కో మండలానికి కేటాయించి దరఖాస్తులను పరిశీలించి డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. మూడు దఫాల్లో రుసుమును చెల్లించే వెసులు బాటును కల్పించారు. 58 జీఓకు సంబంధించిన దరఖాస్తుల్లో 125 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ఉచితంగానే క్రమబద్ధీకరించారు. 59 జీఓలో పరిధిలోకి 250 చదరపు గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్‌ విలువలో 50 శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఉన్న ఇళ్లకు 75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేశారు.

    ఫేక్‌ తక్‌పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి

    ఈ ఫేక్‌ తక్‌పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి స్వయంగా ప్రింటింగ్‌ చేయించి చాలా మందికి ఇలా తక్‌ పట్టీలు రాసి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో తక్‌పట్టీకి స్థలంను బట్టీ డబ్బులు వసూలు చేశారని తెలిసింది. ఇలా దొంగ తక్‌పట్టీలను సృష్టించి ఇచ్చారు.

    ఇంటి నంబర్‌ రికార్డుల్లో పరిశీలించకుండానే...

    దరఖాస్తు దారుడు పేర్కొన్న ఇంటి నంబర్‌ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉందా లేదా అని పరిశీలించకుండానే పలువురు అధికారులు ఆమోదం తెలిపారు. అలాగే ఆ స్థలంలో దరఖాస్తు దారుడు ఇంటి నిర్మాణం చేశాడా లేదా అని సైతం పరిశీలించలేదు. విచారణలో భాగంగా ఇంటి ముందు దరఖాస్తు దారుడి ఫొటోను కూడా తీసుకోవాల్సిండగా ఇతరుల గృహాల వద్ద ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అధికారులు అప్‌లోడ్‌ చేశారు. పరిశీలనకు వెళ్లిన అధికారులు పలువురు కాసులకు ఆశ పడి ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కారని ప్రచారం జరుగుతోంది. ఇల్లే లేకుండా దొంగ తక్‌ పట్టీలు, ఇంటి నంబర్‌ను సృష్టించిన వారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

    59 జీఓకు దరఖాస్తులు

    దొంగ తక్‌పట్టీలను సృష్టించిన

    పలువురు దరఖాస్తు దారులు

    జిల్లాలో 8వేల మంది

    క్రమ బద్ధీకరణకు దరఖాస్తు

    ఇంటినంబర్‌లు రికార్డుల్లో

    పరిశీలించకుండానే

    పలువురు అధికారులు అమోదం

    ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం

    చర్యలు తీసుకుంటాం

    ఇంటి నిర్మాణం చేపడితేనే ఇంటి నంబర్‌ను గ్రామ పంచాయతీ కేటాయిస్తుంది. ఎవరైనా తప్పుడు తక్‌పట్టీలు ద్వారా ఇంటి నంబర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి పై క్రిమినల్‌ కేసులు సైతం పెడుతాం.

    – దేవకి దేవి, డీపీఓ

  • నర్సాపూర్‌: వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణితో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించడంతో విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి స్కానింగ్‌ కోసం కుటుంబ సభ్యులతో వచ్చింది. ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంకు వద్ద అటెండర్‌గా పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అమీర్‌కు స్కానింగ్‌ విభాగం వద్ద పేషెంట్ల జాబితా రాసే పని అప్పగించారు. జాబితా రాస్తున్న అమీర్‌ కొందరిని స్కానింగ్‌ చేసే గదిలోకి రావాలని సూచించాడు. ఓ గర్భిణి గదిలోకి వెళ్లగానే ఆమెతో అమీర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అరుస్తూ బయటకు వచ్చి కుటంబీకులతో విషయాన్ని చె ప్పింది. వెంటనే వారు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పావనికి ఫిర్యాదు చేశా రు. ఈ విషయమై డాక్టర్‌ పావని మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అమీర్‌ను విధుల నుంచి తొలగించామన్నారు.

    విధుల నుంచి తొలగింపు

  • మాచాపూర్‌లో హైనా కలకలం

    చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మాచాపూర్‌ హైనా దాడులు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం హైనా దాడిలో 65 జీవాలు మృతి చెందిన ఘటన మరువక ముందే శనివారం గ్రామానికి చెందిన రేగుల బాలయ్య, ఏదుల్ల మోహన్‌రెడ్డి పశువుల పాకలపై దాడి చేసి రెండు గేదె పిల్లలు (దూడలు)ను హత మార్చింది. దీంతో రైతులు బోరున విలపించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బుచ్చయ్య అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో రాత్రి బోన్‌లు, ఫ్లాష్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

    రెండు దూడలు మృతి

  • తల్లిదండ్రులకు గుడి కట్టిన తనయులు

    అక్కన్నపేట(హుస్నాబాద్‌): తల్లిదండ్రులకు గుడి కట్టారు. గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు తనయులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన గొట్టె కొమురవ్వ–కనకయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోగా, ఏడాది కిందట తండ్రి మృతి చెందాడు. శుక్రవారం తండ్రి కనకయ్య మొదటి వర్ధంతి సందర్భంగా గుడిలో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కుమారులు గొట్టె సదయ్య(వ్యవసాయం), మహేందర్‌(వ్యవసాయం), చిరంజీవి(ప్రైవేట్‌లో ఉద్యోగం)హైదరాబాద్‌లో చేస్తున్నాడు. తమను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే తమ వ్యవసాయ పొలంలో ప్రత్యేకంగా గుడి నిర్మించి అందులో తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించారు. తల్లిదండ్రులకు గుడి కట్టి పూజిస్తున్న అన్నదమ్ములను చూసి గ్రామస్తులు ఎంతో గర్విస్తున్నారు. ఇలాంటి కొడుకలను కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులని గ్రామస్తులు అంటున్నారు.

  • వెంకటేశం కోసం ముమ్మరంగా గాలింపు

    కల్హేర్‌(నారాయణఖేడ్‌): గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన మల్దోడ్డి వెంకటేశం ఆచూకీ లభించలేదు. శుక్రవారం నారాయణఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, కల్హేర్‌ ఎస్‌ఐ వెంకటేశం, ఎస్‌బీ, స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా పెద్దకోడల్‌గల్‌ వద్ద దొరికిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వెంకటేశంను తరలించిన వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశంను జుక్కల్‌ సమీపంలో ఓ ఫాంహౌస్‌లో విడిచినట్లు డ్రైవర్‌ చెప్పిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మహారాష్ట్రలోని దెగ్లూర్‌, తదితర ప్రాంతాల్లో గాలించారు. అనుమానిత వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

    రేషన్‌ బియ్యం పట్టివేత

    గజ్వేల్‌రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తుర్కపల్లి మండలం దయమండ తండాకు చెందిన వంకోదాత వెంకటేశ్‌, వంకోదాత చిన్నలు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు రైడ్‌ చేసి ట్రాలీ ఆటోలో ఉన్న 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

    అక్రమంగా మట్టి తరలింపు

    9 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌

    కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న వాహనాలను సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌, కోహెడ పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. మండలంలోని కూరెళ్ల గ్రామంలోని పెద్ద చెరువు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన తిప్పారపు నవీన్‌చారి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచరం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి 9 ట్రాక్టర్లతో పాటు జేసీబీలను పట్టుకున్నట్లు తెలిపారు.

    ఐదుగురిపై కేసు

    కొండపాక(గజ్వేల్‌): భూతగాదా విషయంలో దాడికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండలంలోని దోమలోనిపల్లికి చెందిన అబ్బు కనకవ్వ, మరిది అబ్బు క్రిష్ణమూర్తిలకు ఒకే శివారులో వ్యవసాయ భూమి ఉంది. అబ్బు కనకవ్వకు చెందిన వ్యవసాయ భూమిని క్రిష్ణమూర్తి కుటుంబీకులు శుక్రవారం ట్రాక్టర్‌తో దున్నుతున్నారు. మా భూమిని ఎందుకు దున్నుతున్నారని కనకవ్వ అడగడంతో మీ భూమి ఎక్కడిదంటూ బూతు మాటలు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఆమె కుమారులపై కట్టెలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు అబ్బు క్రిష్ణ మూర్తి, పిండి ఎల్లాలు, పిండి కవిత, అబ్బు యాదవ్వ, అబ్బు లింగంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    నిద్రలోనే డ్రైవర్‌ మృతి

    చిన్నశంకరంపేట(మెదక్‌): నిద్రలోనే కంటైనర్‌ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన నార్సింగి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వల్లూర్‌ జాతీయ రహదారి పక్కన ఓ దాబా వద్ద రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్‌ మనోజ్‌కుమార్‌ (36) గురువారం రాత్రి భోజనం చేసి కంటైనర్‌లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి మృతి చెంది ఉన్నట్లు దాబా యజమాణి బిష్‌నోమ్‌ మనిష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ అహ్మద్‌ మొహినొద్దీన్‌ తెలిపారు.

    చేపలు పడుతుండగా..

    కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

    తూప్రాన్‌: చేపల వేటకు వెళ్లి వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్‌ మండలం వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామానికి చెందిన గుడ్ల శ్రీశైలం(45) గ్రామ సమీపంలోని ఘనపూర్‌ గ్రామానికి చెందిన గౌతమ్మ చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలను విద్యుత్‌ వైరు సాయంతో పడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Vikarabad

  • సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌

    అనంతగిరి: వికారాబాద్‌ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో సర్వేనంబర్‌ 11, 117, 122లో పలువురు రైతుల నుంచి ఫారెస్టు ఽఅధికారులు తీసుకున్న భూములను వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన బాధిత రైతులతో కలిసి ఫారెస్టు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 65 ఎకరా ల్లో 35 కుటుంబాలు ఈ భూములను నమ్ముకు ని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారన్నా రు. 2013లో ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పట్టాలు ఇచ్చిందన్నారు. 2020–21 లో ఫారెస్టు అధికారులు అక్రమంగా మా భూ ముల్లో ప్రవేశించి జేసీబీలు పెట్టించి భూముల్లోకి రైతులు రాకుండా అడ్డుకున్నారన్నారు. సర్వేచేయించి మా భూములు మాకు ఇవ్వాలన్నారు. సుదర్శన్‌, అనసూయ, లక్ష్మి, హన్మమ్మ, అనంతయ్య, పోచయ్య పాల్గొన్నారు.

  • యాచారం: రైతులు ఏళ్లుగా భూ సమస్యలు ఎదుర్కొంటూ సమయంతో పాటు డబ్బును సైతం వృథా చేసుకుంటున్నారని లీఫ్స్‌ సంస్థ(లీగల్‌ ఎంపవర్మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మార్స్‌ సొసైటీ) ఉపాధ్యక్షుడు జీవన్‌ పేర్కొన్నారు. యాచారం మండల కేంద్రంలో శుక్రవారం భూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామాల్లో దాదాపు 3 వేలకు పైగానే భూ సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. అనేక సమస్యలు పట్టాదారు, పాసుపుస్తకాల్లో రైతుల పేర్ల మార్పు, మ్యూటేషన్లు, రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం వంటివే అన్నారు. వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో మండలంలో భూ సమస్యలు లేని విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నానక్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ ముత్యాల వెంకట్‌రెడ్డి, రైతులు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    లీఫ్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్‌

  • పనులు పూర్తి చేయండి

    దౌల్తాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని సురాయిపల్లి, చల్లాపూర్‌, సలీంపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, పీఆర్‌ఏఈ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

    డీఈఓ రేణుకాదేవి

  • ఉత్కంఠకు తెర!

    ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా బర్ల మంగయాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీఓ అనంతరెడ్డి శుక్రవారం ఉదయం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటిలో ఉన్న 24 మంది కౌన్సిలర్లకుగాను 14 మంది కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. అనంతరం వైస్‌ చైర్‌పర్సన్‌గా బర్ల మంగను ఎన్నుకునేందుకు 18వ వార్డు కౌన్సిలర్‌ ఇందిరాల రమేశ్‌ ప్రతిపాదించగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి ఆమెను బలపరిచారు. సమావేశ మందిరంలో ఉన్న మరో 12 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తమ మద్దతును తెలిపారు. ఈ పదవిని ఆశిస్తూ పోటీలో ఎవరూ లేకపోవడంతో 14 మందితో ఏకగ్రీవంగా బర్ల మంగ ఎన్నికై నట్లు ప్రిసైడింగ్‌ అధికారి అనంతరెడ్డి ప్రకటించారు. మంగకు మెజార్టీ ఉండటంతో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి ఎన్నికకు హాజరుకాలేదు. పోటీలో ఉన్నా గెలిచే అవకాశాలు లేనికారణంగా ఇద్దరూ బీజేపీ సభ్యులు, ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌ సభ్యులు గైర్హాజరైనట్లు సమాచారం. కాగా కాంగ్రెస్‌కు చెందిన చైర్‌పర్సన్‌ స్రవంతిపై గత ఫిబ్రవరిలో పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం, అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరిపై గత నెలలో పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

    కాంగ్రెస్‌ శ్రేణుల సంబురాలు

    వైస్‌ చైర్‌పర్సన్‌గా బర్ల మంగ ఎన్నిక కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత, ఉద్యమకారుడైన బర్ల జగదీశ్‌యాదవ్‌ మాట్లాడుతూ.. తన సతీమణి మంగను మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న మంగకు శాలువ కప్పి, పూలదండలతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఎన్నికకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ మారయ్యల ఆధ్వర్యంలో పోలీస్‌ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరులు లోనికి రాకుండా చూశారు. ప్రత్యర్థులేవ్వరూ సమావేశానికి రాకపోవడంతో ఏకగ్రీవంగా వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.

    ‘పట్నం’మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గాబర్ల మంగ ఎన్నిక

    14 మంది కౌన్సిలర్ల మద్దతుతో విజయం

    గైర్హాజరైన బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు

  • నేటి

    అనంతగిరి: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ అనంతగిరిపల్లి ప్రిన్సిపాల్‌ జేజే ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

    వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్‌

    అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. విడిగా, గుర్తింపు పొందని పత్తి విత్తనాలు విక్రయించరాదని సూచించారు. విత్తన సంచి మీద జీఈఏసీ సంఖ్య తప్పని సరిగా ఉండాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. స్టాకు వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

    ప్రశాంతంగా పాలిసెట్‌

    అనంతగిరి: పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోర్డినేటర్‌ పరవేశ్వర్‌ తెలిపారు. వికారాబాద్‌లోని మూడు సెంటర్లలో 1,325 మంది విద్యార్థులకు గాను 1,145మంది హాజరైనట్లు తెలిపారు.

    మత్స్యకార్మికుల

    సమస్యలు పరిష్కరించాలి

    ఇబ్రహీంపట్నం: చేప, రొయ్య పిల్లల పంపిణీని టెండర్ల విధానం ద్వారా కాకుండా.. ఈ సంవత్సరం మత్స్య సొసైటీ బ్యాంకు ఖాతాలో నగదు జమచేయాలని మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన టీఎంకేఎంకేఎస్‌ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచినా మత్స్యశాఖకు మంత్రిని నియమించలేదని విమర్శించారు. జూన్‌ నెల సమీపిస్తున్నా మత్స్యకారులకు ఇచ్చే చేపపిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృగశిర కార్తెను చేపల పండువగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఎఫ్‌టీఎల్‌ హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కొండల్‌, రాములు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

    జీవాల సంరక్షణకు

    జాగ్రత్తలు అవసరం

    రంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి విజయ్‌కుమార్‌రెడ్డి

    మొయినాబాద్‌: జీవాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సురంగల్‌లో శుక్రవారం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెలకు చిటుక రోగం నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కురిసే వర్షాలకు భూమిపై మొలకెత్తే గడ్డిని తినడం ద్వారా గొర్రెలకు చిటుకరోగం వచ్చే అవకాశం ఉందన్నారు. చిటుకరోగం వస్తే గొర్రెలు వెంటనే మృతి చెందుతాయన్నారు. ఈ రోగం రాకుండా గొర్రెల కాపర్లు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చిటుక వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా వేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శ్రీలత, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • ఇంకెన్నాళ్లు..!

    వికారాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల కోసం పేదలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే విషయంలోనూ తాత్సారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో రేషన్‌కార్డులు జారీ చేశారు. ఏడాది క్రితం దారఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి కార్డులు ఇచ్చారు. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు సంఖ్య పెరిగినా చేరికలు కాలేదు. సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది పేర్లను తొలగించారు. చనిపోయిన వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి వెంటనే తొలగిస్తున్న ప్రభుత్వం జన్మించిన వారి పేర్లు, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వారి పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు, పేర్ల చేరికపై నిర్ణయం తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.

    పెండింగ్‌లో వేల దరఖాస్తులు

    ఎనిమిదేళ్ల క్రితం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు మంజూరు చేయకుండా ఏడాదికి సరిపడా కూపన్లు ఇచ్చింది. ఆ తర్వాత కూపన్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో నెట్‌ సెంటర్లలో కూపన్లు తెచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 35వేల మంది కార్డుల్లో పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో మరో 39 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే ఎక్కువ.

    2,41,622 ఆహార భద్రతా కార్డులు

    జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. 2,41,622 ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారు. ఇందులో 2,08,162 ఎఫ్‌ఎస్సీ కార్డులు, 26,730 అంత్యోదయా కార్డులు, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు.

    కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు

    కొత్త పేర్ల నమోదుకు

    మోక్షమెప్పుడో?

    ప్రజాపాలనలో వేల అర్జీలు

    జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలు

    ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు 2,41,622

  • కాంగ్రెస్‌కు ‘క్రాస్‌’ గుబులు!

    తాండూరు: కాంగ్రెస్‌ నేతలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. దశాబ్ద కాలంగా ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించడం మండల, జిల్లా స్థాయి నాయకులకు సర్వసాధారణంగా మారింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి తాము మద్దతు ఇచ్చినందుకే గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. తాము క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించడం వల్లే హస్తం పార్టీ విజయం సాధించిందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా బీఆర్‌ఎస్‌ నుంచి వలస వచ్చిన వారే. గతంలో బలమైన కేడర్‌తో కనిపించిన పార్టీలు నాయకుల వలస బాట కారణంగా ఓటమిని చవిచూశాయి. కొత్తగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లు, చాలా కాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి వారంతా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

    అందరి దృష్టి చేవెళ్లపైనే..

    కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతల భవితవ్యం చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వికారాబాద్‌, తాండూరు, పరిగి చేవెళ్ల పరిధిలోకి వస్తాయి. కొడంగల్‌ పాలమూరు పరిధిలోకి వెళుతుంది. జిల్లాలకు చెందిన వారే సీఎంగా, అసెంబ్లీ స్పీకర్‌గా ఉండటంతో అందరి దృష్టి చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి గెలుపుపై పడింది. అయితే ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. బీఆర్‌ఎస్‌ పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే ప్రచారం నుంచి తప్పుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్‌కు వర్గపోరు, క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. సొంత పార్టీ నాయకులే బీజేపీకి ఓట్లు వేయించినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ బాధ్యతలను నాయకులు, కేడర్‌కు అప్పగించకుండా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అతని సోదరులు, కుటుంబ సభ్యులే చూసుకోవడం కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడలేదు. ఇది కూడా క్రాస్‌ ఓటింగ్‌కు దోహదం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.

    బీజేపీకి కలిసొచ్చేనా?

    చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం ఆవిర్భవించిన నాటి నుంచి బీజేపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభ ఎన్నికలైనా 2 లక్షల నుంచి 3.50 లక్షల ఓట్లకే పరిమితమవుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు శాశనసభ నియోజకవర్గాల్లో 3.30లక్షల ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇవ్వకపోవడంతో ఆ ఓటు బ్యాంక్‌ తమకే అనుకూలంగా పడుతుందని బీజేపీ భావిస్తోంది.

    ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించిన నేతలు

    అధికారం ఉన్నచోట వాలిపోతున్న నాయకులు

    తమ వల్లే అధికారంలోకి వచ్చిందంటూ ప్రచారం

    కాంగ్రెస్‌ నుంచి ఇద్దరి సస్పెండ్‌

    తాండూరు టౌన్‌: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై కాంగ్రెస్‌ జిల్లా కమిటీ సస్పెండ్‌ చేసింది. తాండూరు పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వడ్డే శ్రీనివాస్‌ తోపాటు కొర్విచేడ్‌ గ్రామానికి చెందిన యూత్‌ ప్రభంజనం అధ్యక్షుడు శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీ రామ్మోహన్‌ రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. వీరిద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

  • వైద్య

    వైద్యో నారాయణ హరి.. అలాంటి దేవుళ్లకు కొందరు మచ్చ తెస్తున్నారు. అర్హత లేని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్లినిక్‌ల పేరిట డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన వారి ఆపరేషన్ల వరకు కానిచ్చేస్తున్నారు. దీంతో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.

    పరిగి: అర్హత లేని వైద్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అవతారం ఎత్తుతున్నారు. క్లీనిక్‌ల పేరిట వైద్య సేవలు అందిస్తున్నారు. రోగి పరిస్థితి చేయి దాటితే మరో ఆస్పత్రికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇదేదో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు అనుకుంటే పొరపాటే. పరిగి పట్టణం తోపాటు మండల కేంద్రాల్లో జరుగుతున్న తతంగం. ఇటీవల కాలంలో ఇలాంటి క్లీనిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

    అనర్హులే అధికం

    జిల్లాలోని 19 మండలాల పరిధిలో దాదాపు వందల సంఖ్యలో ఆర్‌ఎంపీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అందులో సగానికిపైగా అనర్హులే వైద్యం చేస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన వారు చిన్న వ్యాధులు మొదలుకొని పెద్ద పెద్ద రోగాలకు చికిత్స అందిస్తున్నారు. సీరియస్‌ కేసులను తమకు తెలిసిన ప్రైవేటు ఆస్పత్రులకు 20 నుంచి 30శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు.

    నిబంధనలకు విరుద్ధంగా..

    పట్టణాలు, మండల కేంద్రాల్లో క్లీనిక్‌లు నిర్వహిస్తున్న వారు వాటికి అనుబంధంగా రక్త పరీక్ష కేంద్రాలు, మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు. రోగులు ఏ వ్యాధితో వచ్చినా సరే ముందుగా రక్త, మూత్ర పరీక్షలు రాసి.. వారు సూచించిన కేంద్రాలకే వెళ్లాలని చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రాసిన మందులను వారు పేర్కొన్న మెడికల్‌ దుకాణాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వైద్య పరీక్షలు, మెడికల్‌ దుకాణాల నుంచి కమీషన్‌ దండుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్‌ఎంపీలు అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ ఎంబీబీఎస్‌ డాక్టర్టుగా చలామని అవుతున్నారు. క్లీనిక్‌లలో నిబంధనలకు విరుద్ధంగా మందులు వాడుతున్నారు. దీంతో వైద్యం వికటించి రోగులు చనిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికి బయట పడ్డారు. వైద్యం వికటించి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి బయటికి రాకుండా చూసుకుంటున్నారు.

    సీజ్‌ చేసినా..

    ఇటీవల పరిగి పట్టణంలో, దోమ మండల కేంద్రంలో వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు కొల్పోయారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు రెండు క్లీనిక్‌లను సీజ్‌ చేశారు. నెలరోజుల వ్యవధిలోనే మళ్లీ రోగులకు చికిత్సలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లీనిక్‌ నిర్వాహకుల నుంచి ముడుపులు వస్తున్నందునే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

    జ్వరంతో వెళ్లి.. శవంగా వచ్చి..

    పరిగి: జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన యువతి విగతజీవిగా వచ్చిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండల కేంద్రానికి చెందిన రుక్మొద్దీన్‌ చిన్న కూతురు యాస్మిన్‌బేగం(22) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ నెల 22న పరిగి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు మందులు ఇచ్చి ఇం టికి పంపాడు. అయినా జర్వం తగ్గకపోవడం, మరింత ఎక్కువ కావడంతో మరుసటి రో జుమరో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యు లు యాస్మిన్‌బేగంను అడ్మిట్‌ చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున యువతి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోవడంతో నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి రుక్మొద్దీన్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

    నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు

    పట్టా లేకుండానే డాక్టర్‌ అవతారం

    వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్న వైనం

    సీరియస్‌ అయితే మరో ఆస్పత్రికి రెఫర్‌

    పట్టించుకోని అధికారులు

    చర్యలు తీసుకుంటాం

    అర్హత లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసి అర్హతలు లేని క్లినిక్‌లను సీజ్‌ చేస్తాం.

    – పల్వన్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి