-
ఎంతో ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్, కుమారులు వినోద్(6), రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు. -
అమేథీలో ఇలాంటి చర్య మొదటిసారి చూస్తున్నా.. కిషోరి లాల్ శర్మ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిని అమేథీ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి 'కిషోరి లాల్ శర్మ' తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని శర్మ పేర్కొన్నారు.పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం సమంజసం కాదని, ఇది అమేథీ సంస్కృతికి విరుద్ధమని కిషోరి లాల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికి అనేకసార్లు ఈ నియోజక వర్గంలో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి చర్య మాత్రం జరగలేదు. ఇలాంటి చర్యలను మొదటిసారి చూస్తున్నానని ఆయన అన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. వారి పనితీరును బట్టి ఓట్లు అడగాలి. ఆలా కాకుండా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం క్షమించరాని నేరమని, నిందితులను పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఈ ఘటనను యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి అవినాష్ పాండే ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ మూలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, స్మృతి ఇరానీ తమ ఓటమిని స్పష్టంగా చూస్తున్నారు. అందుకే అమేథీలో హింసాత్మక పరిస్థితిని సృష్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.అమేథీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన సంఘటన గురించి ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు బయట పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగలగొట్టారని, ఆదివారం రాత్రి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. సంఘటన గురించి తెలుసుకుని, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి తన వాహనాన్ని ధ్వంసం చేశాడని, అతనిపై రాళ్లు రువ్వడం వల్ల ఎఫ్ఐఆర్ను నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనూప్ సింగ్ తెలిపారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024 -
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. హిమాచల్‌లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.ఆమె చంబాలోని భర్మౌర్ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని అందరికీ కనిపించారు. ఆ వీడియోను కంగన సోషల్ మీడియాలో షేర్ చేశారు.సిమ్లాలోని రాంపూర్‌లో ప్రచారం సాగించినప్పుడు ఆమె అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్ వినిపించింది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు. -
జూన్ 4 బీజేడీ సర్కార్‌కు ఆఖరిరోజు: ప్రధాని మోదీ
భువనేశ్వర్: ఒడిశాలోనూ రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, జూన్‌లో జరగబోయే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను వస్తానంటూ బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బెహ్రాంపూర్ గాంజాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన నేరుగానే నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు.ఒడిషాను కాంగ్రెస్.. ఆ తర్వాత బీజూ జనతా దళ్ డెబ్బై ఏళ్లపాటు దోచుకున్నాయి. ఒడిషాలో నీరు ఉంది. సారవంతమైన భూములు ఉన్నాయి. ఖనిజ లవణాలతో కూడిన నేలలు ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది. భగవంతుడు ఈ నేలకు అపారమైన సంపద ఇచ్చాడు. అయినా కూడా రాష్ట్రం పేదరికంలోనే మగ్గుతోంది. అందుకు కారణం ఏంటి?..కాంగ్రెస్, బీజేడీ నేతలు కొనసాగించిన దొపిడీనే ఇందుకు కారణం. బీజేడీలో ఉన్న చోటా నేతలకు కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయంటే అర్థం ఏంటి?... ఇక్కడి కూలీపనులు చేసుకునేవాళ్లు వలసలు వెళ్లడానికి కారణాలు ఏంటి?. ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?. బడికి వెళ్లని చిన్నారుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?.. ఒడిషా ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోవడం లేదు. గర్భవతులకు కేంద్రం నెలకు రూ.6వేలు ఆసరా ఇచ్చేది. దానిని ఒడిశా ప్రభుత్వం రద్దు చేసిందంటే మీరు ఆశ్చర్యపోతారు.యూపీఏ పదేళ్ల కాలంలో కేంద్రం ఒడిషాకు ఇచ్చింది లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, మోదీ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల ఇచ్చింది. జల జీవన్ మిషన్ కింద పది వేల కోట్లు కేటాయించింది. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. మోదీ ప్రభుత్వం మీ కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటే.. బీజేడీ ప్రభుత్వం మాత్రం ఆ ప్యాకెట్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటోంది.ఒడిషా ప్రజలు ఆలోచనతో బీజేపీకి ఓటేయాలి. జూన్ 4వ తేదీ బీజేపీ ప్రభుత్వానికి ఆఖరి తేదీ. ఒడిషాలో కమలం వికసించడం ఖాయం. బీజేపీ సీఎం ప్రమాస్వీకారానికి నేనుస్తాను. అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఒడిషా యూనిట్‌పై, అది రూపొందించిన మేనిఫెస్టోపై మోదీ ప్రశంసలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమికి దూరంగా బీజేడీ.. పార్లమెంట్లో మాత్రం కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో ఒడిషాలోని 21 లోక్‌సభ సీట్లతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ 147 స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
అహ్మదాబాద్‌లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్‌లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్నగర్లోని హెచ్‌బీకే పాఠశాల, థాల్తేజ్‌లోని జెబార్ పాఠశాల, ఎస్జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్‌లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్‌లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్లో ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement