ప్రధాన వార్తలు
మంగళూరులో దాహం.. దాహం!
కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్‌పై జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది.
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
గోదావరి వరదల సమయంలోను..
వీడియోలు
మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
వాలంటీర్లపై చంద్రబాబు,పవన్ ఏడుపు: కొడాలి నాని
నా తిరుపతి మహిళలకు మాటిస్తున్న..మైండ్ బ్లోయింగ్ స్పీచ్
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
లోకేష్ 'రెడ్ బుక్' బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
పాలిటిక్స్
‘అర్బన్ నక్సల్స్’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు
యూపీఏకు ప్రజామోదం
చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!
అలాగైతే తప్పుకుంటా
News Page Related News
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
అలా రెండు సార్లు జరిగినా తట్టుకున్నాం: నిర్మాత
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే: సీఎం కేసీఆర్
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..