-
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్‌ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్‌వైట్‌గా పల్చగా ఉండే బ్రెడ్‌ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్‌ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్‌లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్‌లా పలచటి పొరలాంటి స్లైస్‌లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్‌లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్‌లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్‌లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్‌లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
పాఠశాలల అభివృద్ధి ఇలా...
తప్పక చదవండి
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
Advertisement