-
ఓటీటీలోకి రియల్ లైఫ్ ట్రాజెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సరైన సినిమాల్లేక బాక్సాఫీస్ డల్ అయిపోయింది. అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీపై గంపెడాశలు పెట్టుకుని గతవారం థియేటర్లలో రిలీజ్ చేశాడు. పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. ప్రస్తుతానికైతే ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ బాగానే ఆకట్టుకుంటోంది. త్వరలో 'ఆవేశం' స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రియల్ లైఫ్ సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే 'సలార్'లో రాజమన్నార్ అనే విలన్ పాత్రలో మెప్పించాడు. ఇతడు మెయిన్ రోల్లో నటించిన 'ద గోట్ లైఫ్' అనే సినిమా మార్చి చివర్లో రిలీజైంది. పనికోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఎలా చిక్కుకుపోయాడు? అక్కడి నుంచి స్వదేశానికి ఎలా తిరిగొచ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం సీరియస్ కాన్సెప్ట్ కావడంతో మనోళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇకపోతే 'ద గోట్ లైఫ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైందని తెలుస్తోంది. మే 26 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. మరోవైపు చెప్పిన టైమ్ కంటే ముందే మే 10నే ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తీయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది. ఆరేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టి, పలు కష్టాలతో పూర్తి చేశారు. ఈ ఏడాది రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్) -
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
దక్ష నగార్కర్.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలపైనే అవుతోంది. ఇన్నేళ్లలో ఐదు సినిమాలు మాత్రమే చేసింది. అవన్నీ తెలుగు చిత్రాలు మాత్రమే కావడం గమనార్హం. ఇంతకాలంగా టాలీవుడ్‌నే అంటిపెట్టుకుని ఉన్నా భారీ స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు. హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర చిత్రాలతో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.సర్జరీ గదిలోఅయితే తరచూ ఏదో ఒక ఈవెంట్లో మెరుస్తున్న బ్యూటీ.. తాజాగా ఆస్పత్రిపాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'గడిచిన కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైనవి.. ఎవరో తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో పడి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు మత్తు మందు(అనస్థీషియా) సూదులు గుచ్చారు.ప్రేమ, కేరింగ్దాన్నుంచి కోలుకోవడం కష్టంగా ఉంది. నా ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలబడ్డారు. ఇలాంటి సమయంలో ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్‌కు కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. నా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీరు బాధపడకూడదు మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించండి. నా గురించి సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే మీరు బాధపడకూడదు కాబట్టి!' అని రాసుకొచ్చింది. తనకు ఏ సర్జరీ అయిందన్నది మాత్రం చెప్పలేదు. ఇది చూసిన జనాలు.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్‌లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్‌లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
తెలుగు బుల్లితెర షోలలో ఒకప్పుడు మేల్ కమెడియన్లదే ఆధిపత్యం ఉండేది. రానురానూ పరిస్థితిలో మార్పు వచ్చింది. లేడీస్ తాము కూడా కామెడీ పండించగలమని నిరూపించుకున్నారు. కామెడీ క్వీన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా పటాస్, జబర్దస్త్ షోలలో ఫటాఫట్ పంచ్‌లు పేలుస్తూ అందరికీ దగ్గరైంది ఫైమా. ప్రవీణ్‌తో లవ్!అదే షోలోని మరో కమెడియన్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం చూసి ఇదంతా నిజమే అని జనాలు ఫిక్సయిపోయారు. కానీ అంతలోనే బ్రేకప్ జరిగిందంటూ రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య ప్రవీణ్ తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేసిందని వెల్లడించాడు. ఆ ఫేమ్ వాడుకున్నాంతాజా ఇంటర్వ్యూలో ఫైమా ఈ విషయం గురించి మాట్లాడింది. 'టీవీ షోలలో కనిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజమని నమ్మొద్దు. ప్రవీణ్, నన్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. మా జంటను ఆదరించారు. దాన్ని వాడుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేశాం. ప్రవీణ్‌కు, నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయి. అవి చెప్పుకోలేం.. అందుకే దూరం కావాల్సి వచ్చింది. మాట్లాడుకోవట్లేదు కూడా!వ్యక్తిగత విషయాల వల్లేమాకు గొడవ జరిగినప్పుడు దాన్ని పక్కనపెట్టేయాలే తప్ప దాన్ని అందరి ముందూ చెప్పుకుని గొడవను పెద్దది చెయ్యడం నాకిష్టం లేదు. అంతకుముందు మా రిలేషన్, అండర్స్టాండింగ్ అంతా బాగుండేది. వ్యక్తిగత విషయాల వల్ల మేము దూరమయ్యాం. అలాంటప్పుడు పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. సింపథీకానీ తనకు పేరెంట్స్ లేకపోవడంతో అతడు మీడియా ముందు మాట్లాడే మాటలు సింపథీకి దారి తీస్తున్నాయి. తన మీద నేను నింద వేయడం లేదు. కానీ తన మీద సింపథీతో అతడు ఏం చెప్పినా జనాలు నన్ను నెగెటివ్ చేస్తున్నారు. దయచేసి మా రిలేషన్‌కు ఏ పేరూ పెట్టకండి' అని ఫైమా చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్క పొరపాటుతో జాతకమే మారిపోయింది! అసలు పేరేంటంటే?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement