Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ravindra Jadeja All Round Show Propels CSK To Big Win Over PBKS
రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్‌ షో

ధర్మశాల: ఐపీఎల్‌ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించాలనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి గత బుధవారం పంజాబ్‌ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ స్యామ్‌ కరన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), డరైల్‌ మిచెల్‌ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో రాహుల్‌ చహర్‌ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్‌ దూబే (0)లను అవుట్‌ చేయగా... మిచెల్‌ను హర్షల్‌ పటేల్‌ పెవిలియన్‌కు పంపించాడు. దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్‌తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చహర్‌ (3/23), హర్షల్‌ పటేల్‌ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్‌ పాండే (2/35) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో బెయిర్‌స్టో, రోసో లను అవుట్‌ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్, కరన్, అశుతోష్‌లను జడేజా... శశాంక్‌ను సాన్‌ట్నెర్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ గెలుపుపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) రబడ (బి) అర్‌‡్షదీప్‌ 9; రుతురాజ్‌ (సి) జితేశ్‌ (బి) చహర్‌ 32; మిచెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్‌ 30; శివమ్‌ దూబే (సి) జితేశ్‌ (బి) చహర్‌ 0; మొయిన్‌ అలీ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్‌ కరన్‌ 17; జడేజా (సి) స్యామ్‌ కరన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 43; సాన్‌ట్నెర్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) చహర్‌ 11; శార్దుల్‌ (బి) హర్షల్‌ 17; ధోని (బి) హర్షల్‌ 0; తుషార్‌ (నాటౌట్‌) 0; గ్లీసన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్‌: రబడ 3–0–24–0, అర్‌‡్షదీప్‌ 4–0–42–2, స్యామ్‌ కరన్‌ 4–0–34–1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1–0–19–0, రాహుల్‌ చహర్‌ 4–0–23–3, హర్షల్‌ పటేల్‌ 4–0–24–3. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) సబ్‌–సమీర్‌ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్‌స్టో (బి) తుషార్‌ 7; రోసో (బి) తుషార్‌ 0; శశాంక్‌ (సి) సిమర్జీత్‌ (బి) సాన్‌ట్నెర్‌ 27; స్యామ్‌ కరన్‌ (సి) సాన్‌ట్నెర్‌ (బి) జడేజా 7; జితేశ్‌ (సి) ధోని (బి) సిమర్జీత్‌ (బి) 0; అశుతోష్‌ శర్మ (సి) సిమర్జీత్‌ (బి) జడేజా 3; బ్రార్‌ (నాటౌట్‌) 17; హర్షల్‌ (సి) సబ్‌–సమీర్‌ రిజ్వీ (బి) సిమర్జీత్‌ 12; చహర్‌ (బి) శార్దుల్‌ 16; రబడ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్‌: సాన్‌ట్నెర్‌ 3–0–10–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–35–2, గ్లీసన్‌ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్‌ 3–0–16–2, శార్దుల్‌ 2–0–12–1.

Kolkata Knight Riders Beat by LSG 98 runs
ల‌క్నోను చిత్తు చేసిన కేకేఆర్‌.. 98 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 98 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్న‌ట్లే. కేకేఆర్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో 16.1 ఓవర్లలో 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా మూడు వికెట్ల ప‌డ‌గొట్ట‌గా.. ర‌స్సెల్ రెండు, స్టార్క్‌, న‌రైన్ చెరో వికెట్ సాధించారు. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్‌(36) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌దర్శ‌న చేయ‌లేక‌పోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. 

Ravindra Jadeja breaks MS Dhonis massive record for CSK in IPL history
IPL 2024: చ‌రిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు

ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగ‌ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా కీల‌క పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను జ‌డ్డూకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వ‌రిచింది.ఈ క్ర‌మంలో జ‌డేజా ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌పున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆట‌గాడిగా జ‌డ్డూ నిలిచాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది అవార్డుల‌ను గెలుచుకున్నాడు.ఇంత‌కుముందు ఈ రికార్డు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును జ‌డేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మ‌రో రికార్డును జడ్డూ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 40 పైగా ప‌రుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్‌, షేన్ వాట్స‌న్ స‌ర‌స‌న జ‌డేజా చేరాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్స‌న్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్ల‌స్ స్కోర్‌, 3 వికెట్లు తీశారు.

Ruturaj Gaikwad Reveals Several CSK Players Were Down with Flu
జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు.. అయినా అద‌ర‌గొట్టారు: రుతురాజ్‌

ఐపీఎల్‌-2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. ఈ విజ‌యంతో సీఎస్‌కే పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్ధానానికి చేరుకుంది. సీఎస్‌కే విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కీల‌క పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 42 ప‌రుగులతో అద‌ర‌గొట్టిన జ‌డ్డూ.. బౌలింగ్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఈ విజ‌యంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పటికి తమకు అద్బుతమైన విజయాన్ని అందించారని రుతురాజ్‌ కొనియాడాడు. "ధర్మశాల వికెట్‌ చాలా స్లోగా ఉంది. అంతే కాకుండా బంతి బాగా లో బౌన్స్ కూడా అయింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే మా స్కోర్‌ బోర్డులో 180-200 పరుగులు ఉంచాలనకున్నాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో మాకు 160 నుంచి 170 పరుగుల మధ్య స్కోర్‌ వస్తే చాలు అని భావించాము. మేము సరిగ్గా 167 పరుగులు సాధించాము. ఈ స్కోర్‌ను మేము డిఫెండ్‌ చేసుకుంటామన్న నమ్మకం మాకు ఉండేది. మా బౌలర్లు న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సిమర్‌జీత్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో తను తొలి మ్యాచ్‌ ఆడుతున్నప్పటికి తన అనుభవాన్ని చూపించాడు. అతడు గత సీజన్‌లో కూడా 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్‌ చేశాడు. ఇక వికెట్లు కోల్పోయినప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటర్‌గా దించాలనుకున్నాము. బ్యాటర్‌ అయితే 10-15 పరుగులు అదనంగా చేస్తాడని భావించాము. కానీ ఆఖరి నిమిషంలో మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. ఆ నిర్ణయమే మాకు విజయాన్ని అందించింది. సిమర్‌జీత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు మా జట్టులో కొంత మంది ఆటగాళ్లు ప్లూ జ్వరంతో బాధపడ్డారు. మ్యాచ్‌ ముందు వరకు ఎవరూ జట్టు సెలక్షన్‌కు ఉంటారో క్లారిటీ కూడా లేదు. అటువంటిది ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రుతు పేర్కొన్నాడు.

Sunil Narine, Ramandeep singh power Kolkata Knight Riders to 235-6 vs Lsg
న‌రైన్ విధ్వంసం.. ల‌క్నో ముందు భారీ టార్గెట్‌

ఐపీఎల్‌-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. 

Chennai Super Kings crush Punjab kings by 28 runs
జ‌డేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్‌కే

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 28 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే  ఘ‌న విజ‌యం సాధించింది. 168 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌.. చెన్నై బౌల‌ర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌య్యారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో రవీంద్ర జ‌డేజా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన‌ సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. బ్యాటింగ్‌లోనూ ర‌వీంద్ర జ‌డేజా స‌త్తాచాటాడు. 43 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(32), డార్లీ మిచెల్(30) ప‌రుగులు చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, రాహుల్ చాహ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

CSK suffer big blow as Matheesha Pathirana returns to Sri Lanka
IPL 2024: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్‌ బౌలర్‌

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరానా ప్రస్తుతం  తొడ కండ‌రాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ధ్రువీకరించింది.టీ20 వరల్డ్‌కప్‌ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్‌ స్వదేశానికి రప్పించింది.ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్‌కే త‌రుపున ప‌తిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకాన‌మీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ సైతం ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్‌కేకు నిజంగా బిగ్‌ షాక్‌ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.  

Punjab Kings bowled brilliantly, restricting CSK to 167 runs
రాణించిన జ‌డేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్‌-2024లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా 43 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(32), డార్లీ మిచెల్(30) ప‌రుగులు చేశాడు. మ‌రోవైపు పంజాబ్ బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, రాహుల్ చాహ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు.

Dube Gets Back-to-Back Golden Duck As Chahars Twin Strike
వరల్డ్‌కప్‌ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌

ఐపీఎల్‌-2024లో టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ శివమ్‌ దూబే వరుసగా రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ లీగ్‌ ఫస్ట్‌హాఫ్‌లో అదరగొట్టిన దూబే.. సెకెండ్‌ హాఫ్‌లో మాత్రం తన మార్క్‌ చూపించలేకపోతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దూబే గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే.. స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దూబే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం వరుసగా ఇది రెండో సారి. అంతకముందు కూడా చెపాక్‌ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దూబే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.  స్పిన్నర్లను అద్భుతంగా ఆడిగల్గే దూబే.. అదే స్నిన్నర్ల బౌలింగ్‌లో ఔట్‌ అవుతుండడం సీఎస్‌కే అభిమానులను కలవరపెడతోంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శర కనబరచడంతో దూబేకు టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ముందు దూబే వరుసగా విఫలం కావడడం జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. Wickets ki aayi bahar, jaise hi aaye Rahul Chahar 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvCSK #IPLinPunjabi pic.twitter.com/urm9eFIDOW— JioCinema (@JioCinema) May 5, 2024

IPL 2024: CSK Has Lost The Toss In 10 Matches Out Of First 11 Matches They Played This Season
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను టాస్‌ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏకంగా పదింట టాస్‌ ఓడాడు. పంజాబ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టాస్‌ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.టాస్‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్‌ ప్రాక్టీస్‌) తీసుకుంటున్నా రుతురాజ్‌ వరుసగా టాస్‌ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన రుతు ఓ ఆల్‌ టైమ్‌ చెత్త రికార్డును సమం చేశాడు.ఐపీఎల్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్‌ ఓడాడు. రాజస్థాన్‌, సీఎస్‌కే తర్వాత తొలి 11 మ్యాచ్‌ల అనంతరం అత్యధిక సార్లు టాస్‌ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ముంబై 2011 సీజన్‌లో తొమ్మిదింట టాస్‌ ఓడింది. 2013 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా తొలి 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట టాస్‌ ఓడింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే తొలి 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్‌ కాగా.. రుతురాజ్‌ (25), డారిల్‌ మిచెల్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే 

Advertisement
Advertisement

Sports

1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
Advertisement