-
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్ చీర మళ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రెండ్ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. చేపముల్లుతో పత్తిని శుద్ది చేయడమా..?పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకంఅక్కినేని, సినారే బ్రాండ్ అంబాసిడర్లుగా..తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. నూరు కౌంట్ అనడానికి రీజన్..ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.మోదీకి సైతం బహుకరించేందకు.. 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు. (చదవండి: ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!) -
తాత్త్వికథ: 'ద.. ద.. ద..' మెరుపులోంచి వచ్చిన మూడు రహస్య సంకేతాలు..
ప్రజాపతి దగ్గర సురలు, అసురులు, మానవులు తమ బ్రహ్మవిద్యాశిక్షణ పూర్తయిన తరువాత ప్రజాపతిని కలసి సందేశాత్మక ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ప్రజాపతిని కలసి గురుదేవా ‘‘మీ నుంచి మేం నేర్చుకున్నది మా జీవితాల్లో అలవరుచుకుంటూనే విధులు, బాధ్యతలు నిర్వహించదలచాము’’ అన్నారు. ప్రజాపతి ధర్మపథంలో నడవమని ఆదేశించారు. దేవతలు ముందుకొచ్చి, ‘‘మీ ఆదేశానుసారం మేము విధులను ధర్మపథంలో నిర్వహిస్తాం. మీ ఆశీస్సులతో పాటు మంచి సందేశమివ్వమని కోరారు.అప్పుడు ఒక మెరుపు ఆకాశంలో మెరుస్తూ ‘ద’ అనే శబ్ద సంకేతాన్నిచ్చింది. అప్పుడు ప్రజాపతి మీకు ఆ మెరుపు సంకేతం ఏమి అర్థమయిందని? దేవతలన్నారు మేము ‘ద’ ని దమ్యత అంటే స్వయంనిగ్రహంగా అర్థం చేసుకున్నాం. మా మనస్సాక్షి చెబుతున్నదేమంటే సుఖ, సౌఖ్య జీవనాన్ని అనుభవించేటపుడు లేదా ఆ వాంఛలు కలిగినపుడు స్వయంనిగ్రహం కావాలని. ప్రజాపతి సంతసించి బాగా అర్థం చేసుకున్నారు అన్నారు.తదుపరి ఇది చూసి మనుష్యులు కూడా ప్రజాపతిని దివ్య ఆశీస్సులతో కూడిన వీడ్కోలు సందేశాన్ని కోరారు. అప్పుడు మళ్ళీ ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో కనిపించింది. దాని సంకేతాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగ్గా మనుషులన్నారు ‘‘మేము ‘ద’ ని దత్త గా అర్ధం చేసుకున్నాము. దత్త అంటే ఇవ్వు లేదా దానంచెయ్యి అని అర్థం. మేము స్వార్థ పరులం. మేము మా గురించే ఆలోచిస్తుంటాం. ఇతరులను పట్టించుకోం. కనుక మాకు అదొక దివ్యసంకేతం. మేము మాకున్నది అభాగ్యులకు దానం చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.ప్రజాపతి సంతోషించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు అన్నారు. చివరగా అసురులు వచ్చారు. అప్పుడు ఆకాశంలో మెరుపు ‘ద’ ధ్వనితో మెరిసింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడగగా మేము ‘ద’ ని దయాగుణంగా అర్థం చేసుకున్నాము. అనగా దయాగుణం కలిగి ఉండడం. మాది క్రూరస్వభావం. మా మనసు చెబుతున్నదేమంటే, ఇతరుల ఎడ ఎక్కువ దయ, జాలి కలిగి ఉండాలని, తద్వారా ప్రశాంతంగా, సంతోషంగా వుండాలని. మనం గమనిస్తే మనిషిలో ఒక్కొక్కప్పుడు దైవత్వం, మరొకప్పుడు రాక్షసత్వం కనబడతాయి.మెరుపు నుంచివచ్చిన 3 రహస్యసంకేతాలూ ద ద ద మనిషికి చక్కగా అన్వయించబడతాయి. మనలో దేవత్వం కనిపించినపుడు స్వయం నిగ్రహం పాటించాలి. అది మనకు సమయాన్ని, శక్తిని, అస్థిత్వాన్నీ ఇస్తుంది. మనం మన శక్తిని, అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం యితరులతో పంచుకుంటుంటే, అది మనలో దయను కలిగించి ఇతరులలో ఎంతో మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: ‘నీవు నాతో ఏడు అడుగులు నడిచావు'! ఇకపైన..
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి యువతీ యువకు లకు ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని రామాయణం నిర్దేశించింది. వాటిలో వ్యక్తిత్వం ఒకటి. భార్య ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి... ఆమె నీతో కలిసి పుట్టలేదు. నీతో కలిసి పెరగలేదు. వేరొకరి ఇంట పుట్టింది. ఎవరికో కూతురు. ఆమెకూ ఆశలు ఉంటాయి. కోరికలున్నాయి, సంతోషం కావాలి, ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. ఆమె సంతోషం గా ఉండేటట్టు చూడవలసిన మొట్టమొదటి కర్తవ్యం మామగారిది. తరువాత భర్తది. రామాయణంలో మామగారి పేరు చెప్పగానే ఆయన ఆ΄్యాయతను తలచుకుని సీతమ్మ పరవశించిపోతుంది. ఇది మానవీయ సంబంధాలకు భారతదేశం చేసిన పట్టాభిషేకం.అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశిష్టమైన విషయాన్ని చెప్పారు. సప్తపది అయితే తప్ప వివాహ తంతు పూర్తి అయినట్టు కాదు.. అంటారు. ఏడడుగులు నడిచిన తరువాత వరుడు – వధువుతో ఒక మాట అంటాడు. ‘నీవు నాతో కలిసి ఏడు అడుగులు నడిచావు కాబట్టి ఇకపైన ‘నీవు నాకు మంచి స్నేహితురాలివికా. నా మనసు ఎరిగి ప్రవర్తించు’ అంటాడు. అంటే – జన్మతః అనుబంధం కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. ఇక జీవితానికి నిర్ణయాత్మక శక్తి ఆమెయే.స్నేహమంటే మనసు మనసుతో కలవాలి. ఒకరు మరొకరికి అర్థం కావాలి. వారి సంతోషం కోసం... ఇవతలివారి వైపునుంచి కొంత త్యాగం ఉంటుంది. అలాగే వీరి సంతోషం కోసం అవతలివారి వైపునుండి కొంత త్యాగం ఉంటుంది. ఇలా జరిగితేనే దాంపత్యం సంతోషంగా సాగుతుంది.అలా కాక నీకిది సంతోషం కాకపోయినా నాకిది ఇష్టం, నేనిది చేస్తాను.. అన్నప్పడు గృహస్థాశ్రమం అర్థం ఏమిటి? దాంపత్య లక్ష్యం నీరుకారిపోతుంది. అది కాదు... ఒకరి సంతోషానికి మరొకరు కారణం కాగలగాలి. సుమనస్క... అంటారు. అంటే నీవు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తా. అలా మనిద్దరం అరమరికలు లేకుండా సఖ్యంగా సంతోషంగా మంచి స్నేహితులుగా ఉందాం. నాకున్న బలహీనతలేమిటో, బలమేమిటో నీవు తెలుసుకోవాలి.అలాగే నీ బలాలు, బలహీనతలు నేను తెలుసుకోవాలి. వాటికి తగిన విధంగా మనం నడుచుకుంటూ, తప్పులు చేస్తే మన్నించుకుని సర్దుకుపోతూ ప్రేమగా ఉండాలి. అంతే తప్ప ఒకరి తప్పులు మరొకరు వెతకడమే ధ్యేయంగా సంసారం చేస్తూ, ఇద్దరి పరువును, కుటుంబ గౌరవాన్ని, వంశ ప్రతిష్ఠను బజారుకీడ్చవద్దు. ఒకరిపట్ల మరొకరు అవగాహనతో, ఆప్యాయతతో, ప్రేమతో సంతోషంగా బతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం.బయట ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా... ఇంటికొచ్చి ఒకరి ముఖం మరొకరం చూసుకోగానే ఉపశమనం పొందగలగాలి. సాహచర్యంలో పరస్పరం శాంతి పొందాలి. ఒకరం తప్పు చేస్తే మరొకరం ప్రేమ తో మందలించుకోగలగాలి. అరమరికలొద్దు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి వారం సంస్కరించుకుందాం.’’ అనుకోవాలి.అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత అవగాహనతో ప్రారంభం కావాలో, సుఖమయమైన సంసార జీవితానికి ప్రేమ ఎంత అవసరమో పెద్దలు తెలియపరుస్తారు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.ఆమె పేరు క్విన్గ్యూ వాంగ్. గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. తాను తొలిసారిగా 2018లో గూగుల్‌లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్లైన్ అసాస్మెంట్ (ఓఏ) రౌండ్లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్ స్క్రీన్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో సైట్ రిలయబిలిటీ ఇంజీనీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్లో మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్‌ను కూడా అందుకుంది వాంగ్. ఎట్టకేలకు వాంగ్ ఐదో ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి.(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!) -
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన స్కాట్లాండ్
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
కర్నూలు.. ఫ్యాన్ జోరు!
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement