-
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
ఇండియాలో ఫ్యాషన్ సీన్‌ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్లలో టాప్ ఆఫ్ ది ఆల్గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్‌కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్ల మేళవింపుతో పర్ఫెక్ట్గా ఉంటుంది.ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్‌కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్‌గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది."డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్‌లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక్స్ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ. -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్‌ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్‌కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్‌వేర్‌లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్‌గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్‌గా ఉండాలి అదే టైమ్‌లో స్టైలిష్‌గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్‌గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్‌గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్‌లెస్ టాప్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్‌కోట్‌ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్‌కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్‌గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్‌గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్‌కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌ను కూడా ఈ స్టైల్‌కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్‌కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
మన సర్పంచులు @ ఐరాస
మహిళాసాధికారతపై ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో ప్రసంగించడానికి భారతదేశం నుంచి ముగ్గురు సర్పంచులకు ఆహ్వానం అందింది. ఈ నెల 3న అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి నిర్వహిస్తున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి నుంచి సర్పంచ్ హేమకుమారి, త్రిపుర నుంచి సుప్రియాదాస్ దత్తా, రాజస్థాన్ నుండి నీరూ యాదవ్ పాల్గొంటున్నారు.‘భారతదేశంలో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారతదేశం నుంచి ముగ్గురు మహిళా ప్రతినిధులతో ఒక ΄్యానెల్ చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారు తమ విజయగాథలను పంచుకుంటారు. అలాగే లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి వారి పంచాయితీలలో చేసిన కృషిని కూడా పంచుకుంటారు. వీరిని మూడు రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.మూడు కీలకమైన స్తంభాలు: హేమకుమారిపశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీలో స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం కోసం కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది. సర్పంచ్‌గా హేమకుమారి 2021లో పదవిని చేపట్టినప్పటి నుంచి మూడు కీలకమైన స్తంభాలపై దృష్టి సారించి పరివర్తన కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. అవి.. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం. సరైన ΄ోషకాహారం, ప్రసవానికి సంబంధించిన అవగాహన పెంచడానికి క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు, విద్యాకార్యక్రమాలను చేపట్టింది. దీని ఫలితంగా ముప్పు అధికంగా గల గర్భధారణ కేసుల సంఖ్య, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాలపై హేమకుమారి తాను చేసిన ప్రయోజనకరమైన పనులను, వచ్చిన ఫలితాలను తెలియజేయనుంది.హాకీ సర్పంచ్: నీరూయాదవ్ రాజస్థాన్‌లోని బుహనా తహసీల్‌లోని లంబి అహిర్ గ్రామ సర్పంచ్ నీరూ యాదవ్ ‘నాయకత్వ అనుభవం’పై తన అభి్రపాయాలను వెల్లడించనున్నారు. నీరూ యాదవ్ 2020లో లంబి అహిర్ గ్రామపంచాయితీకి సర్పంచ్ అయ్యింది. బాలికలు, మహిళల సాధికారత కోసం నీరూ యాదవ్ ఎన్నోపనులు చేశారు. భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడానికి ఐక్యరాజ్యసమితి నీరూని పిలవడానికి కారణం ఇదే. పంచాయితీ పనులతో పాటు రాష్ట్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా తన పంచాయితీలోని బాలికల హాకీ జట్టును తన సొంత ఖర్చుతో సిద్ధం చేసింది. ఈ చొరవ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఆమెను హాకీ సర్పంచ్ అని పిలుస్తారు. గ్రామ పంచాయితీని ΄్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చొరవ తీసుకుంది. పాత బట్టల సంచులను తయారు చేయడం ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించింది. గ్రామ ప్రజలరె పర్యావరణం వైపుగా ్ర΄ోత్సహించేలా కొత్త ప్రచారాన్ని ్రపారంభించింది. ప్రతి నెలా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే పింఛన్ వెళ్లేందుకు శ్రీకారం చుట్టింది. పంచాయితీ స్థాయి సర్పంచ్ పాఠశాలను ్రపారంభించి, బాలికలకు కంప్యూటర్ విద్యతో పాటు డిజిటల్ అంగన్వాడీ, మోడ్రన్ ప్లే స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. చిన్న పల్లెటూరిలో ఉండి కూడా గొప్ప పని చేయగలమని నీరూ నిరూపించింది.చర్చావేదిక: సుప్రియా దాస్ దత్తా ఫార్మసీలో డిప్లమా చేసిన సుప్రియా దాస్ దత్తా త్రిపుర నివాసి. సెపాహిజాల జిల్లా పంచాయితీ అధ్యక్షురాలు. ప్రజాతీర్పులో మహిళల భాగస్వామ్యాన్ని చాటడానికి సుప్రియ బలమైన న్యాయవాదిగా ఎదుగుతున్నారు. సుప్రియ తన జిల్లాలో మహిళల కోసం చర్చా వేదికను ్రపారంభించారు. ఇక్కడ ప్రజలు జిల్లా పంచాయితీ అధికారులకు ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి సమస్యలపై తమ ఆందోళనలు, ఆలోచనలను తెలియజేయవచ్చు. సుప్రియ చేస్తున్న పనులను ప్రధాని మోదీనీ ఆకట్టుకున్నాయి. పిల్లల సంరక్షణ సౌకర్యాలను ్ర΄ోత్సహించడంలో కూడా చురుకుగా పాల్గొంటున్నది. లోతుగా పాతుకు΄ోయిన సామాజిక నిబంధనలను పరిష్కరించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించవచ్చని సుప్రియ గట్టిగా నమ్ముతోంది. సమాజంలో తాను ΄ోషించే పాత్ర ద్వారా మహిళలు పురుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాలనుకుంటోంది. -
Eka Lakhani: ఇటు ఫ్యాషన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్ తాను!
ఏకా లఖానీ.. డైరెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్ బాడీలాంగ్వేజ్‌ని కాదు.. పర్సనాలిటీని బట్టి స్టయిల్ని క్రియేట్ చేసే స్టయిలిస్ట్! అందుకే ఆమె ఇటు ఫ్యాషన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్!ఫ్యాషన్ డిజైనర్ కావాలని, సినిమాల్లో పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏకా లఖానీ. ఇంటర్లో సైన్స్ స్టూడెంట్. మంచి మార్కులతోనే ఇంటర్ పాస్ అయింది. తర్వాత ఏం చేయాలో తెలీలేదు. తనేం చేయగలదో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఆ తండ్రికి తెలుసు.. తన కూతురికి మంచి ఈస్తెటిక్ సెన్స్ ఉందని, ఆర్ట్‌లో కానీ.. ఫ్యాషన్ రంగంలో కానీ చక్కగా రాణించగలదని! అందుకే ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు.ఆ ప్రోత్సాహం ఏకాను తన టాలెంట్‌ని గ్రహించేలా చేసింది. ముంబైలోని ఎస్ఎన్డీటీ (Sreemati Nethabai Damodar Thackersey) విమెన్స్ (women's) యూనివర్సిటీలో చేరింది. అక్కడ డిగ్రీ పూర్తయ్యాక న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా చేసింది. ఆ టైమ్‌లోనే పిలుపు వచ్చింది ప్రముఖ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ మణిరత్నం సినిమాకు పని చేస్తున్నాడని.. అతను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాడు.. రమ్మని! వచ్చేసింది.. వర్క్ చేసి మణిరత్నంని ఇంప్రెస్ కూడా చేసింది.అది ‘రావణ్’ సినిమా. అక్కడి నుంచి మణిరత్నంతో అసోసియేట్ అవుతూ వస్తోంది మొన్నటి పొన్నియన్ సెల్వన్ వరకు! ‘రావణ్’ చేస్తున్నప్పుడే ఆమె పనితీరు నచ్చి, మెచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఆమెకు తను తీసిన ‘ఊర్మి’కి కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసే చాన్స్ ఇచ్చి ఏకాను మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.మరి బాలీవుడ్‌కి? ‘నేను చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ వర్క్‌తోనే బాలీవుడ్ నన్ను గుర్తించి అక్కడ చాన్సెస్ ఇచ్చింది. అందుకే మణిరత్నం సర్కి సదా కృతజ్ఞురాలిని’ అంటుంది ఏకా లఖానీ. బాలీవుడ్లో ఆమె.. రాజ్‌కుమార్ హిరానీ, కరణ్ జోహర్ లాంటి దర్శకులకు ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారింది. ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే ఈస్తెటిక్స్, ట్రెండ్స్ మాత్రమే కాదు.. కల్చర్, క్లయిమేట్ అండ్ పర్సనాలిటీల పరిశీలన, అవగాహన అండ్ విశ్లేషణ అని ఆమె అభిప్రాయం.అది ఆమె ఆచరణలోనూ కనిపిస్తుంటుంది తన వస్త్రధారణలో అయినా.. సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా.. సెలబ్రిటీలకు స్టయిల్ని సెట్ చేసినా! ఈ లక్షణమే ‘సంజు’ లాంటి బయోపిక్స్, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ డ్రామాస్, ‘షేర్షా’ లాంటి వార్ డ్రామాస్, ‘జుగ్ జుగ్ జియో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ‘క్వీన్’ లాంటి వెబ్‌సిరీస్‌కి పనిచేసి ఈరోజు ఆమెను వర్సటైల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నిలబెట్టింది. ఆ నైజమే రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలకు స్టయిలిస్ట్‌గా ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ‘ఈ డీటేయిలింగ్ నేర్పింది కూడా మణి సరే’ అంటూ మళ్లీ మణిరత్నంకే క్రెడిట్ ఇస్తుంది ఏకా!డ్రైవింగ్ ఫోర్స్..భిన్న భాషల్లో.. విభిన్నమైన పాత్రలను ఆకళింపు చేసుకుంటూ డిజైన్ చేసే ఆమె కాస్ట్యూమ్స్ యాక్టర్స్‌కి ప్రత్యేక గుర్తింపునే కాదు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడినీ సృష్టిస్తున్నాయి. ఆమెనో డ్రైవింగ్ ఫోర్స్‌గా మలస్తున్నాయి. ఏకా లఖానీ అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి. ట్రెండ్స్‌తో ఇన్ప్లుయెన్స్ కాక చేస్తున్న సినిమా స్పిరిట్‌ని గ్రహించి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ని తయారుచేయాలని మణి సర్ దగ్గర, ఫస్ట్ షాట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉండాలని రాజు (రాజ్‌కుమార్ హిరానీ) సర్ దగ్గర, కొత్తగా.. వావ్ అంటూ ఆడియెన్స్ అబ్బురపడే ఫ్యాషన్‌ని చూపించాలని కరణ్ దగ్గర నేర్చుకున్నాను. ఇలా నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్, నేను స్టయిల్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ దగ్గర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నా పనికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పాఠాలకన్నా వర్క్ ద్వారా నేర్చుకుంటున్నదే ఎక్కువ! – ఏకా లఖానీఇవి చదవండి: Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
మైనార్టీలకు అండగా సీఎం వైఎస్ జగన్
No Headline
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
శ్రమజీవుల కేంద్రం.. రాయదుర్గం
నాటు పడవ బోల్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement