జమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

Published Tue, May 14 2024 6:05 AM

పాతబస్టాండ్‌ సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనాలను నిలిపివేస్తున్న పోలీసులు

పోలింగ్‌ బూత్‌ వద్ద బూతులు తిట్టిన కూటమి అభ్యర్థి ఆదినారాయణరెడ్డి

మైలవరం ఎ.కంబాలదిన్నెలో వైఎస్సార్‌సీపీ నాయకుడి కారుపై దాడి

జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్‌: ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం 6 గంటలు దాటాక నవాజ్‌ కట్ట సమీ­పంలోని 116, 117 పోలింగ్‌ బూత్‌లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అధికారులు వారికి స్లిప్పు­లు ఇచ్చి పోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో బీ­జేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ వైఎ­స్సార్‌­సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇదే అదనుగా భావించిన ఆది, భూపేష్‌ వర్గీయులు రాళ్లతో దా­డులు  చేయించారు. 

ఈ దాడుల్లో ఎమ్మెల్యే సుధీర్‌­రెడ్డి తలపై గాయమైంది. దీంతో వైఎస్సా­ర్‌­సీపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కాపాడు­కు­నేందుకు ఎదురు దాడి చేశారు. సుధీర్‌రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని నాయకులు, కార్య­కర్తలు భారీగా  ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకు­న్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు హృషి కేశవరెడ్డి ఎమ్మెల్యేను పరామ­ర్శించటానికి వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద గూ­మిగూడి ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడులు చే­శారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంస­మయ్యాయి. 

మైలవరం మండలం చేరెడ్డి చెన్న­కేశవ­రెడ్డికి చెందిన కారును ఎ.కంబాలదిన్నె గ్రా­మా­­నికి చెందిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఆదినారాయణ­రెడ్డి వర్గీయులు దాడి చేయగా.. ఎమ్మెల్యేకు బలమైన గాయాల­య్యాయి. విషయం తెలుసు­కున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీ వద్ద గల 116, 117 బూత్‌ల వద్దకు బలగాలను మోహరించారు. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యే కార్యాల­యానికి భారీగా చేరుకు­న్నారు. ముద్దనూరు మండలం నుంచి మేనమామ అయిన మునిరాజారెడ్డి తన అనుచరులతో జమ్మలమడుగుకు చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు వస్తుండటంతో టీఎన్‌ఆర్‌ థియేటర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement