మరోసారి మోదీనే ప్రధాని | Sakshi
Sakshi News home page

మరోసారి మోదీనే ప్రధాని

Published Sun, May 5 2024 7:30 AM

మరోసారి మోదీనే ప్రధాని

● ఓటమి భయంతోనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం ● బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్‌సింగ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు తన పనితీరుతో భారతదేశ ప్రతిష్టతను ప్రపంచానికి చాటిన నరేంద్రమోదీ మరోసారి ప్రధానిగా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్‌సింగ్‌ రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పంచవటి హోటల్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మూడుసార్లు మద్దతు ధరలను పెంచినట్లు గుర్తు చేశారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 400 ఎంపీ సీట్లతో మరోసారి కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడబోతుందన్నారు. దీ న్ని ఓర్వలేకనే కాంగ్రెస్‌ పార్టీ ఓటమి భయంతో రా జ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా తమ వైపు ఉన్నారని, అబద్దాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు వారే తగిన బుద్ది చెబుతారన్నారు. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని కొత్త, పాత క్యాడర్‌ కలిసి తమ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్‌ చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో రాజస్తాన్‌ ఎమ్మెల్యే గోవర్దన్‌వర్మ, నాయకులు వి.ఆధినాత్‌, లాలామున్నా, గటిక క్రాంతి, మోహన్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement