కాల్‌ చేయండి.. కథలు వినండి | Sakshi
Sakshi News home page

కాల్‌ చేయండి.. కథలు వినండి

Published Sun, May 5 2024 7:30 AM

కాల్‌ చేయండి.. కథలు వినండి

● 040–45209722కు డయల్‌ చేస్తే చాలు.. ఆనందం కలిగించే కథలెన్నో ● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: వేసవి సెలవుల్లో విద్యార్థులు 040–45209722 నంబర్‌కు డయల్‌ చేసి ఆసక్తి, ఆనందం కలిగించే వివిధ కథలను హాయిగా వినవచ్చని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. రూమ్‌ టు రీడ్‌ కార్యక్రమంలో భాగంగా వినిపించే కథలతో కూడిన పోస్టర్‌ను శనివారం తన చాంబర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించడం ద్వారా వారిలో మౌఖిక భాష వికాస అభివృద్ధి , అభ్యసన సామర్థ్యాలను సాధించవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులలో అభ్యసన కొనసాగింపు కోసం రూమ్‌ టు రీడ్‌ ఇండియా ట్రస్ట్‌, జిల్లా విద్యాశాఖ సహకారంతో ఈ నంబర్‌ను రూపొందించిందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ కథలను వినిపించడం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ డయల్‌ నంబర్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఏఏంవో శ్రీకాంత్‌గౌడ్‌, సెక్టోరియల్‌ అధికారి జే. నారాయణ, సొహైల్‌, రూమ్‌ టు రీడ్‌ జిల్లా ఇన్‌చార్జి శ్రీకాంత్‌, సభ్యులు చంద్రశేఖర్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement