ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

Published Sun, May 5 2024 7:30 AM

ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

కై లాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ గౌస్‌ ఆలం పరిశీలించారు. ఓటింగ్‌ సరళిపై వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఈసీ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులంతా ఈ నెల 8 వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు జీఎస్‌ ఎస్టేట్‌లోని ఓ నివాసానికి వెళ్లి హోంఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో వినోద్‌ కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌

బోథ్‌: పోస్టల్‌ బ్యాలెట్‌, హోంఓటింగ్‌ ప్రక్రి య కొనసాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఓ టింగ్‌ ఈ నెల 8వ తేదీతో ముగుస్తుంది. శని వా రం బోథ్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 166 మంది ఉద్యోగులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోంఓటింగ్‌ ద్వారా 110 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశారు.

Advertisement
 
Advertisement