ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో రియాన్ష్‌కు చోటు | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో రియాన్ష్‌కు చోటు

Published Sun, May 5 2024 7:15 AM

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో రియాన్ష్‌కు చోటు

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

సంపాదించిన విద్యార్థి రియాన్ష్‌

పాయకరావుపేట : శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌లో యుకేజీ విద్యార్థి బి.రియాన్ష్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించాడు. ఐదేళ్ల రియాన్ష్‌ ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఎంపిక ప్రక్రియలో కేవలం 9 సెకన్లలో దక్షిణ ఆమెరికా ఖండంలో 13 దేశ జెండాలను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. అంతేకాకుండా ఈ విద్యార్థి ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడంతో పాటు ప్రపంచ దేశ రాజధానులను, భారతదేశ రాష్ట్రాల రాజధానులను గుర్తించడంలో కూడా ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆ విద్యార్థి ప్రతిభకు విద్యాసంస్థల అధినేత సిహెచ్‌.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌ అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement