హోమ్‌ ఓటింగ్‌కు చక్కటి స్పందన | Sakshi
Sakshi News home page

హోమ్‌ ఓటింగ్‌కు చక్కటి స్పందన

Published Sun, May 5 2024 7:15 AM

-

రెండు రోజుల్లో సద్వినియోగం చేసుకున్న వారి సంఖ్య 641

తుమ్మపాల : జిల్లాలో రెండవ రోజు హోమ్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కశింకోట మండలం తాళ్లపాలెం, బయ్యవరం గ్రామాల్లో జరుగుతున్న హోమ్‌ ఓటింగ్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పరిశీలించారు. 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో శనివారం 375 మంది హోమ్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీంతో మొదటి రెండు రోజుల్లో 641 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అయింది. నియోజకవర్గాల వారీగా రెండవ రోజు పోలైన ఓట్ల పోలింగ్‌ సరళి ఇలా.. చోడవరం –40, మాడుగుల–48, అనకాపల్లి – 91, యలమంచిలి – 36, పాయకరావుపేట – 131, నర్సీపట్నం – 29 మంది. కాగా వీరిలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు– 144 కాగా.. దివ్యాంగులు – 231 హోమ్‌ ఓటింగ్‌ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement