ఎపిక్‌, 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగం | Sakshi
Sakshi News home page

ఎపిక్‌, 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగం

Published Sun, May 5 2024 7:15 AM

-

తుమ్మపాల: ఎపిక్‌, 11 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదానితో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి తెలిపారు. ఓటరు కార్డు లేని వారు ఓటు హక్కు వినియోగానికి ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, బ్యాంకులు, తపాలాశాఖ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌ పుస్తకాలు, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ స్మార్ట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డ్‌, పాస్ట్‌పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపుకార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులతో స్వేచ్ఛగా ఓటు వేయవచ్చన్నారు.

Advertisement
 
Advertisement