తాడిపత్రిపై భానుడి ప్రతాపం | Sakshi
Sakshi News home page

తాడిపత్రిపై భానుడి ప్రతాపం

Published Sun, May 5 2024 8:05 AM

-

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా అంతటా శనివారం భానుడు మండిపోయాడు. తాడిపత్రిపై అయితే, మరింతగా విరుచుకుపడ్డాడు. పట్టణంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘అనంత’ అగ్నిగుండంలా కాగుతోంది. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కారణంగా జిల్లా వాసులు అట్టుడికిపోతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు తూర్పు, ఉత్తర మండలాల్లో వేసవితాపం తీవ్రస్థాయికి చేరుకుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఉమ్మడి జిల్లా అంతటా 26 నుంచి 33 డిగ్రీల వరకు నమోదవుతుండడం గమనార్హం. గాలిలో తేమశాతం మధ్యాహ్న సమయంలో 18 నుంచి 25 శాతం రికార్డు కాగా, వడగాల్పులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో జనానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, డాక్టర్‌ జి.నారాయణస్వామి తెలిపారు.

Advertisement
Advertisement