వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

Published Sun, May 5 2024 6:50 AM

వైఎస్

రాజంపేట : కాపు(బలిజ)ల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో కృషిచేశారని రాజంపేట మున్సిపాలిటీ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి అన్నారు. శనివారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్‌లో కాపు సామాజికవర్గం సంబటూరు శ్రీనివాసులు, మట్లి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 50 మంది యువకులు, మహిళలు వైఎస్సార్‌సీపీకి మద్దతు నిచ్చారు. వీరికి చైర్మన్‌ పోలా కండువాలను కప్పి, పార్టీలో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ గతంలో బలిజల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేశారన్నారు. కాపు కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి తద్వారా ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. టీడీపీ, జనసేన మాటలకు బలిజలు మోసపోరన్నారు. రాజంపేట మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ మర్రి రవి, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనరు కృష్ణరావు యాదవ్‌, కౌన్సిలర్స్‌ తంబా సుబ్రమణ్యం, విష్ణువర్ధన్‌, చలపతిగౌడ్‌, గోవిందుబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదవర్గాలు అధికంగా నివసించే రాంనగల్‌లో పోలా చేపట్టిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది.

వైఎస్సార్‌సీపీలోకి

జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు

రాజంపేట రూరల్‌ / సుండుపల్లె(రాజంపేట) : టీడీపీ సీనియర్‌ నాయకుడు, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు బత్తల శ్రీరాములు తన అనుచరులు, వడ్డెరలతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అంతకుముందు వారు బత్తల శ్రీరాములుకు ఏపీఐఐసీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగలన్నదే తమ ఆశయమన్నారు. రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలంటే జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

ఓబులవారిపల్లె: మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో వైఎస్సార్‌ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మండల కేంద్రంలోని కటికంవారిపల్లె గ్రామానికి చేందిన పది కుటుంబాలు మాజీ సర్పంచ్‌ సుబ్రమణ్యం రెడ్డి అధ్వర్యంలో కాపు నాయకులు అరిగెల సుబ్బారాయుడు, అవులూరు ఈశ్వరయ్య, గబ్బి వెంకటేష్‌, అంకన ఈశ్వరయ్య, అరిగేల సుబ్రమణ్యం, కటికం వెంకటసుబ్బయ్య పది కుటుంబలవారిని ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్‌ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్నఓరంపాడు మాజీ సర్పంచ్‌ ముక్కా రమేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కోమ్మిన పెంచలయ్య నాయుడు, పిడికెడు వెంకటసుబ్బయ్య నాయుడు, మన్యం విశ్వనాధ్‌నాయుడు చేరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ డైరెక్టర్‌ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, సర్పంచ్‌ ఎన్‌పీ జయపాల్‌రెడ్డి ,సీనియర్‌ నాయకులు సింతు సుదర్శన్‌రెడ్డి, పున్నటి కృష్ణరెడ్డి, చౌడవరం గంగిరెడ్డి, యువనాయకు ఓడి అమర్‌నాధ్‌రెడ్డి, గంగన్నగారి పవన్‌,ఓజీ అనిల్‌ కూమార్‌రెడ్డి, గోపి,నిఖిల్‌,మందరం చంద్రరెడ్డి, ఓజీ జయప్రకాష్‌రెడ్డి, పున్నటి సుబ్రమణ్యంరెడ్డి,ఎసీ మండల కన్వీనర్‌ బీర్‌ ప్రెమ్‌ తదితరులు పాల్గొన్నారు.

శివునిపల్లెలో 25 కుటుంబాలు చేరిక

సిద్దవటం : మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ పరిదిలోని శివునిపల్లె గ్రామంలో శనివారం రాత్రి రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మేడా మధుసూదన్‌రెడ్డి, రాజంపేట ఎమ్మె ల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తనయుడు ఆకేపాటి సాయి భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో శివునిపల్లె గ్రామానికి చెందిన 25 కుటుంబాలు టీడీపీ నుంచి వైస్‌ఆర్‌సీపీలో చేరాయి. ఈ మేరకు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన వారిలో దాసరి పెద్ద అనుపుల్లయ్య, దారిపాల అనుపుల్లయ్య, దాసరి చిన్నయ్య, నడిపి అనుపుల్లయ్య, చిట్టిబోయిన వెంకటసుబ్బయ్య, గోపినేని రెడ్డెయ్య, చువ్వుల తిరుపాల్‌ వీరితోపాటుగా వీరి అనుచరులు 25 యాదవ వర్గానికి చెందిన కుటుంబాలు చేరాయి. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామిరెడ్డి, బీసీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. సుబ్బయ్య, మచ్చా సుబ్బరాయుడు, దాసరి అనుపుల్లయ్య, యూత్‌ కన్వీనర్‌ వావిళ్ల శ్రీనివాసులరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకట్‌, కాడె వెంకటరమణ, ఏకుల రామిరెడ్డి, రావుల సుబ్బారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, రాజారెడ్డి, చిన్న మల్లారెడ్డి, ప్రదీప్‌సాగర్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు
1/4

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు
2/4

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు
3/4

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు
4/4

వైఎస్సార్‌సీపీలోకి చేరికల జోరు

Advertisement
 
Advertisement