Daily Horoscope: ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది

Published Sun, May 5 2024 6:45 AM

Daily Horoscope: Rasi Phalalu On 05-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ద్వాదశి ప.3.35 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.14 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.5.27 నుండి 6.57 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.24 వరకు, అమృతఘడియలు: ఉ.10.48 నుండి 11.45 వరకు. 

మేషం: రాబడి అంతగా అనుకూలించదు. బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాల్లో చికాకులు.

వృషభం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: రాబడి సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సçహాయపడతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కర్కాటకం: రాబడి అంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ఆటుపోట్లు. ఉద్యోగాలు భారంగా సాగుతాయి.

సింహం: కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు.

కన్య: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి.

వృశ్చికం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఆస్తి వివాదాలు. రాబడి కన్నా ఖర్చులు అధికం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అనుకోని పనిభారం.

ధనుస్సు: అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. వ్యాపారాలలో నిరాశ.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. కార్యజయం.   వ్యాపారాలలో లాభాలు  అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.

కుంభం: ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆధ్యాత్మిక  చింతన. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement