నవరత్నాలు నిజం..సూపర్‌ సిక్స్‌ అబద్ధం | Sakshi
Sakshi News home page

నవరత్నాలు నిజం..సూపర్‌ సిక్స్‌ అబద్ధం

Published Mon, May 6 2024 8:30 AM

నవరత్నాలు నిజం..సూపర్‌ సిక్స్‌ అబద్ధం

చీరాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌

చీరాల టౌన్‌: వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో నిజమని.. సూపర్‌సిక్స్‌ మేనిఫెస్టో పచ్చి అబద్ధమని చీరాల అసెంబ్లీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కరణ వెంకటేష్‌ అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపాలిటీ 20వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శిఖాకొల్లి రామసుబ్బులు ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కృషి చేసిన ఏకై క సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో.. స్థానిక సంస్థల్లో మహిళలకే పెద్దపీట వేశారని చెప్పారు. ప్రతి పథకం మహిళల పేరు మీదే అందించిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. అలాంటి నవరత్నాలు కొనసాగింపుగా ప్రస్తుత మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. కానీ, కూటమి కిచిడి పార్టీలు మేనిఫెస్టోను కాపీ కొట్టి.. అలివికాని హామీలు ప్రకటించినట్లు చెప్పారు. అవి సూపర్‌ సిక్స్‌ పథకాలు కావు.. పచ్చి మోసం చేసే పథకాలు అని కరణం వెంకటేష్‌ ఎద్దేవా చేశారు. చీరాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాదేనన్నారు. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ను ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కల్లగుంట అంజమ్మ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, రాష్ట్ర సేవ దళ్‌ సెక్రటరీ గోలి గంగాధర్‌, సలగల అమృతరావు, షేక్‌ మస్తాన్‌, అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, చిన్ని లీలధర్‌, పేరకం లక్ష్మీనారాయణ, అర్వపల్లి లీల, మద్దలా మురళి, పాల్గొన్నారు.

Advertisement
Advertisement