Baba Ramdev Seen Driving Land Rover Defender 130; Video Goes Viral - Sakshi
Sakshi News home page

యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్‌: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Published Tue, Jul 25 2023 3:00 PM

Ramdev Seen Driving Land Rover Defender 130 Video Goes Viral - Sakshi

Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్‌ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ  రామ్‌దేవ్  దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల  కలెక్షన్స్‌, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. 

లగ్జరీ కార్ల కలెక్షన్‌
యోగా గురు రామ్‌దేవ్   కార్ల కలెక్షన్‌  కూడా  ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి  ల్యాండ్‌  రోవర్‌ కి ప్రమోట్‌ అయ్యారంటూ విమర్శలు  చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్‌ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్‌ షురూ!)

వీడియోలో కనిపిస్తున్న ఎస్‌యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్‌  కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో  ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్‌ బిగ్గెస్ట్‌ కారు.  కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్‌ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110  వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే  వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం,  బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది.

మూడు వరుస సీట్లు,  ఇంటిగ్రేటెడ్‌ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్‌లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు,  360-డిగ్రీ కెమెరా  లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్‌  కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్‌, వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement