పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌

Published Mon, May 6 2024 8:35 AM

పకడ్బ

పూతలపట్టు : పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ ఆదేశించారు.ఆదివారం పూతలపట్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్‌ బూత్‌లలో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించే పద్ధతిని పరిశీలించారు.ప్రశాంత వాతావరణంలో పోస్టల్‌ ఎన్నికలను నిర్వహించాలని, ఓటర్లకు పక్కాగా మౌలిక వసతులు ఆర్‌డీఓ చిన్నయ్యకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బందోబస్తు కల్పించాలని స్పష్టం చేశారు.

టీడీపీ ప్రచారంలో 104 నర్సు

పుంగనూరు : టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం సోమల మండలం కందూరులో ఎన్నికల పచ్రారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో ఆశ అనే 104 నర్సు పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి టీడీపీ అభ్యర్థికి హారతులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన నర్సుపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

దళిత ద్రోహి మందకృష్ణ

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): మందకృష్ణ మాదిగ దళిత ద్రోహి అని ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు నాయకులు వరదరాజులు, అశోక్‌రాజ్‌ విమర్శించారు. ఆదివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ ఇక్కడ టీడీపీకి మద్దతు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం మాదిగలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మాల..మాదిగల మధ్య చిచ్చుపెట్టిన టీడీపీకి మద్దతు ప్రకటించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అగ్రవర్ణాలకు మంత్రి పదవులు కట్టబెట్టి, దళితులను దూరం పెట్టారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే దళితులకు మేలు జరిగిందన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం వంటి పదవులు దక్కాయని వివరించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీకే మద్దతు ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో రమేష్‌, జయ శేఖర్‌, నవీన్‌, చిన్న రాయుడు, ధనుంజయలు పాల్గొన్నారు.

ఎంపీ అభ్యర్థికి కోపమొచ్చింది!

చిత్తూరు రూరల్‌(కాణిపాకం):మీడియా ప్రశ్నలకు టీడీపీ ఎంపీ అభ్యర్థికి కోపమొచ్చింది. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు అలిగి వెళ్లిపోయారు. ఆదివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌కు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. తొలుత ఆయన చిత్తూరు ఏం చేయాలనుకుంటున్నారో వివరించారు. ఆ తర్వాత పలు అంశాలపై పాత్రికేయులు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానం చెప్పలేక గుటకలు మింగారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తారేంటి అంటూ చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.

పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌
1/2

పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌

పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌
2/2

పకడ్బందీగా ‘పోస్టల్‌’ పోలింగ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement