ఓటెత్తిన ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన ఉద్యోగులు

Published Mon, May 6 2024 8:35 AM

ఓటెత్తిన ఉద్యోగులు

జిల్లాలో 74.34 శాతం పోలింగ్‌

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఆదివారం తమ పోస్టల్‌ బ్యాలెట్‌లను వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఉద్యోగులు ఓటు వేశారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగింది. పోలింగ్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌, ట్రైనీ కలెక్టర్‌ హిమవంశీ, డీఆర్‌ఓ పుల్లయ్య పర్యవేక్షించారు. ఈ నెల 8వ తేదీ వరకు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశముంది.

జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు అసెంబ్లీ, పార్లమెంట్‌కు 74.34 శాతం పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌ అయ్యింది. అత్యధికంగా నగరి నియోజకవర్గంలో 83.04 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే పుంగనూరులో 76.39 శాతం, జీడీ నెల్లూరులో 79.53 శాతం, చిత్తూరులో 65.09 శాతం, పూతలపట్టులో 75.46 శాతం, పలమనేరులో 71.32 శాతం, కుప్పంలో 73.29 శాతం పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

Advertisement
 
Advertisement