పూలవనం..గోదారి సోయగం.. | Sakshi
Sakshi News home page

పూలవనం..గోదారి సోయగం..

Published Mon, May 6 2024 10:55 AM

పూలవన

నియోజకవర్గంలో 2019–23 మధ్య

వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి

పథకం లబ్దిదారులు నిధులు

(రూ.కోట్లలో)

జగనన్న అమ్మ ఒడి 40,753 87.67

జగనన్న విద్యా దీవెన 15,939 52.43

జగనన్న వసతి దీవెన 12,069 19.75

వైఎస్సార్‌ ఆసరా 28,558 68.66

జగనన్న చేదోడు 3,469 4.71

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 34,977 18.48

వైఎస్సార్‌ కాపు నేస్తం 8,955 15.7

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం 1448 4.05

వైఎస్సార్‌ చేయూత 26,045 68.67

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక 32,364 249.32

వైఎస్సార్‌ సున్నా వడ్డీ 26,177 10.02

వైఎస్సార్‌ వాహనమిత్ర 2,824 7.65

వైఎస్సార్‌ రైతు భరోసా 27,321 51.44

వైఎస్సార్‌ బీమా 1230 3.35

నాన్‌ డీబీటీ

కార్యక్రమం పనులు/ నిధులు

భవనాలు (రూ.కోట్లలో)

నాడు–నేడు 86 38.12

రైతుభరోసా కేంద్రాలు 42 10.05

సచివాలయాలు 61 26.592

విలేజ్‌ క్లినిక్స్‌ 54 11.234

సీసీరోడ్లు, డ్రైన్లు (గ్రామాల్లో) 593 18.55

వాటర్‌ ట్యాంకులు 23 5.27

ఇళ్ల స్థలాలు 5,467

జగనన్న ఇళ్లు 5,511 42.82

అంగన్‌వాడీ భవనాలు 5 0.60

జల్‌జీవన్‌ మిషన్‌ 76 41.23

గడప గడపకూ మన ప్రభుత్వం 273 11.95

కాటన్‌ బ్యారేజీతో సస్యశ్యామలం

మనసును దోచే నర్సరీలు

రాజమహేంద్రవరం రూరల్‌: దాదాపు మూడున్నర లక్షల జనాభా, రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లు, అనేక ప్రత్యేకతలతో రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం. దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన కడియం నర్సరీలు, డెల్టాకు గోదారమ్మ పరవళ్లను నియంత్రించే ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ, రాజమండ్రి సిటీ, రూరల్‌ నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్‌ ఈ నియోజకవర్గ గుర్తింపును శాశ్వతం చేస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఇస్కాన్‌, స్వామి అయ్యప్ప, సరస్వతీ, మహాకాళేశ్వర ఆలయాలు కూడా మంచి గుర్తింపు పొందాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి స్వగ్రామం దుళ్ల కూడా ఈ నియోజకవర్గంలోని కడియం మండలం పరిధిలోనే ఉంది.

నియోజకవర్గ స్వరూపం

గతంలో కడియం నియోజకవర్గంగా పిలిచేటప్పుడు దీనిలో కడియం, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ శివార్లలోని పలు వార్డులు ఉండేవి. అనంతరం రాజానగరం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడటంతో రాజమహేంద్రవరం రూరల్‌, కడియం మండలాలతో పాటు, సిటీలోని 9 వార్డు లు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని పది గ్రామాలను గ్రేటర్‌ రాజమహేంద్రవరం పరిధిలో చేర్చారు.

విరివనాల సిరులు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలగలుపుగా ఉండే ఈ నియోజకవర్గంలోని కడియం ప్రాంత పూల వనాలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. 25 వేల ఎకరాలకు పైగా విస్తరించిన ఇక్కడి నర్సరీల్లో దేశ, విదేశాలకు చెందిన వెయ్యికి పైగా పువ్వులు, పండ్లు, అలంకరణ మొక్కలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రెండు వేల మందికి పైగా గుర్తింపు పొందిన నర్సరీ రైతులున్నారు. ఈ నర్సరీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ పని చేయడానికి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తూంటారు. అలాగే కడియం, రాజమహేంద్రవరం రూరల్‌, కొత్తపేట, ఆలమూరు తదితర మండలాలకు చెందిన కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నుంచి దేశం నలుమూలలకే కాకుండా, అరబ్‌ దేశాలకు కూడా మొక్కలను ఎగుమతి చేస్తూంటారు. రెండు రూపాయల నుంచి రూ.20 లక్షలు పైగా విలువ చేసే మొక్కలు ఇక్కడ లభిస్తాయి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నర్సరీలు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్ట నిర్మించడంతో మరింతగా విస్తృతమయ్యాయని స్థానిక రైతులు చెబుతారు. ఈ ఆనకట్ట ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్నపూర్ణగా మార్చింది.

ఇవీ ప్రత్యేకతలు

● గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని లక్షల ఎకరాలకు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

● గోదావరి తీరాన ఇస్కాన్‌, అయ్యప్పస్వామి, విశ్వేశ్వరస్వామి, సరస్వతి, మహాకాళేశ్వర ఆలయాలు, ధవళేశ్వరం జనార్దనస్వామి ఆలయం ప్రముఖమైనవి.

● పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డైట్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు అందుబాటులో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు చదువుకునేందుకు ఇక్కడకు వస్తారు.

● పునర్విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఆవిర్భవించిన నూతన తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ ఈ నియోజకవర్గ పరిధిలోని బొమ్మూరులో ఏర్పాటు చేశారు.

ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ

కడియం నర్సరీలు

ఇప్పటి వరకూ ఎన్నికై న ఎమ్మెల్యేలు

1972 బత్తిన సుబ్బారావు (కాంగ్రెస్‌)

1978 పాటంశెట్టి అమ్మిరాజు (జనతా పార్టీ)

1983 గిరజాల వెంకటస్వామి నాయుడు (స్వతంత్ర)

1985 వడ్డి వీరభద్రరావు (టీడీపీ)

1989 జక్కంపూడి రామ్మోహనరావు (స్వతంత్ర)

1994 వడ్డి వీరభద్రరావు (టీడీపీ)

1999 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్‌)

2004 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్‌)

రూరల్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత

2009 చందన రమేష్‌ (టీడీపీ)

2014 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)

2019 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు : 2,72,826

పురుషులు : 1,33,241

సీ్త్రలు : 1,39,561

ఇతరులు : 24

పూలవనం..గోదారి సోయగం..
1/3

పూలవనం..గోదారి సోయగం..

పూలవనం..గోదారి సోయగం..
2/3

పూలవనం..గోదారి సోయగం..

పూలవనం..గోదారి సోయగం..
3/3

పూలవనం..గోదారి సోయగం..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement