పోస్టల్‌ బ్యాలెట్‌.. రైట్‌రైట్‌ | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌.. రైట్‌రైట్‌

Published Mon, May 6 2024 10:55 AM

పోస్ట

నేటి నుంచి ఓటింగ్‌ ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు

ప్రతి ఉద్యోగీ వినియోగించుకునేలా

అవకాశం

జిల్లా వ్యాప్తంగా 11,988

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరంలో అత్యంత కీలకమైన పోలింగ్‌ ఘట్టానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 40 శాతం మించి వైకల్యంతో బాధ పడుతున్న దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దనే ఓటు వేసే సరికొత్త విధానానికి ఎన్నికల సంఘం ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే మొదలైంది. హోం ఓటింగ్‌లో ఇంకా మిగిలిన వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఉద్దేశించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు కూడా సోమవారం శ్రీకారం చుడుతున్నారు. దీనిని ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం అందించారు. రాజకీయ పార్టీల నేతలు వారి తరఫున ఏజెంట్లను నియమించుకుని, సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి వివరాలు తెలపాల్సి ఉంటుంది.

ఎవరెవరికి ఎప్పుడంటే..

● జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ప్రభుత్వ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోనున్నారు.

● జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 11,988 ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలనే విషయమై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

● పీఓ, ఏపీఓలకు ఆయా నియోజకవర్గాల పరిధిలో సోమవారం శిక్షణ అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ వి నియోగించుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

● పోలీసులకు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తారు.

● మైక్రో అబ్జర్వర్లకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మంగళవారం ఉదయం 9 గంటలకు శిక్షణ ఇస్తారు. అనంతరం ఆర్ట్స్‌ కళాశాలలోని పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తారు.

● అత్యవసర సేవలు నిర్వహించే ఉద్యోగులకు పిడింగొయ్యి ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ న్యూ క్యాంపస్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ ఏర్పాటు చేశారు. వీరు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు.

● ఇతర పోలింగ్‌ సిబ్బందికి వారికి కేటాయించిన నియోజకవర్గాల పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో బుధవారం శిక్షణ ఇస్తారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు.

నియోజకవర్గాల వారీగా పోస్టల్‌

బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లు

● అనపర్తి: పీఓ/ఏపీఓలకు శ్రీ రామారెడ్డి జెడ్పీపీ హైస్కూల్‌, అనపర్తి, ఇతర పోలింగ్‌ సిబ్బందికి జీబీఆర్‌ కాలేజీ.

● రాజానగరం: బీవీసీ ఇంజినీరింగ్‌ కాలేజీ, పాలచర్ల.

● రాజమండ్రి సిటీ: బుద్ధ భవన్‌, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల.

● రాజమండ్రి రూరల్‌: ది ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌, కవలగొయ్యి, పిడింగొయ్యి.

● కొవ్వూరు: శ్రీ సుందర శ్రీ కల్యాణ మండపం.

● నిడదవోలు: వికాస్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల, సమిశ్రగూడెం.

● గోపాలపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల.

ఓటు హక్కు వినియోగంపై

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఎన్నికల విధులకు ఉత్తర్వులు వచ్చిన వారు వారికి కేటాయించిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో సోమ, మంగళ, బుధవారాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఎలాంటి డ్యూటీ ఆర్డర్లూ పొందని ఉద్యోగులు ఈ నెల 13వ తేదీన నేరుగా సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓ, ప్రభుత్వ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోనున్నారు.

– కె.మాధవీలత, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, రాజమహేంద్రవరం

నియోజకవర్గాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

నియోజకవర్గం పీఓ, ఏపీఓ ఓపీ ప్రభుత్వ మైక్రో

ఓట్లు ఉద్యోగులు అబ్జర్వర్లు

అనపర్తి 314 446 131 6

రాజానగరం 667 512 263 15

రాజమండ్రి సిటీ 694 556 31 97

రాజమండ్రి రూరల్‌ 657 481 166 1

కొవ్వూరు 399 482 239 7

నిడదవోలు 424 461 132 10

గోపాలపురం 372 377 129 11

జిల్లా స్థాయి అధికారులు 1,550 195

ఎసెన్షియల్‌ ఉద్యోగులు 342

పోలీసులు 1821

పోస్టల్‌ బ్యాలెట్‌.. రైట్‌రైట్‌
1/1

పోస్టల్‌ బ్యాలెట్‌.. రైట్‌రైట్‌

Advertisement
 
Advertisement