ప్రశాంతంగా నీట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

Published Mon, May 6 2024 1:30 AM

ప్రశా

దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 8లో u
ఏలూరు జిల్లాలో అభివృద్ధి జోరు కనిపిస్తోంది.. వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు తీస్తోంది. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టడం.. గిరిపుత్రులకు అత్యాధునిక వైద్యసేవలందించడం.. ఏళ్ల నాటి కల ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల సాకారం కావడం.. తమ్మిలేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించడం.. జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి .. లక్షల్లో పేదల ఇళ్ల నిర్మాణం.. అడవిబిడ్డలకు వేలాది ఎకరాల భూపంపిణీ వంటివి విజయవంతంగా సాగాయి. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. – సాక్షి ప్రతినిధి, ఏలూరు

ఏలూరులో

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

1980 నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ కళాశాల కావాలనేది బలమైన డిమాండ్‌. 2019లో సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏలూరు, పాలకొల్లులో ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆ సమయంలో డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రిగా ఉండటంతో ఏలూరులో వైద్య కళాశాల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. మరోవైపు రూ.60 కోట్లతో అధునాతన భవనం నిర్మించి 2022–23 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లతో కళాశాలను ప్రారంభించారు. మొత్తంగా రూ.525 కోట్ల ప్రాజెక్టులో భాగంగా వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు.

పోలవరం ప్రాజెక్టు

ఇంటింటా

సంక్షేమ కాంతులు

జిల్లాలో 2,81,470 మందికి సామాజిక పింఛన్ల రూపంలో రూ.3,880.09 కోట్ల లబ్ధి చేకూర్చారు.

వైఎస్సార్‌ బీమా కింద 4,554 మందికి రూ.57.32 కోట్లు అందజేశారు.

ఏటా 1,73,699 మంది విద్యార్థులకు రూ.130.15 కోట్ల చొప్పున జగనన్న విద్యాకానుకకు వెచ్చించారు.

1,78,214 మంది విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్ల లబ్ధి చేకూర్చారు.

1,82,043 మంది చిన్నారులకు జగనన్న గోరుముద్ద ద్వారా రూ.223.43 కోట్లు ఖర్చు చేశారు.

జగనన్న విద్యాదీవెన ద్వారా 38,675 మంది విద్యార్ధులకు రూ.383.40 కోట్లు అందజేశారు.

జగనన్న వసతి దీవెన ద్వారా 37,750 మంది రూ.142.96 కోట్లు జమ చేశారు.

జగనన్న చేదోడు ద్వారా 17,935 మందికి రూ.71.74 కోట్లు అందజేశారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.410.18 కోట్ల విలువైన వైద్యసేవలను 1,95,651 మందికి అందించారు.

వైద్య కళాశాల ఓ చరిత్ర

ప్రశాంతంగా నీట్‌
1/6

ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌
2/6

ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌
3/6

ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌
4/6

ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌
5/6

ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌
6/6

ప్రశాంతంగా నీట్‌

Advertisement
Advertisement