11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం | Sakshi
Sakshi News home page

11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

Published Mon, May 6 2024 1:30 AM

11,87

ఏలూరు(మెట్రో): జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఆదివారం సాయంత్రం నాటికి జిల్లాలో 11,874 మంది పోస్టల్‌ బ్యాలె ట్‌ను వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వా రీగా ఉంగుటూరులో 1,402 మంది, కై కలూరులో 1,305 మంది, నూజివీడులో 1,452 మంది, చింతలపూడిలో 1,662 మంది, పోలవరంలో 2,308, ఏలూరులో 1,827 మంది, దెందులూరులో 1,918 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు.

ఓటు వేయడం బాధ్యత : ఓటు వేయడం బాధ్యత అని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని జా యింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి సూచించారు. ఏ లూరు సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాలలోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఆదివారం ఆమె పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.

ఓటింగ్‌ శాతం పెంచేలా.. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా స్వీప్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్వీప్‌ నోడల్‌ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ అన్నారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఆయన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లాలో 83.75 శాతం ఓటింగ్‌ నమోదు కాగా ఏలూరు నియోజకవర్గంలో అత్యల్పంగా 68.10 శాతంగా నమోదయ్యిందన్నా రు. ఈ ఎన్నికల్లో 92 శాతం ఓటింగ్‌ శాతం పెంచేలా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఓటర్స్‌ టర్న్‌ అవుట్‌ ప్రణాళికను రూపొందించారని, దీనిలో భాగంగా 2,500 స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

సదుపాయాలు భేష్‌ .. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో రెండో రోజు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సజావుగా జరగడానికి అధికారులు సకల సదుపాయాలు కల్పించారు. ఏర్పాట్లపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో ముక్కంటి, కమిషనర్‌ వెంకటకృష్ణ పర్యవేక్షించారు.

11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం
1/1

11,874 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

Advertisement
Advertisement