గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్‌ కథనం | Sakshi
Sakshi News home page

గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్‌ కథనం

Published Thu, Apr 25 2024 4:32 PM

meet sirjana nijjar who fought for donkeys care and protection - Sakshi

మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్‌కు చెందిన సిర్జనా నిజ్జర్‌ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...

‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్‌.

ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్‌.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.

నాందేడ్‌లో చూసి...
మహరాష్ట్రలోని నాందేడ్‌ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్‌ క్యాంప్స్‌ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.
మూడు జిల్లాల్లో...
‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్‌లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ  ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.

వానలు వస్తే పస్తే
‘నాందేడ్, బీడ్, లాతూర్‌ జిల్లాల్లో అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్‌.పి.సి.ఏ. (సొసైటీస్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాలిటీ టు యానిమల్స్‌) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా.

 

Advertisement
Advertisement