నటుడు శ్రేయాస్‌ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..? | Sakshi
Sakshi News home page

నటుడు శ్రేయాస్‌ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?

Published Sun, May 5 2024 1:05 PM

Shreyas Talpade Said Heart Attack Could Be A Side Effect Of COVID 19 Vaccine

బాలీవుడ్‌, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్‌ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అ‍న్నారు. 

బహుశా ఇది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ డ్రైవ్‌లు చేపట్టింది. మనం కూడా సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్‌లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్‌ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్‌ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్‌మార్టంలో కూడా వ్యాక్సిన్‌ రియాక్షన్‌ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. 

కాగా, నటుడు గతేడాది డిసెంబర్‌లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్‌కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్‌ఆర్పీఎఫ్‌ గ్రౌండ్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్‌గా ఒక షాట్‌లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్‌ తర్వాత నేను నా వానిటీ వ్యాన్‌కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను  తానెప్పుడూ ఫేస్‌ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్‌ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. 

నిజంగా కోవిషీల్డ్‌ ప్రమాదకరమైనదా..?
భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్‌లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన  కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా  థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్‌)తో థ్రాంబోసిస్‌కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి పడిపోవడం జరుగుతుంది. 

అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్‌ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్‌ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. 

అలాగే ఈ ‍వ్యాక్సిన్‌ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్‌ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.

(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్‌ అబ్రహం ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! అందుకే..!)

 

Advertisement
Advertisement