పెట్రోల్‌ బంకు యజమానిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకు యజమానిపై కేసు నమోదు

Published Mon, May 6 2024 8:05 AM

పెట్రోల్‌ బంకు యజమానిపై కేసు నమోదు

చేబ్రోలు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలు బంకులో రాజకీయ పార్టీలకు చెందిన ద్విచక్ర వాహనాల ర్యాలీకి కూపన్ల ద్వారా రూ.2 వందల లెక్కన పెట్రోలు పోస్తున్న బంకు యజమానిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్‌ స్న్వాడ్‌ అధికారులు ఆదివారం తెలిపారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆధ్వర్యంలో జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, పొన్నూరు నియోజకవర్గ ఎఫ్‌ఎస్‌టీ బృందాలు సంయుక్తంగా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ పరిధిలోని సురేంద్ర ఆయిల్‌ పెట్రోల్‌ బంకును తనిఖీ చేశారు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ర్యాలీకి వెళ్లే ద్విచక్ర వాహనాలకు కూపన్‌లు తీసుకొని రూ.200లు లెక్కన పెట్రోల్‌ పోస్తున్నట్లుగా గుర్తించారు. పెట్రోలు బంకులో 374 కూపన్లు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా కూపన్లు తీసుకొని రాజకీయ పార్టీల ర్యాలీకి పెట్రోలు పోయటం చట్ట వ్యతిరేక చర్య అని అధికారులు హెచ్చరించారు. దీనిపై బంకు మేనేజర్‌ను అదుపులోకి తీసుకోవాలని పొన్నూరు నియోజకవర్గ ఎఫ్‌ఎస్‌టీ బృందం ఇన్‌చార్జి వెంకట్రావును అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దారు కిరణ్‌ కుమార్‌, ఎకై ్సజ్‌ ఎస్‌ఐ మహమూద్‌ ఆసిఫ్‌, జీఎస్టీ ఆఫీసర్‌ వైస్‌.నాగేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన రాజకీయ పార్టీ ర్యాలీ బైక్‌లకుకూపన్లతో పెట్రోల్‌ పట్టిన వైనం అసిస్టెంట్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆధ్వర్యంలో తనిఖీ

Advertisement
 
Advertisement