నిజ్జర్‌ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

నిజ్జర్‌ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

Published Sat, May 4 2024 7:35 AM

3 arrested by Canada police in Sikh activist Nijjar deceased case

ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. 

కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్‌ చేసినట్లు‌ ​పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి  5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. 

ఈ కేసులో దర్యాప్తు  కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్‌ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉ‍న్న గురునానక్ సిక్‌ గురుద్వారా సాహిబ్‌ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో  ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Advertisement
Advertisement