పోస్టల్‌ బ్యాలెట్‌ షురూ | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ షురూ

Published Sun, May 5 2024 6:10 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ షురూ

జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికల శిక్షణ పూర్తి కావడంతో ఈనెల 7వ తేదీ వరకు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయనున్నారు. మొదటి విడత ఎన్నికల శిక్షణలో పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన కల్పించారు. అనంతరం ఫారం 12 దరఖాస్తులను అందించగా పోస్టల్‌ ఓట్లకు దరఖాస్తు చేసుకున్నారు.

ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు

ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో నోడల్‌ అధికారులుంటారు. ఏమైనా ఇబ్బందులు, సందేహాలున్నా వారు నివృత్తి చేస్తారు. దరఖాస్తు ఫారంలో తెలిపిన వివరాల ప్రకారమే పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేస్తారు. శనివారం ధర్మపురి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌బ్యాలెట్‌ ఓటు హక్కును అదనపు కలెక్టర్‌ దివాకర వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement