అగ్నిగుండం | Sakshi
Sakshi News home page

అగ్నిగుండం

Published Sat, May 4 2024 5:05 AM

అగ్ని

జనగామ: జిల్లా అధిక ఉష్ణోగ్రతలతో అగ్నిగుండంగా మారింది. ఐదు రోజుల క్రితం 45 డిగ్రీల సెల్సియస్‌ దాటిన టెంపరేచర్‌.. శుక్రవారం 46.1 డిగ్రీలకు చేరింది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. ప్రజలు డీ హైడ్రేషన్‌కు గురవుతుంటే.. తాగునీరులేక మూగ జీవాలు, పక్షులు అల్లాడి పోతున్నాయి.

జఫర్‌గఢ్‌లో అత్యధికం

జఫర్‌గఢ్‌లో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రఘునాథపల్లి, జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలో 45 నుంచి 46 డిగ్రీలు దాటింది. ఆయా మండలాలకు రెడ్‌జోన్‌తో వార్నింగ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ.. మరో నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

మండలం ప్రాంతం కనిష్ట గరిష్టం

జఫర్‌గఢ్‌ జఫర్‌గఢ్‌ 35.9 46.1

రఘునాథపల్లి రఘునాథపల్లి 34.9 46.0

జనగామ వడ్లకొండ 34.4 46.0

పాలకుర్తి గూడూరు 36.5 45.5

స్టేషన్‌ఘన్‌పూర్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ 34.7 45.0

బచ్చన్నపేట బచ్చన్నపేట 35.0 44.9

చిల్పూరు మల్కాపూర్‌ 37.0 44.2

కొడకండ్ల కొడకండ్ల 34.6 44.1

దేవరుప్పుల కోలుకొండ 35.2 43.0

లింగాలఘణపురం లింగాలఘణపురం 34.3 43.0

నర్మెట నర్మెట 33.1 42.6

తరిగొప్పుల అబ్దుల్‌నాగారం 35.4 42.5

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా మజ్జిగ, ఉప్పుతో కలిపిన నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు తీసుకోవాలి. అత్యవసరంగా బయటకు వెళ్తే గొడుగు, ముఖానికి టవల్‌, తలపై టోపీ, వదులుగా ఉన్న కాటన్‌ వస్త్రాలు ధరించాలి. వడదెబ్బకు గురైన వారికి మైగ్రేడ్‌ ఫీవర్‌, వాంతులు, విరేచనాలు, సోడియం, పొటాష్‌ తగ్గిపోయి కాళ్ల నొప్పులు, పెదాలు పగిలి పోవడం లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉంటే శీతల ప్రదేశానికి తరలించి చల్లని నీటితో శరీరానికి కాస్త ఉపశమనం కలిగించాక.. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకువెళ్లాలి. తాగునీరు ఎక్కువగా తీసుకోవాలి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు వెళ్లి తెచ్చకోవచ్చు.

– డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త

జిల్లాలో 46.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు

రెడ్‌ జోన్‌లో ఐదు మండలాలు

ప్రత్యామ్నాయ చర్యలు శూన్యం

విలవిల్లాడి పోతున్న మూగ జీవాలు

అగ్నిగుండం
1/1

అగ్నిగుండం

Advertisement
 
Advertisement