నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్‌ సీఎం రాక | Sakshi
Sakshi News home page

నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్‌ సీఎం రాక

Published Mon, May 6 2024 6:40 AM

-

పాలమూరు: మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్‌లో సోమవారం నిర్వహించే బీజేపీ ఇంటలెక్చువల్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి హాజరుకానున్నారు. అలాగే జిల్లాకేంద్రంలోని సుదర్శన్‌గార్డెన్‌లో నిర్వహించే మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌లు, పార్టీ సంస్థాగతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా తీసుకుంటున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement