సమాచారానికి ‘సహకారం’ కరువు | Sakshi
Sakshi News home page

సమాచారానికి ‘సహకారం’ కరువు

Published Sun, May 5 2024 6:10 AM

సమాచా

ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన స.హ చట్టం రెండు దశాబ్దాలుగా ఎన్నో అక్రమాలను బయట పెట్టింది. కానీ ఇది నాణేనికి ఒక పార్శ్యం మాత్రమే. చట్టం వచ్చి 19 ఏళ్లు అవుతున్నా అధికారులు తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు చట్టానికి యఽథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో రుసుములు చెల్లించాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. కొందరు అధికారులైతే స.హ. చట్టం నిబంధనలు తెలియనట్లు ప్రవర్తిస్తూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.

● ఆలూర్‌ మండలం దేగాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి స.హ చట్టం కింద దరఖాస్తు చేస్తూ తాను చేసిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు తెలపాలని కోరగా.. సదరు పీఐవో సమాచారం ఇవ్వలేదు. మొదటి అప్పీల్‌ వేసినా స్పందించడం లేదు.

● కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ఒక దరఖాస్తుదారుడు సమాచార హక్కు(స.హ) చట్టం– 2005 కింద మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. బషీరాబాద్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సమాచారానికి సంబంధించి 7146 పేజీలు ఉన్నాయి.. పేజీకి రూ. 3 చొప్పున రూ. 21,438 చెల్లించాలని దరఖాస్తుదారుడికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అంతేకాక ఇదే మాదిరిగా మిగతా పంచాయతీల కార్యదర్శులు కూడా సమాచార పేజీలకు సంబంధించి పేజీకి రూ. 3 చొప్పున చెల్లించాలని తమ లేఖల ద్వారా సమాచారం అందించారు.

● జిల్లాలో ప్రతి ఏడాది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న దరఖాస్తుల సంఖ్య 2500–3000

● మొదటి అప్పీల్‌కు వెళ్తున్నవి 1800

● రెండవ అప్పీల్‌కు వెళ్తున్నవి 950

అందని సమాచారం.. పట్టని నిబంధనలు

అధిక రుసుములు వసూలు చేస్తున్న

అధికారులు

స.హ. చట్టం స్ఫూర్తికి తూట్లు

సమాచారానికి ‘సహకారం’ కరువు
1/1

సమాచారానికి ‘సహకారం’ కరువు

Advertisement
Advertisement