65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ.. | Sakshi
Sakshi News home page

65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ..

Published Sun, May 5 2024 6:15 AM

65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ..

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు మెడికల్‌ టెస్ట్‌లు ప్రారంభం

నిజామాబాద్‌నాగారం: అంగన్‌వాడీ టీచర్లు, ఆ యాల ఉద్యోగ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్ల వయస్సును నిర్ధారించింది. ఈ వయస్సు దా టిన వారు ఖచ్చితంగా ఉద్యోగ విరమణ చేయాల్సిందేనని ఆదేశాలు సైతం జారీ చేసింది. జిల్లా లో ఇప్పటికే 65 ఏళ్లు దాటిన వారు 250 మంది ఉన్నారని అధికారుల అంచనా. అయితే కొంత మంది తమ వయస్సు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టి న తేదీలు మార్చుకుంటున్న నేపథ్యంలో ప్రభు త్వం మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

జిల్లాలో నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బోధన్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌ ప్రాజెక్టు కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 1500 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 80,747, గర్భిణులు 1134, బాలింతలు 10260 మంది ఉన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 120కుపైగా టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో వీటిని భర్తీ చేస్తామని చెప్పినా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ వయస్సును ప్రకటించగా జిల్లాలో సుమారు 250మంది టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.

సర్టిఫికెట్లలో మార్పులు.. చేర్పులు

65 ఏళ్లు నిండిన ఆయాలు, టీచర్లు తమ వయ స్సు ధ్రువీకరణ పత్రాల్లో పుట్టిన తేదీలను మార్పు లు చేర్పులు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు బెనిఫిట్స్‌లో అన్యాయం జరుగుతోందని గత ప్రభుత్వానికి వీరు విన్నవిస్తే రిటైర్‌మెంట్‌ తర్వాత రూ. 50వేలు ఆయాలకు, టీచర్లకు రూ. 1లక్ష ఇస్తామని చెప్పింది. కానీ టీచర్లకు రూ.5లక్షలు, ఆయాలకు రూ. 3లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జాబితా సిద్ధం

జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు మరో మూడు రోజుల్లో మెడికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీడీఎస్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఆధార్‌కార్డులతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తూ, మెడికల్‌ పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షలతో వయస్సు ఎంతో ఉందో తేలనుంది. అప్పుడే పూర్తిస్థాయి జాబితాను సిద్ధమని అధికారులు పేర్కొంటున్నారు.

వైద్య పరీక్షలు చేస్తాం

జిల్లాలో ఉద్యోగ విరమణ వయస్సుకు దగ్గరలో ఉన్న ఆయాలు, టీచర్లకు డాక్టర్ల ద్వారానే మెడికల్‌ ఫరీక్షలు చేస్తాం. దాంతో వారి వయస్సు ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. మరో మూడు రోజుల్లో మెడికల్‌ పరీక్షలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

– రసూల్‌బీ, జిల్లా మహిళా సంక్షేమాధికారి

Advertisement
Advertisement