ఓటర్లకు తగ్గిన దూరభారం | Sakshi
Sakshi News home page

ఓటర్లకు తగ్గిన దూరభారం

Published Mon, May 6 2024 7:25 AM

ఓటర్ల

కరీంనగర్‌రూరల్‌: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 395 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు 3,67,353 ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,186, మహిళలు 1,84,123, థర్డ్‌జెండర్‌ 44 ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలు ఓటర్ల నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాల ఇబ్బందులను గుర్తించిన అధికారులు ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లకు అనుకూలంగా పోలింగ్‌ కేంద్రాలను మార్చారు. పోలింగ్‌ కేంద్రం ఓటర్లకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొత్తం 390 పోలింగ్‌ కేంద్రాలుండగా ప్రస్తుతం అదనంగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య 395కు పెరిగింది. పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పించారు.

24 పోలింగ్‌ కేంద్రాల మార్పు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని అధికారులు కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం 24 పోలింగ్‌ కేంద్రాలను మార్పు చేశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను సమీప ప్రాంతాలకు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి మరో ప్రాంతంలోని పాఠశాలలకు మార్పు చేశారు.

రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రజ్వీచమన్‌, సిటిజన్‌కాలనీ, శ్రీపురంకాలనీ, విజయ్‌నగర్‌, సెల్ఫీనగర్‌ కాలనీలు కార్పొరేషన్‌కు ఆనుకుని ఉన్నాయి. ఆయా కాలనీలకు చెందిన సుమారు 4వేల మంది ఓటర్లు బొమ్మకల్‌, గుంటూరుపల్లి, లక్ష్మీనగర్‌లోని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 121, 122, 123, 124, 125 వెళ్లేందుకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలను మార్పు చేయాలని స్ధానికులు పలుమార్లు కలెక్టర్‌, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ప్రస్తుత లోక్‌సభ ఎ న్నికలకు పో లింగ్‌ కేంద్రాలను మార్పు చేసి స్థానికంగా ఏర్పాటు చేశారు.

అందుబాటులో పోలింగ్‌ కేంద్రాలు

కరీంనగర్‌ నియోజకవర్గంలో

24పోలింగ్‌ కేంద్రాల మార్పు

రెండు దశాబ్దాల ఇబ్బందులకు చెక్‌

ప్రాంతం పోలింగ్‌ కేంద్రం పాతది కొత్తది

నగునూరు 81 మండల పరిషత్‌ పాఠశాల జెడ్పీ పాఠశాల

నగునూరు 82 మండల పరిషత్‌ పాఠశాల జెడ్పీ పాఠశాల

మొగ్ధుంపూర్‌ 99 మండల పరిషత్‌ పాఠశాల జెడ్పీ పాఠశాల

గుంటూరుపల్లి 121 మండల పరిషత్‌ పాఠశాల సిద్ధార్థ హైస్కూల్‌

గుంటూరుపల్లి 122 మండల పరిషత్‌ పాఠశాల జెమ్స్‌ పాఠశాల

లక్ష్మీనగర్‌ 123 మండల పరిషత్‌ పాఠశాల జెమ్స్‌ స్కూల్‌

అశోక్‌నగర్‌ 205 భారతీయ విద్యానికేతన్‌ షాషాబీ ప్రభుత్వ పాఠశాల

అశోక్‌నగర్‌ 206 భారతీయ విద్యానికేతన్‌ ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌ గది

కరీంనగర్‌ 254 ఏడీ అగ్రికల్చర్‌ ఖార్ఖానగడ్డలోని ఏఏంసీ

కరీంనగర్‌ 256 ఏరువాక ఏఎంసీ

కరీంనగర్‌ 257 ఏరువాక ఏఏంసీ రైతుల విశ్రాంతిగది

కరీంనగర్‌ 297 టెట్రా మోడల్‌స్కూల్‌ లెజెండ్‌ స్కూల్‌

కరీంనగర్‌ 298 టెట్రా స్కూల్‌ లెజెండ్‌ స్కూల్‌

భగత్‌నగర్‌ 302 శ్రీచైతన్య కళాశాల సిద్ధార్థ హైస్కూల్‌

భగత్‌నగర్‌ 303 శ్రీచైతన్య కళాశాల సిద్ధార్థ హైస్కూల్‌

భగత్‌నగర్‌ 333 వివేకానంద విద్యానికేతన్‌ సెంట్రల్‌ వేర్‌హౌస్‌

భగత్‌నగర్‌ 334 వివేకానంద విద్యానికేతన్‌ సెంట్రల్‌ వేర్‌హౌస్‌

గోదాంగడ్డ 341 సెంట్రల్‌వేర్‌హౌస్‌ సప్తగిరికాలనీ ఉన్నత పాఠశాల

గోదాంగడ్డ 342 సెంట్రల్‌వేర్‌హౌస్‌ సప్తగిరికాలనీ ఉన్నత పాఠశాల

మంకమ్మతోట 354 వేదం హైస్కూల్‌ సిద్ధార్థ హైస్కూల్‌

మంకమ్మతోట 355 వేదం హైస్కూల్‌ సిద్ధార్థ హైస్కూల్‌

మంకమ్మతోట 356 వేదం హైస్కూల్‌ సిద్ధార్థ హైస్కూల్‌

మంకమ్మతోట 357 వేదం హైస్కూల్‌ సిద్ధార్థ హైస్కూల్‌

ఓటర్లకు ఇబ్బంది తప్పింది

కొన్ని దశాబ్దాల నుంచి ఆయా కాలనీవాసులు ఓట్లు వేసేందుకు పడరానీపాట్లు పడ్డారు. కాలనీలకు పోలింగ్‌ కేంద్రాలు దూరంగా ఉండటంతో ప్రతీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం తగ్గింది. ప్రస్తుతం ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఆయా కాలనీల పరిధిలో ఏర్పాటు చేయడంతో ఓటర్లకు ఇబ్బంది తప్పింది. – సయ్యద్‌ ముజాఫర్‌, లోక్‌సత్తా ప్రతినిధి

ఓటర్లకు తగ్గిన దూరభారం
1/3

ఓటర్లకు తగ్గిన దూరభారం

ఓటర్లకు తగ్గిన దూరభారం
2/3

ఓటర్లకు తగ్గిన దూరభారం

ఓటర్లకు తగ్గిన దూరభారం
3/3

ఓటర్లకు తగ్గిన దూరభారం

Advertisement
 
Advertisement