కాంగ్రెస్‌లో చేరికలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరికలు

Published Mon, May 6 2024 12:10 AM

కాంగ్రెస్‌లో చేరికలు

వైరా: బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి పలువురు నాయకులు ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కొణిజర్ల మండలం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు యంట్రప్రగడ చిరంజీవి, ఏలూరి శ్రీనివాసరరావు, సొసైటీ చైర్మన్‌ చెరుకుమల్లి రవి, తీగలబంజర మాజీ సర్పంచ్‌ షేక్‌ అఫ్జల్‌బీ, దాదూ దంపతులు, గోపవరం బీఆర్‌ఎస్‌ నాయకుడు గుర్రం రామకృష్ణ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు, వైరా మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరికంటి డేడీకుమారి, శివ దంపతులు, ఇమ్మడి రామారావు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, శీలం వెంకటనర్సిరెడ్డి, గోసు మధు, దొబ్బల సౌజన్య, దాసరి దానియేలు, రాంపూడి రోశయ్య, గుమ్మా రోశయ్య, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement