35 మంది మావోయిస్టుల లొంగుబాటు | Sakshi
Sakshi News home page

35 మంది మావోయిస్టుల లొంగుబాటు

Published Mon, May 6 2024 12:10 AM

35 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరవ్‌రాయ్‌ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌శాఖ చేపట్టిన పూనా నార్కొమ్‌ ప్రచారానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వనం వీడి జనం బాట పడుతున్నారని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల అటవీ ప్రాంత గ్రామాల్లో కొంత కాలంగా కొనసాగుతున్న లోన్‌ వర్రాటో (ఇంటికి తిరిగి రండి) కార్యాక్రమంలో భాగంగా బీజాపూర్‌, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని వివిద ప్రాంతాల్లో పని చేస్తున్న 35 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వారిలో ముగ్గురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందని, లొంగిపోయిన వారందరికీ పోలీస్‌ శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు వెల్లడించాచారు. లోన్‌ వర్రాటో కార్యక్రమం చేపట్టిన నాటి నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 796మంది మావో యిస్టులు లొంగిపోయారని, వారిలో 180 మందిపై రివార్డులు ఉన్నాయని ఎస్పీ వివరించారు.

వివరాలు వెల్లడించిన దంతెవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement