ఇంటింటికీ పోల్‌ చీటీలు | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ పోల్‌ చీటీలు

Published Mon, May 6 2024 7:35 AM

ఇంటింటికీ పోల్‌ చీటీలు

● ఓటర్లకు అందజేస్తున్న బీఎల్‌వోలు ● పోలింగ్‌ స్లిప్పులపై పూర్తి సమాచారం ● జిల్లాలో 4,56,309 మంది ఓటర్లు

ఆసిఫాబాద్‌: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కలెక్టర్‌ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశా రు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కు ఈవీఎంలు, వీవీ ప్యాట్లతోపాటు అవసరమైన ఇ తర సామగ్రి సమకూర్చేందకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు కసర త్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు పోలింగ్‌ చీటీలు పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల పరిధిలో బూత్‌స్థాయిలో పోల్‌ చీటీల పంపిణీ కొనసాగుతోంది. బీఎల్‌వోలు గడపగడపకూ వెళ్లి ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులు అందజేస్తున్నారు.

ఓటర్‌ స్లిప్పుపై పూర్తి వివరాలు

ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లోని అన్ని బూత్‌ల్లో పోలింగ్‌ చీటీల పంపిణీ చేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నారు. ఓటర్లకు పూర్తి సమాచారం తెలిసేలా పోలింగ్‌ చీటీలపై నియోజకవర్గం, ఓటరు పేరు, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌తోపాటు పూర్తి వివరాలు పొందుపరిచారు. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎన్నికల సంఘం చీటీలను తయారు చేసింది. జిల్లాలో 4,56,309 మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 2,27,208, సిర్పూర్‌ నియోజకవర్గంలో 2,29,101 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 676 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సిర్పూర్‌లో 320, ఆసిఫాబాద్‌లో 356 కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ స్టేషన్లలో విద్యుత్‌, తాగునీరు, దివ్యాంగులకు ర్యాంపులతో పాటు అన్ని రకాల వసతుల కల్పిస్తున్నారు. 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు హోంఓటింగ్‌కు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. జిల్లాలో హోం ఓటింగ్‌ కోసం 157 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఆసిఫాబాద్‌లో 29 మంది, సిర్పూర్‌లో 128 మంది ఇంటి నుంచి ఓటు వేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement