దుర్గమ్మ సన్నిధిలో ఆర్జిత సేవలకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో ఆర్జిత సేవలకు డిమాండ్‌

Published Mon, May 6 2024 7:00 AM

దుర్గ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు, తీర్థయాత్రలలో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు, యాత్రికుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపున అమ్మవారికి తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, ఇతర ఆర్జిత సేవలలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. మరో వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఉన్న రద్దీ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తగ్గింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత రద్దీ మళ్లీ పెరిగింది.

దుర్గమ్మ సన్నిధిలో ఆర్జిత సేవలకు డిమాండ్‌
1/1

దుర్గమ్మ సన్నిధిలో ఆర్జిత సేవలకు డిమాండ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement