హోం ఓటింగ్‌ పరిశీలన | Sakshi
Sakshi News home page

హోం ఓటింగ్‌ పరిశీలన

Published Mon, May 6 2024 3:00 AM

హోం ఓటింగ్‌ పరిశీలన

జడ్చర్ల టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా కొనసాగుతున్న హోం ఓటింగ్‌ ప్రక్రియను ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచో భూటియా పరిశీలించారు. 85 ఏళ్లు దాటిన, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఈ మేరకు జడ్చర్ల మండలంలో 29 మంది ఓటర్లు హోం ఓటింగ్‌ వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఓటర్ల వద్దకు రెండు బృందాలు వెళ్లి బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేయించారు. ఈ ప్రక్రియను నిమ్మబావిగడ్డలో ఓటరు ఇంటి వద్ద ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు, ఓటు వేసే విధానాన్ని పరిశీలకులు భూటియా పరిశీలించారు. ఓటర్లను కలిసి మాట్లాడారు. హోం ఓటింగ్‌ వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. రూట్ల వారీగా జరుగుతున్న హోం ఓటింగ్‌ వివరాలను అసిస్టెట్‌ రిటర్నింగ్‌ అధికారి మోహన్‌రావు ఆయనకు వివరించారు.

Advertisement
Advertisement