పక్కాగా పరిశీలన.. | Sakshi
Sakshi News home page

పక్కాగా పరిశీలన..

Published Mon, May 6 2024 3:00 AM

-

సాధారణంగా ఎన్నికలంటే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్రజాస్వామ్యాన్ని అరికట్టేందుకు, ఎన్నికల్లో పారదర్శకత ఉండేందుకు ఎన్నికల కమిషన్‌ ఖర్చులపై నిబంధన విధించింది. ప్రతి రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఈసీ వ్యయ పరిశీలనతో పాటు కేంద్రం, రాష్ట్ర ఎన్‌పోర్స్‌మెంట్‌ సంస్థలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు, వీడియో సర్వేలైన్స్‌ బందాలు సమాచారాన్ని సేకరిస్తాయి. అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు ఆడిట్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభలతోపాటు ర్యాలీలు, రోడ్‌షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి భోజనం, టీ, కాఫీ వరకు అంతా లెక్కిస్తారు. అభ్యర్థుల ఖర్చు వివరాలపై పరిమితి ఉన్నా ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అనే విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

Advertisement
Advertisement