ఓటు హక్కును వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Published Mon, May 6 2024 3:30 AM

ఓటు హక్కును వినియోగించుకోవాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. ఆదివారం స్వీప్‌ ఆధ్వర్యంలో మెయిన్‌ స్టేడియం గ్రౌండ్స్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు 5కే రన్‌, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో మెప్మా సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్‌పీలు, రెవెన్యూ ఉద్యోగులు, ట్రాన్స్‌జెండర్లు సుమారు 600 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’, ‘ఓటు హక్కు.. ప్రజల హక్కు’, ‘ఓటేసే బాధ్యత మనందరిది’, ‘బుల్లెట్‌ కన్నా.. బ్యాలెట్‌ మిన్న’ అని నినాదాలు చేశారు. అలాగే ఓట్ల పండుగపై కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో 18 ఏళ్లు దాటిన వారందరూ తమ ఓటును తప్పక వేయాలన్నారు. ఏ ఒక్క ఓటూ వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనేలా కృషి చేయాలన్నారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీధర్‌ సుమన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement