కాసవేణ రవికి కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

కాసవేణ రవికి కన్నీటి వీడ్కోలు

Published Sun, May 5 2024 5:00 AM

కాసవేణ రవికి కన్నీటి వీడ్కోలు

● స్వగ్రామం వంగరలో అంత్యక్రియలు ● హాజరైన అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీలు

బెల్లంపల్లి: మావోయిస్టు దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి ఉరఫ్‌ అశోక్‌ ఉరఫ్‌ వినయ్‌(48)కు అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. రవి గత మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని టేక్‌మేటా–కాంకూర్‌ గ్రామాల మధ్య పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. రవి భౌతిక కాయంపై ఎర్రజెండా కప్పి, పూలు చల్లి జోహార్లు అర్పించారు. రవి పెద్ద అన్న కాసవేణ వెంకటేష్‌ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర నాయకురాలు పద్మకుమారి, సికాస మాజీ నాయకుడు మహ్మద్‌ హుస్సేన్‌, విప్లవ రచయిత సంఘం నాయకులు, అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మాజీ పీపుల్స్‌ వార్‌, సింగరేణి కార్మిక సమాఖ్య సభ్యులు, సానుభూతి పరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement