రజకులకు అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

రజకులకు అండగా ఉంటాం

Published Sun, May 5 2024 3:20 AM

రజకుల

కోవెలకుంట్ల: రజకులకు అన్ని విధాలా అండగా ఉండి వారి అభ్యున్నతికి పాటుపడతామని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. పట్టణ శివారులోని మహాలక్ష్మి ఫంక్షన్‌హాలులో నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల మండలాల రజకులతో ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆల్వకొండ మద్దిలేటి అధ్యక్షతన శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కర్రా గిరిజా హర్షవర్ధన్‌రెడ్డి, గ్రామ సచివాలయాల బనగానపల్లె నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ జీసీఆర్‌ సూర్యనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ బీవీ నాగార్జునరెడ్డి, మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ వాసగిరి సాయికృష్ణమూర్తి, రైతు సంఘం అధ్యక్షుడు కానాల రవీంద్రనాథరెడ్డి, కర్రా తేజవర్ధన్‌రెడ్డి, ఏపీ ఎన్‌జీఓల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నవరత్న పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా నిలిచిందన్నారు. మహిళా సంక్షే మానికి పెద్దపీట వేసి వైఎస్సార్‌ చేయూత, ఆసరా, అమ్మఒడి, తదితర సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చారన్నారు.

కూటమి మాయమాటలు నమ్మొద్దు..

కుట్రలు, కుతంత్రాలతో ప్రజల్లోకి వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాయమాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సూచించారు. 2014 ఎన్నికల్లో 650 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరలా ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ నాయకులు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజల్లోకి వస్తున్నారన్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని రజకులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో 25 సెంట్ల స్థలాన్ని కేటాయించి రూ. 30 లక్షలతో రజక కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేశామన్నారు. బనగానపల్లె పట్టణంలో రజకులు బట్టలు ఉతికి ఆరవేసుకునేందుకు రూ. 4 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయించామన్నారు. ఎన్నికల తర్వాత బనగానపల్లెలో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బాల తిమ్మయ్య, రాజశేఖర్‌, పెద్ద ఓబులేసు, నరసింహులు, నాగయ్య, నాగ శేషులు, సుబ్బరాయుడు, ఓబులేసు, ముసలయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, నాగేంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు గజ్జెలరెడ్డి, దశరథరామిరెడ్డి, డీసీ ఉసేన్‌, తదితరులు పాల్గొన్నారు.

మంచి చేసిన ప్రభుత్వాన్ని

ఆదరించండి

రజకుల ఆత్మీయ సమావేశంలో

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

రజకులకు అండగా ఉంటాం
1/1

రజకులకు అండగా ఉంటాం

Advertisement
Advertisement