No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 14 2024 1:15 PM

-

● ఊట్కూర్‌లో 37,38 బూత్‌లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు అప్రమత్తమై సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఓటింగ్‌ కొనసాగింది. మద్దూర్‌లోని 67 బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో రెండు గంటల పాటు ఆలస్యంగా ఓటింగ్‌ ప్రారంభమైంది. దీంతో కొంత మంది ఓటు వేయకుండానే వెనుగిరిగారు. కానుకుర్తిలో 69 బూత్‌లో అరగంట పాటు ఆలస్యంగా ఆరంభమైంది.

● సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియగా.. పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలతో పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పాలమూరుకు బయలు దేరారు.

జిల్లాలో..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ (ఉన్నత) గ్రౌండ్‌ పాఠశాలలో గల 130వ పోలింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ సతీమణి శశికిరణ్‌ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ధన్వాడలో ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి, కోయిలకొండ మండలం శేరివెంకటపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, పేటలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కుంభం శివకుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ ఓటు వేశారు. జాజాపూర్‌ గ్రామపంచాయతీ పరిధి జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో ట్రాన్స్‌జెండర్‌ జనని ఓటు వేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement