పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే.. | Sakshi
Sakshi News home page

పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..

Published Sun, May 5 2024 12:34 PM

Caught Cobra After 4 Days Surprised Seen

పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  

బుందేల్‌ఖండ్‌లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్‌ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన  30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్‌ బాబా తెలిపారు.

నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి.

Advertisement
Advertisement