స్వీప్‌ కార్యక్రమాలు విస్తృతం చేయాలి | Sakshi
Sakshi News home page

స్వీప్‌ కార్యక్రమాలు విస్తృతం చేయాలి

Published Sun, May 5 2024 3:25 AM

-

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో పోలింగ్‌శాతం పెంచేలా స్వీప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ను విస్తృతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వీప్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఓటుహక్కు విని యోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌లో జిల్లాలోని ఓటర్లంతా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్స్‌ అధికసంఖ్య లో పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంప్‌, వీల్‌ చై ర్స్‌ తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 636 మంది దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు హోం ఓటింగ్‌ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపుకార్డులు అందజేశారు. డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమాధికారి నాగమణి, అధికారులు, సిబ్బంది, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్స్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement