వాతావరణం | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Sun, May 5 2024 3:30 AM

వాతావరణం

ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి పెరిగి ఉక్కపోత తీవ్రమవుతుంది. వడగాలులు వీస్తాయి. పలుచోట్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది.

లక్ష మెజార్టీ సాధిస్తాం

రాహుల్‌ సభను సక్సెస్‌ చేయాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ బరిలో కాంగ్రెస్‌ మొదటిసారి ఒక మహిళను నిలిపిందని, లక్ష మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని రాష్ట్ర మంత్రి సీతక్క కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆత్రం సుగుణ ప్రజాసమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవాలని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఆత్రం సుగుణ తరఫున ప్రచారం చేసేందుకు ఆదివారం ఉదయం 11గంటలకు నిర్మల్‌లోని క్రషర్‌ రోడ్డు ప్రాంతంలో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ పాల్గొనే సభను సక్సెస్‌ చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సత్తు మల్లేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, నిర్మల్‌ పట్టణా ధ్యక్షుడు నాందేడపు చిన్ను తదితరులున్నారు.

Advertisement
Advertisement