మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా

Published Sun, May 5 2024 5:15 AM

-

పార్వతీపురం టౌన్‌: మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ వి.రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్‌, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ పరిధిలో గల 53 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 8 బార్లలో అమ్మకాలను పరిమితులకు లోబడి సీసీటీవీ నిఘాలో పర్యవేక్షిస్తున్నామన్నారు. ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో నెల్లిమర్ల, ఇచ్చాడ నుంచి జీపీఎస్‌తో అనుసంధానించిన వాహనాల ద్వారా మద్యం సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ నిర్వహించిన దాడుల్లో భాగంగా 5కేసులు నమోదు చేసి 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.46,250 విలువగల 253 మద్యం సీసాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించిన షాపుల్లో పనిచేస్తున్న 1 సూపర్‌వైజర్‌, నలుగు రు సేల్స్‌మెన్‌ను విధుల నుంచి తొలగించామన్నా రు. ఎకై ్సజ్‌ నేరాలు, ఫిర్యాదులపై సమాచారానికి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం ఉన్నవారు ఫోన్‌ 9392679980, 8500900923 నంబర్లకు కాల్‌ చేసి ఎకై ్సజ్‌ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని పిలుపునిచ్చారు. మద్యం అక్రమ అమ్మకాలపై ఎకై ్సజ్‌, ఎస్‌ఈబీ శాఖల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

5కేసుల నమోదు, 8 మంది అరెస్ట్‌

ఎకై ్సజ్‌ సీఐ వి.రవికుమార్‌

Advertisement
 
Advertisement